Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ఆంధ్ర విద్యాభివర్థిని సంఘం ఆవిర్భవించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకల నిర్వహణ కోసం ఏవీవీ విద్యా సంస్థల అధ్యక్షుడు నాగబండి నర్సింగరావు అధ్యక్షతన పూర్వవిద్యార్థులు కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యకుడిగా బొమ్మనేని రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడుగా సత్యనారాయణరావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా ఓంప్రకాష్, సభ్యులుగా డాక్టర్ నారాయణరెడ్డి, డాక్టర్ పవన్‌కుమార్, రాజేందర్, ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నర్సింగరావు, విజయకుమార్, భూజిందర్‌రెడ్డి, విజయలక్ష్మి, గౌరవ సలహాదార్లుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, బొల్లం సంపత్, మేయర్ గుండా ప్రకాష్‌రావు, డాక్టర్ సుధాకర్, శ్రీరామ శ్రీనివాస్, మారం వీరప్రతాప్ ఎన్నికయ్యారు. అనంతరం అధ్యక్షుడు రవీందర్‌రావు మాట్లాడారు. ప్లాటినం జూబ్లీ వేడుకల నిర్వహణ కోసం అందరూ సాయం అందించాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో చందా శ్రీకాంత్, రాజ్‌కుమార్, చకిలం మదన్‌మోహన్, ఎస్‌ఎస్‌వీఎన్ శర్మ, మురళీమోహన్, ఉపేంద్రశాస్త్రి, వెంకటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.