Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ సీ నారాయణరెడ్డి
నవతెలంగాణ- ములుగు
ములుగు జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి అన్నారు. సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ధాన్యం కొనుగోలుపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 119 కొనుగోలు కేంద్రాలకు మంజూరు ఇచ్చినట్టు తెలిపారు. ఇందులో 56 పీఏసీఎస్, 39 ఐకేపీ, 24 జీసీసీ ఉన్నాయని అన్నారు. ఇప్పటికే 15 పీఏసీఎస్, 7 ఐకేపీ, 4 జీసీసీ ద్వారా కేంద్రాలు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. మిగతా కేంద్రాలన్ని గురువారం లోగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కేంద్రంలో 5 వేల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంచాలన్నారు. రైతులకు పూర్తి అవగాహన కల్పించి, మిల్లర్ వద్ద తూకంలో కోత లేకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కొనుగోలు వివరాలపై ఏ రోజుకారోజు నివేదిక సమర్పించాలన్నారు. కొనుగోలు ప్రక్రియలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు.