Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మహబూబాబాద్
జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ నంద్యాల కోటిరెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణంలోని రద్దీ ప్రదేశాలైన రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్, నెహ్రూ సెంటర్, తొర్రూర్ బస్ బస్టాండ్‌ల్లో అనుమానిత వ్యక్తుల బ్యాగులను ఆదివారం తనిఖీ చేశారు. క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైనందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఘటనలు జరిగిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ తనిఖీలు అడ్మిన్ నర్సయి, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అంజయ్య, అశోక్. శ్రీకాంత్ పాల్గొన్నారు.
మైనర్‌లకు వాహనం ఇస్తే కఠిన శిక్షలు...
మైనర్‌లకు వాహనం ఇస్తే వారి తల్లిదండ్రులకు కఠిన శిక్షలు తప్పవని ఎస్పీ ఎన్. కోటిరెడ్డి అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ఆదివారం మైనర్లపై దష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 35 మందిని గుర్తించి ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించి వాహనాలు ఇవ్వకూడదన్నారు. ఏదైనా జరగకూడని జరిగితే పూర్తి బాధ్యత వహించాల్సింది తల్లితండ్రులేనని హెచ్చరించారు. మోటర్ వెహికల్ చట్టం-2019 ప్రకారం ఏదైన జరిగితే తల్లిదండ్రులపై లేదా వాహన యజమానిపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హత కలిగిన వారు డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై ఎవరైనా మైనర్లు రాష్ డ్రైవింగ్ చేస్తే వెంటనే బండి నెంబర్ నోట్ చేసుకొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కు సమాచారం అందించాలన్నారు.