Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల షెడ్యూల్‌ను విద్యాశాఖ ఉన్నతాధికారులు విడుదల చేశారు. ఈ మేరకు జీవో నెంబర్ 41 ప్రకారం కమిటీల ఎన్నికలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ఎక్స్‌అఫిషియో స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ టీ.విజరుకుమార్ ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు. ఈ నెల 30న నిర్వహించ నున్న కమిటీ ఎన్నికల ప్రక్రియలో ముందస్తుగా 22న పాఠశాలలోని నోటీస్ బోర్డుపై ఎన్నికల నిర్వహణపై ప్రదర్శించనున్నారు. 22న విద్యార్థుల తల్లిదండ్రుల (ఎస్‌ఎంసీ సభ్యులు) జాబితాను నోటీస్ బోర్డుపై పేర్కొంటారు.