Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలేం: ఇజ్రాయిల్ వైమానిక దాడిలో ఐఎస్ కమాండర్ బహా అబూ అల్ అటా మృతి చెందాడు. అతనితో పాటు భార్య కూడా మృతిచెందినట్టు ఇజ్రాయిల్ ఆర్మీ పేర్కొంది. అబూ ఇంటిపై క్షిపణి దాడికి పాల్పడినట్టు తెలిపింది. అబూ ఒక 'టైం బాంబు' లాంటివాడని, ఉగ్ర దాడులకు అతడు సన్నాహాలు చేస్తుంటాడని తెలిపింది.గాజా నగరంలోని ఓ భవనం మూడో అంతస్తులో అల్-అటా దంపతులు నిద్రపోతుండగా ఇజ్రాయిల్ ఈ దాడి జరిపిందని పాలస్తీనాలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అల్-అటా దంపతులకు నలుగురు సంతానం. ఒక పొరుగింటి వ్యక్తి ఈ దాడిలో గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. అల్-అటా హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఐఎస్ ప్రకటించింది. అల్-అటా మృతి నేపథ్యంలో గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడులు జరిగాయి. దాదాపు 50 రాకెట్లను ప్రయోగించారు. వీటిలో కొన్ని గాజా సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ నగరం సోడెరాట్‌ను తాకాయి.