Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
మానస ఘటనలో నిందితున్ని కఠినంగా శిక్షించాలని గొర్రెలమేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి సాదం రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని మల్లన్నగుడి ప్రాంగణంలో జీఎంపీఎస్ పట్టణ కమిటీ సమావేశం గంగుల మల్లన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సాదం రమేష్ పాల్గొని మాట్లాడుతూ పట్టణంలోని గొల్లకురుమలకు గొర్రెలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రెండో విడత డీడీలు తీసిన లభ్దిదారులు గొర్రెల కోసం ఎదురుచేస్తున్నారని తెలిపారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహాం వద్ద మానసయాదవ్ చిత్రపటానికి నివాళులు అర్పించి మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించాలని లేకుంటే పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ నాయకులు జాయ మల్లేశం, ఓమోటే దేవేందర్, మల్లయ్య, భిక్షపతి, చెంద్రయ్య, బీదన్ భాస్కర్, కానుగంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.