Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్నా భోజన కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నా కార్మికులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో ఏఓ మహేష్‌బాబుకు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 17 ఏండ్లుగా మధ్యాహా భోజన కార్మికులు తక్కువ జీతాలకు పనిచేస్తున్నారని తెలిపారు. పక్క రాష్ట్రంలో రూ.3వేలు వేతనం ఇస్తే తెలంగాణ వెయ్యి మాత్రమే ఇవ్వడం అన్యామన్నారు. జీతాలు సరిపోక అప్పులు తెచ్చి, విద్యార్థులకు భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా జీతాలు, బిల్లులు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాఠశాలల్లో వంట నిర్వాహణ కోసం షెడ్లు, వంటపాత్రలు, మంచినీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు. కార్మికులకు సామాజిక భద్రత, ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నా భోజన కార్మికుల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, స్వర్ణలత, నాయకులు రాజేశ్వరి, రజిత, శారద, సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.