Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురి మృతి, మరో ఎనిమిది మందికి గాయాలు
వాషింగ్టన్ : అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల కలకలాన్ని సృష్టించాయి. పెన్సకోలాలోని నౌకాశ్రయంలో సౌదీ ఎయిర్ ఫోర్స్ ట్రైనర్ కాల్పులకు పాల్పడడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే స్పందించిన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని హతమొందించారు. ఈ ఘటన శుక్రవారం నేవల్ ఎయిర్‌స్టేషన్‌లో చోటుచేసుకున్నది. ఈ కాల్పుల్లో మరో ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? అన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నామనీ, అలాగే కొందరు సౌదీ పౌరులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.