Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8మంది మృతి, 20 మందికి గాయాలు
డమాస్కస్: సిరియా మరో సారి పేలుళ్లతో దద్దరిల్లింది. సిరియాలోని సూలుక్ గ్రామంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. ఐఎస్ సభ్యులే పేలుడుకు పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. టర్కీ రక్షణ శాఖ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం...ఓ బేకరీకి సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృత చెందారు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. గతవారం కూడా ఇదే తరహాలో సిరియాలో పేలుళ్లు సంభవించాయని పేర్కొంది. అజాజ్ నగరంలోని సెంట్రల్ సిటీ ప్రాంతంలోని జనసమ్మర్థం అధికంగా ఉన్నపుడు కారును డిటనేటర్లతో పేల్చివేశారు. ఈ ఘటనలో 14 మంది మృతిచెందగా, మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. రఖ్కా నగరంలోని కమాండ్ సెంటరు వద్ద కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్స్ కారు బాంబు పేల్చివేతలో పదిమంది మరణించారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే అజాజ్ నగరంలో గుర్తుతెలియని వ్యక్తులు కారును డిటోనేటర్లతో పేల్చివేశారు. ఈ పేలుళ్ల ఘటన మరిచిపోకముందే మరోసారి పేలుళ్లు సంభవించడం గమనార్హం.