Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఉద్యమాల పొద్దుపొడుపు | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Dec 09,2019

ఉద్యమాల పొద్దుపొడుపు

అనగనగా ఒక ఊరు.. ఊరిపేరు సూర్యాపేట. నేటికీ త్యాగాల తడి ఆరని నాటి ఆ యుద్ధ భూమిలో పొడిచిన పొద్దుపొడుపే బొమ్మగాని ధర్మభిక్షం. ఈ మాత్రం వివరాలు చాలు.. ఆ మట్టి తన గుండెల్లో దాచుకున్న ఓ యోధుని జ్ఞాపకాలు మన హృదయాలను ఆక్రమిస్తాయి..! అయినా మట్టిదేముంది.. ఆశ్రయించినా, ఆక్రమించినా అక్కున చేర్చుకుంటుంది. కాకపోతే.. ఆశయంతో చెంత చేరినవాడు ఆకుపచ్చని అరణ్యమై నిలుస్తాడు.. అధికారంతో చెరబట్టాలని చూసిన వాడు శిథిలాల్లో సమాధులై మొలుస్తాడు. ధర్మబిక్షం మొదటి కోవకు చెందినవాడు. నేల పొరల్లోని మూలాల్లోకి దిగి.. అక్కడ నీటి చుక్కలూ చెమట చుక్కల పవిత్ర సంగమాన్ని దర్శించినవాడు. చెరబడ్డ భూమిని విముక్తి చేయడానికి సాయుధ పోరాటమై సాగినవాడు. కమ్యూనిస్టులు పోరాటయోధులే కాదు, ఈ మట్టితల్లి కన్న అత్యున్నత మానవులని నిరూపించిన ఎందరో మహానుభావుల్లో అతనూ ఒకడు! అతడు ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన నిరుపేద మానవుడే కావచ్చు... కానీ నిజాం నిరంకుశత్వాన్ని సవాలు చేసిన విప్లవ సైనికుడు! గరికపోచను తలపించే బక్కపలుచని మనిషే కావొచ్చు.... కానీ ప్రవాహానికి తలవంచని బలవంతుడు..!
      ఆయన అసలు పేరు భిక్షం. ఈ భిక్షం 'ధర్మ భిక్షం'గా ప్రఖ్యాతినొందడం వెనుక.. ఓ 89 ఏండ్ల జీవితముంది. ప్రమాణికమైన, విప్లవ కరమైన ఓ అత్యున్నత జీవన విధానముంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు.. విద్యార్థి ఉద్యమ నేతగా ఆనాటి హైద్రాబాద్‌ కొత్వాల్‌ రాజ్‌బహుద్దూర్‌ వెంకటరామరెడ్డిచే ''భిక్షం మాంగా ధర్మ్‌.. కియా ఇన్‌కా నామ్‌ ధర్మ భిక్షూ హై'' అని ప్రకటించబడిన నాటినుండి ఆయన ధర్మభిక్షంగా సార్ధక నామధేయుడయ్యాడు. కల్లుగీత కార్మికులైన బొమ్మ గాని ముత్తిలింగం, గోపమ్మ దంపతుల ఇంట 1922లో జన్మించిన ధర్మభిక్షం.. ఓ విద్యార్థి నాయకుడిగా మొదలై, హాకీ టీమ్‌ కెప్టెన్‌గా, ఆ పైన ఆర్యసమాజ్‌ సారథిగా, జర్నలిస్టుగా, ఆంధ్రమహాసభ ఆర్గనైజర్‌గా, తెలంగాణ సాయుధపోరట యోధుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, వీటన్నిటికీ మించిన ఉత్తమ కమ్యూనిస్టుగా తన 89ఏండ్ల జీవనయానమంతా ధర్మానికి ప్రతినిధిగానే కొనసాగాడు. ధర్మమూర్తిగానే వెలుగొందాడు.
సహజంగా సాత్వికుడూ, శాంతిస్వరూపుడూ అయిన ఈ సహృదయుడు.. అసమాన సాహసిగా ఓ సాయుధ పోరాటమయ్యాడంటే.. అతడినలా రూపుదిద్దిన కాలం ఎంత కఠోరమైనదై ఉండాలి..!? నిజాం రక్కసి మూకల స్వైరవిహారంలో.. సమస్త జనావళి కనిపించని సంకెళ్లలో జీవిస్తున్న కాలంలో.. సాటి మనుషుల కష్టాలకు చలించి పోయే ఆయనలోని మంచితనం, మనిషితనమే అతడిలోని సాహసిని మేల్కొలిపింది. సామ్యవాద సిద్ధాంతం అ సాహసి ని కమ్యూనిస్టుగా తీర్చిదిద్దింది. దేశమంతటా స్వాతంత్య్రో ద్యమ జ్వాలలు ఎగసిపడుతున్న వేళ.. విద్యార్థి దశలోనే ఆయనలో జాతీయ భావాలు పురుడు పోసుకున్నాయి. తెల ంగాణలో ఎటు చూసినా నిజాం రాచరిక చీకటిపాలనే అలు ముకున్న వేళ.. కమ్యూనిజం ఆయనకు వెలుగుచూపింది. ఆ వెలుగులో తెలంగాణే కాదు, యావత్‌ భారత ప్రజల విముక్తి మార్గం వర్గపోరాటమేనని అర్థం కావడానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు. అందుకే విద్యార్థిగానే కమ్యూనిస్టు భావ జాలంతో పరిణితి చెందాడు. పొరాట యోధుడిగా పదునె క్కాడు. రెక్కల కష్టాన్ని దోచుకోవడమే గాక, మనుషులంటే ఏమాత్రం లక్ష్యం లేకుండా నిజాం పిశాచి మూకలు ఊర్ల మీద పడి ప్రజల మాన ప్రాణాలనూ కిరాతకంగా హరిస్తున్నప్పుడు.. మనసారా నవ్వడమన్నదే మరిచిపోయి, తనివితీరా ఏడ్వడానికి కూడా అవకాశం లేని కాలాన్ని యుద్ధానికి సన్నద్ధం చేశాడు.
అది నిజాం ప్రభువుగా మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కొలువుదీరి ఇరవై ఐదేండ్లు పూర్తయిన సందర్భం. ఆ పట్టాభిషే కానికి తెలంగాణమంతటా రజతోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న రోజులు. అన్ని ప్రభుత్వ సంస్థల్లాగే ఆ పాఠశాలకూ ఆ ఉత్సవాలను జరపాలని ఉత్తర్వులందాయి. ఆ మేరకు ప్రధానో పాధ్యాయుల వారు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ ఆదేశాల ను ధిక్కరించి సహ విద్యార్థులతో కలిసి ఆ వేడుకులను బహిష్కరించిన తెగింపు ఆయనది. ఆయన నాయకత్వంలో సాగిన ఈ బహిష్కరణోద్యమంలో సీపీ(ఐ)ఎం నేత మల్లు వెంకటనర్సింహారెడ్డి (వి.ఎన్‌.) కూడా ఒకరు కావడం గమ నార్హం. వి.ఎన్‌.లాంటి ఎందరో విద్యార్థులను ఉద్యమంలోకి ఆకర్షించి విప్లవకారులుగా తీర్చిదిద్దిన చరిత్ర ఆయనది. ఇందుకోసం ఆ రోజుల్లోనే ఆయన విరాళాలు సేకరించి మరీ విద్యార్థులకు వసతి గృహం నిర్వహించారు. ఈ వసతి గృహం విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆలంబనగా నిలవటమే గాక ఎందరో విప్లవకారులనూ తయారు చేసింది. అందుకు వి.ఎన్‌. ఓ మచ్చుతునక మాత్రమే! ప్రఖ్యాత సినీ నటుడు ప్రభాకర్‌రెడ్డి కూడా తన కమ్యూనిస్టు భావజాలాన్ని ఈ వసతి గృహం నుండే అందిపుచ్చుకున్నాననీ, ధర్మ భిక్షం తన రాజకీయ గురువు అని ప్రకటించడం విశేషం.
సూర్యాపేట ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసిన ధర్మభిక్షం ఆ పైన అలిగ్రా యూనివర్సిటీ కోర్సులో ఉత్తీర్ణుడయ్యాడు. మొదటి నుండి అభ్యుదయ, విప్లవ భావాల కలబోతగా ఎదిగిన యువకుడిగా సామాజిక, రాజకీ యాంశాల్లోనే కాదు, చదువులోనూ ఆయన దిట్టే. తెలుగుతో పాటు ఉర్దూ, ఇంగ్లీష్‌లలో అనర్గళంగా మాట్లాడగలిగిన నే ర్పు అతనిది. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే కొంతకాలం ఆర్యసమాజ్‌లో పనిచేసిన ధర్మభిక్షం.. ఆ తర్వాత సూర్యాపే టలో మొట్టమొదటి కమ్యూనిస్టు సెల్‌ ఏర్పాటు చేశాడు. ఆం ధ్రమహాసభ నిజాం వ్యతిరేక పోరాట వేదికగా రూపాంతరం చెందే క్రమంలో దానికి ఆకర్షితుడయ్యాడు. మహాసభ కార్య కలాపాల్లో చురుగ్గా పాల్గొంటూనే జర్నలిస్టుగా ప్రజల గొం తుకయ్యాడు. ఆనాటి తెలంగాణ ప్రముఖ పత్రికలైన గోల్కొండ, మీజాన్‌, రయ్యత్‌లలో పాత్రికేయునిగా నిజాం దురాగతాలపై నిప్పులు కురిపించాడు. తెలంగాణ జనజీవి తాన్ని ఎలుగెత్తి చాటాడు. క్రమేణా ఆంధ్రమహాసభ కమ్యూ నిస్టుల నాయకత్వంలో సాయుధపోరాట రూపం తీసుకునే నాటికి ఆయుధంతో అడవులకేగాడు. సాయుధ పోరాటాన్ని నల్లగొండ నలుదిక్కులకూ విస్తరింపచేశాడు. ఈ విస్తరణ బాధ్యతల్లో ఉండగానే నిజాం పోలీసులకు చిక్కడంతో ఔరం గాబాద్‌, జాల్నా జైళ్లలో ఐదేండ్లకుపైగా జైలుశిక్ష అనుభవిం చాడు. జాల్నా జైలులో ఉన్నప్పుడే చుక్కా రామయ్య గారు ఆయనను కలుసుకున్నారు. ఆ జైలు జీవితమే తన భావి జీవితాన్ని మలుపుతిప్పిందనీ, అప్పుడు ధర్మ భిక్షం గారు ఇచ్చిన సూచనలే విద్యారంగంలో తన కృషికి ప్రేరణ అనీ, ఆ ప్రేరణే తనను ఈనాడు ఒక విద్యావేత్తగా నిలిపిందనీ రామ య్యగారే ఓ ఇంటర్వ్యూలో ప్రకటించడం విశేషం. జైల్లో సై తం అధ్యయనం పోరాటమే ధర్మభిక్షం మార్గం కావడం గ మనార్హం. అప్పట్లో కారణాలేమైతేనేం తెలంగాణ నుండే కా దు, దేశం నలుమూలల నుండీ జైళ్ల నిండా రాజకీయ ఖైదీల ంతా కమ్యూనిస్టులే కావడం ఆయన ప్రాపంచిక ధృక్పథానికి మరింత పదును పెట్టింది. జాల్నా జైలులో ఖైదీల సమస్య లపై ఆయన పోరాటం మరుపురానిది. ఎందుకంటే తన నా యకత్వ పటిమతో ఏకంగా జైల్లో ఉన్న పదివేలమంది ఖైదీల ను ఏకోన్ముఖంగా సమ్మెలోకి దించిన చారిత్రక ఘట్టమది.
దాదాపు సాయుధపోరాట కాలమంతా చెరసాలలతోనే చెలిమి చేసిన ఆయన తన విప్లవభావాలకు మరింత పదును పెట్టుకున్నాడు. పోరాట విరమణానంతరం నల్లగొండ కమ్యూనిస్టు ఉద్యమానికి గుండెకాయలా నిలిచాడు. తొలిసారిగా 1952లో సూర్యాపేట నియోజకవర్గం నుండి హైద్రాబాద్‌ అసెంబ్లీకి ఎన్నికైన ధర్మ భిక్షం ఆ తరువాత 57లో నకిరేకల్‌ నుండి, 62లో నల్లగొండ నుండి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికయ్యాడు. 1991, 96లలో ప్రజలిచ్చిన విజయాలతో అదే నల్లగొండ నుండి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించాడు. 96లో ఆయన విజయం ప్రత్యేకమైనది. పార్లమెంటు చరిత్రలోనే ఒకే నియోజకవర్గంలో 480మంది పోటీ చేసిన మొట్టమొదటి సందర్భమది. న్యూస్‌ పేపర్‌ను తలపించే బ్యాలెట్‌ పేపర్‌, మంచినీటి డ్రమ్ముల సైజులో బ్యాలెట్‌ బాక్సులు... బ్యాలెట్‌ నిండా గుర్తును పోలిన గుర్తులు అనేకం. అయినా ప్రజలు ఏమాత్రం గందరగోళానికి గురికాకుండా అత్యంత శ్రద్ధగా ఓటేసి అఖండ విజయాన్ని అందించడం ఆయనకున్న ప్రజాభిమానానికి ఓ ఉదాహరణ. ప్రజాప్రతినిధిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా నాటి నల్లగొండ జిల్లాపైనే కాదు, మొత్తం తెలంగాణపైనే ఆయనది చెరగని ముద్ర. ముఖ్యంగా నల్లగొండ జిల్లా అభివృద్ధిలో, ప్రజా జీవితంలో కమ్యూనిస్టుల భాగస్వామ్యానికి అతడొక నిలువుటద్దం.
ఈ ధరిత్రి గమనానికి యుగకర్తై చరిత్ర నుదిటిపై నెత్తుటి సంతకం చేసినవాడు రైతు. ఆ రైతు కండ్లల్లో ఆనందం వెల్లివిరిసిననాడే ఈ దేశానికి శాంతీ సౌభాగ్యం అని నమ్మినవాడు ధర్మభిక్షం. తన నెత్తుటి ధారల్లో బురద నుండి బువ్వ తీసే రైతన్న.. ప్రకృతి కోపానికి ఓడిపోతూ, పాలకుల కుట్రలకు మోసపోతూ, ఉరికొయ్యలకు వేలాడినప్పుడల్లా గుండెను పొడి చేసి గడపగడపకూ పంచినవాడు. పారే నదులన్నీ ఎండిన భూముల్ని పండించాలనీ, ప్రవాహాలన్నీ పంట కాల్వలుగా మారాలనీ ఆగని పోరాటమైనవాడు. ఆ కృషిలో నాగార్జునసాగర్‌, శ్రీశైలం, మూసీ ప్రాజెక్టుల సాధనకు పాటుపడినవాడే కాదు, ఆ నిర్మాణాలకు రాళ్లెత్తిన వేలాది కూలీలకు తోడై నడిచినవాడు. వారి తలమీది తట్టను నేలకు దించి కష్టసుఖాలను, కర్తవ్యాలను కలబోసుకున్నవాడు. లక్ష మంది నిర్మాణ కార్మికుల సంఘమై నిలిచి.. ఏక కాలంలో ఒకవైపు ప్రాజెక్టు నిర్మాణం కోసం, మరోవైపు ఆ నిర్మాణంలో కార్మికుల హక్కుల కోసం సాగిన కమ్యూనిస్టు కృషి అతడు.
అఖిల భారత స్థాయిలో ''గీత పనివారల, కార్మిక సమాఖ్య'' నిర్మాతగా, ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడిగా గీత కార్మికుల జీవితాలపై అతడొక చెరగని సంతకం. ప్రాణాలు పణంగా పెట్టి ఆకాశానికి పయనించి తాటి కల్లును నేలకు దించే జీవితాలకో భద్రత కావాలని కొట్లాడినవాడు. జీవితం నిండా పోరాటాలనే నింపుకున్న కమ్యూనిస్టుకీర్తి ధర్మభిక్షం. ప్రజలే తన కుటుంబంగా ఆజన్మ బ్రహ్మచారిగా కొనసాగిన త్యాగమూర్తి ధర్మభికం. అందుకే అతడు పీడిత ప్రజల ప్రియతమ నేతగా, ఆదర్శ కమ్యూనిస్టుగా చరిత్రలో నిలిచాడు.
కమ్యూనిస్టు కావడమంటే మాటలు కాదు. అందుకు పోరాడేతత్వం, త్యాగ గుణం, గుండె ధైర్యం మాత్రమే ఉంటే సరిపోదు. మానవజాతి విముక్తికి అవసరమైన ''ప్రాపంచిక దృక్పథం'' ఉండాలి. అందుకు సమాజాన్నీ, జీవితాన్నీ అధ్యయనం చేయాలి. ఆ ప్రాధాన్యతను ఎన్నడూ విస్మరించని అధ్యయన శీలి ధర్మభిక్షం. వేల సంవత్సరాలుగా ఆర్థిక, సాంఘిక అసమానతలతో నిండి కొనసాగుతున్న ప్రపంచంలో... మహా మేధావులైన మార్క్స్‌, ఎంగెల్స్‌ల చేతిలో రూపుదిద్దుకొని, మానవ చరిత్ర గమనాన్ని నిర్దేశించిన ''మార్క్సిజం'' అనే సిద్ధాంత వెలుగులో మొదలైన ఆయన ప్రయాణం... ఆ మార్క్సిజం నిర్దేశించే సమ సమాజం కల కాదు నిజం అని నిరూపించిన సోవియట్‌ విప్లవ స్ఫూర్తితో సాగిన ఆయన జీవితం...26 మార్చి 2011న ముగిసింది. ఎవరికైనా జీవితం ఓ అనుభవం. ఆ అనుభవం జీవితాన్ని ఉన్నతీకరించేదై ఉండాలి. అటువంటి అనుభవాల వైపు ప్రయాణించడమే జీవిత లక్ష్యమైనవారికి మాత్రమే అది సాధ్యం. అనుభవాలను గొప్పగా, గాఢంగా తీసుకోగలగడమనేది మన హృదయపు సున్నితత్వం మీద, స్వేచ్ఛమీద, నిజాయితీ మీద ఆధారపడి ఉంటుందనడానికి ధర్మభిక్షం ఓ నిలువెత్తు నిదర్శనం.
- రాంపల్లి రమేష్‌
సెల్‌ : 8639518341

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాహౌరె బాహుబలి
వ్యాక్సిన్‌ రాజకీయాలు.. మోడీ భక్తుల వక్రీకరణలు
పెరుగుతున్న జాత్యహంకారం
సంక్షోభంలో భవన నిర్మాణ రంగం
అత్యంత ప్రజాధరణ పొందిన ఇండియన్‌ వెబ్‌ సీరీస్‌లు..!
గవర్నమెంటుకు సోయుందా..?
పేదల తర్వాతే పెద్దలకు వ్యాక్సిన్‌!
కాదేదీ ప్రచారానికి అనర్హం....
రైతును బలిపెడతారా..?
క్యాపిటల్‌ పై దాడి హీనమైన చర్య..
రైతు భారతం! నిత్య రణభరితం!!
గిరిజనులను నిర్వాసితులుగా మార్చేందుకే...
త్రిపురనేని గొప్ప దార్శనికుడు...
విద్యా విప్లవజ్యోతి ఫాతిమా బేగం
చైనా ఐదేండ్లు ముందుకు.. భారత్‌ వెనక్కు.. మోడీనామిక్సు నిర్వాకం!
ఐజాక్‌ న్యూటన్‌
పరిష్కారానికి నోచని గిరిజన సమస్యలు
ఆనంద భాష్పాలు
మోడీకి అంబాని, అదానీ ప్రయోజనాలే ముఖ్యం
ఆర్నెల్ల సావాసం...
సర్కారు వారి పాట!
ఈ ఏడాదైనా విముక్తి దొరికేనా
ఎస్ఎఫ్ఐ 50 ఏళ్ళ ప్రస్థానం
నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం 2020
తెలంగాణ మహిళా తేజం ఆరుట్ల కమలాదేవి
కొత్త ఆశలతో.. నూతన సంవత్సరంలోకి!
మహిళల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి ఫూలే
కరోనా విషకోరల్లో 2020 విలవిల
అవలోకనం
తాలి బజావ్‌!

తాజా వార్తలు

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

04:00 PM

బీజేపీ ఎంపీ అరవింద్ కు చేదు అనుభవం..

03:45 PM

త్వరలో సీఎంగా కేటీఆర్.. టీఆర్ఎస్ మంత్రుల్లో టెన్షన్..

03:35 PM

ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్ధిని..

03:32 PM

బయట మార్కెట్లో కరోనా టీకా కొనుక్కొవాలనుకుంటున్నారా..

03:20 PM

రైతులను అడ్డుకున్న పోలీసులు.. నీటి ఫిరంగుల ప్రయోగం

03:19 PM

టిక్ టాక్ స్టార్ షేక్ రఫీ ఆత్మహత్య

03:16 PM

మే 7 నుండి పదో తరగతి పరీక్షలు..

03:05 PM

ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు..మండిపడ్డ రైతులు

02:23 PM

ఐక్యవేదిక నిరాహారదీక్ష భగ్నం..

02:16 PM

లోయలో పడిన జీపు.. ఆరుగురు మృతి

02:04 PM

ఆరు రోజుల్లోనే పది లక్షల మందికి వ్యాక్సిన్​..

01:47 PM

బర్డ్‌ఫ్లూ కలకలం.. ఐదు నెమళ్లు మృతి

01:33 PM

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది కావాలి: చంద్రబాబు

01:28 PM

స్థానిక ఎన్నికలు వద్దు: ఉద్యోగ సంఘాల నేత

01:24 PM

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రాహుల్

01:17 PM

ఏనుగు మృతి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

01:14 PM

కాసేపట్లో జైలు నుండి విడుదల కానున్న అఖిల ప్రియ

01:09 PM

పంత్ తో నాకు విభేదాలు : వికెట్ కీపర్ సాహా

01:06 PM

ఆర్‌ఆర్‌ఆర్‌కు షాకిచ్చిన నటి

12:59 PM

నిరాహార దీక్షకు దిగిన ఐక్యవేదిక నేతల అరెస్ట్

12:52 PM

కోల్గేట్‌ సంస్థకు జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం

12:37 PM

ప్రేమోన్మాది సునీల్ కుమార్ అరెస్ట్...

12:31 PM

ఏలూరులో విషాదం...

12:30 PM

కేటీఆర్ సీఎం అవగానే టీఆర్ఎస్ లో బాంబు పేలుతుంది : బండి

12:20 PM

శశికళను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కోరిన దినకరన్

12:11 PM

ఇండోర్​లో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి..

12:08 PM

పోలీసులకు చిక్కిన హోసూరు దోపిడీ ముఠా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.