Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్ : అఫ్ఘానిస్థాన్ సైన్యం లోగర్ ప్రావిన్స్‌లో జరిపిన వైమానిక దాడిలో తాలిబన్ కమాండర్ వాయిసుద్దీన్ హతమయ్యాడు. గతవారం అఫ్ఘాన్‌లో ముగ్గురు న్యాయమూర్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ దాడిలో వాయిసుద్దీన్ హస్తముందని ఆర్మీ అనుమానిస్తున్నది. దీంతో, పక్కా ప్రణాళికతో అతడి శిబిరంపై సైన్యం దాడి జరిపింది. ఈనెల 6న లోహార్ ప్రావిన్స్ లోని మొహమ్మద్ అఘా జిల్లాలో తాలిబన్లు ఆ ముగ్గురు న్యాయమూర్తులను చంపినట్టు అధికారులు తెలిపారు. బాక్లీయాబాద్ ప్రాంతంలో ఆ రోజు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి ఈ ఘటనకు పాల్పడ్డారని వివరించారు. తమ కమాండర్‌ను అఫ్ఘాన్ సేనలు మట్టుబెట్టిన విషయంపై తాలిబన్లు స్పందించలేదు.