Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సిద్ధాంతాలు ఎలా ఏర్పడతాయి? | వేదిక | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Nov 13,2019

సిద్ధాంతాలు ఎలా ఏర్పడతాయి?

మనం ఒక పరిచయమున్న వ్యక్తి ప్రతిరూ పాన్ని తేలికగా ఊహిస్తాము. కానీ మనిషి అంటే లేదా స్త్రీ, పురుషుడు అంటే ఊహకు రాదు. అయినా వాస్తవిక మనుషులందరి సామాన్యిక రణభావం మానవుడు. అందుకనే ఇది అనిర్దిష్ట భావన. మన భావనలు వాస్తవికతకు నకళ్లు, ప్రతిబింబాలు. అనిర్దిష్ట భావనా క్రమంలో మానవులు, తమ ఊహలు సారించి సంధానిం చి వాటిని తిరిగి కలుపుతూ, కొన్నింటిని తిరస్కరిస్తూ, ఇతర అంశాలను సంబంధాలను ప్రవేశపెడుతూ ఉంటారు. అలా దేవుడు, మత్స్య కన్య వంటి భావనలను కూడా కల్పించాడు. అయితే సత్యానికి గీటురాయి ఆచరణే. సజీవమైన ఇం ద్రియావబోధ నుండి అమూర్త ఆలోచనకు ఆ ఆలోచన నుండి ఆచరణకు సాగుతూ ఉంటుంది. ఇది అంచెలంచె లుగా ఉంటుంది. అవి ఒక నమూనా తయారు చేసుకోవడం, సిద్ధాంత ఆలోచనకు పురికొల్పుతుంది.
ఉదాహరణకు 1543లో కోపర్నికస్‌ సిద్ధాంతం వి శ్వానికి భూమి కేంద్రం కాదనీ, దాని చుట్టూ గ్రహాలు, సూ ర్యుడు పరిభ్రమించడం లేదనీ చెప్పింది. ఇది పురాతన గ్రీ కు తాత్వవేత్త, ఖగోళ శాస్త్రవేత్త టోలెమీ భూకేంద్ర సిద్ధాం తానికీ, చర్చికీ విరుద్ధంగా ఉంది. కంటికి స్పష్టంగా కనిపి ంచే సత్యాన్ని ఖండించినట్టు కనిపించింది. కానీ కండ్లకు కనిపించే వాస్తవాలను ఖండించినట్టు పైకి కనిపించే కో పర్నికస్‌ సిద్ధాంతం శాస్త్రీయ ఆలోచనలోనూ ప్రపంచంపై న మానవ సంస్కృతిలోనూ పెద్ద మార్పును కలిగించింది. పరిశీలనలో ఉన్న విషయాలను అది సరళంగా నిర్దిష్టంగా వివరించింది. కాబట్టి ప్రతి శాస్త్రీయ సిద్ధాంతానికీ మూడు ప్రధాన క్రియలుంటాయి. 1.శాస్త్రీయ పరిశోధనా స్వభావానికి సంబంధించిన వివరణ, జోస్యం, నిర్వచనం, 2.ప్రయోగం, 3.పరిశీలన.
అభిప్రాయాల మొత్తాన్ని దేన్నీ మనం సిద్ధాంతమని పిలువం. పరస్పర సంబంధం కలిగిన శాస్త్రీయ నియ మాల ప్రత్యేక సంవిధానాన్నే మనం సిద్ధాంతమంటాము. శాస్త్రీయ నియమాలన్నవి, పరిశీలనలో ఉన్న విషయాల వస్తుగత నియమాల ప్రతిబింబాలు. ఒకానొక నిర్దిష్టరం గంలో మౌలికము, సుస్థిరము, పునరావీతము, అవసర మైన తార్కికంగా పరస్పర సంబంధితాలైన, సంధానాల ను ప్రతిబింబించే శాస్త్రీయ నియమాలు ఒక సిద్ధాంతంగా రూపొందుతాయి. ఆ విధంగా కెప్లర్‌ నియమాలు గ్రహా లలో అంతర్గంగా ఉన్న సుస్థిరము, అవసరమైన సంధాల ను వ్యక్తం చేస్తాయి. కనుక అవి గ్రహగతికి సంబంధిం చిన ఒక సిద్ధాంతమవుతాయి. అదేవిధంగా పెట్టుబడి గ్ర ంథంలో వివరించబడిన మార్క్స్‌ ఆర్థిక సిద్ధాంతం కూడా ఒక సిద్ధాంతమే. ఎందుకంటే దానిలోని నియమాలు అవ సరమైన ఆర్థిక సంబంధాలను ప్రతిబింబిస్తున్నాయి. గతి తార్కిక సూత్రాలకు సంధానితమై ఉన్నాయి.
సామాజికాభివృద్ధిలో ప్రకృతిలోని పదార్థాలను, సమాజంలోని సంబంధాలను గూర్చిన క్రమబద్ధ సూత్రా లను, సిద్ధాంతాలను, అభిప్రాయాలను వివరించేందుకు అమూర్తభావాలు వినియోగంలోకి వస్తాయని మనం చె ప్పుకున్నాం. ఈ అమూర్త భావాలు సూత్రాలు రూఢి చెం ది సిద్ధాంతాలుగా కొనసాగుతాయి. సమాజంలోని ఆయా చారిత్రక దశలలో అనేక అభిప్రాయాలు ఏర్పడి అన్ని రం గాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు వ్యక్తిగత ఆస్తి ప్రభుత్వం రూపొందటంతో ఆ వ్యవస్థల నుండి రాజ కీయ, న్యాయశాస్త్ర హక్కులను గూర్చిన భావాలు ఏర్పడ తాయి. ఫూడల్‌ వ్యవస్థలో హక్కులు కూడా వారి వారి స్థా నాన్ని బట్టి హెచ్చుతగ్గులుగా ఉంటాయి. పెట్టుబడిదారీ విధానం రూపొందటంతో పౌరసత్వం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అనే సిద్ధాంతం ప్రారంభమైంది. మానవులు ఎలా జీవిస్తారో అలా ఆలోచిస్తారు. సమాజంలో ఒక నిశ్చయ జ్ఞానం అంటే సిద్ధాంతం ఎలా అభివృద్ధి చెందుతుందంటే ముందు, అనుమానం, తర్కం అనేవి ముఖ్య పాత్ర వహి స్తాయి. భావం తర్కం ద్వారా నిర్ణయంగా రూఢమవుతు ంది. భారతీయ తత్వ శాస్త్రంలో ఈ తర్కాన్ని గౌతముడు క్రీ.పూ ఆరవ శతాబ్దంలోనే ఇలా వివరించాడు. 1.పర్వతంపై ఆగ్ని ఉంది. ఎలా తెలుసు? 2. పర్వతం పై పొగ కనపడుతోంది కనుక. 3. వంట ఇంటి మీద వలె ఎక్క డైతే పొగ ఎగుస్తూ కనిపిస్తుందో అక్కడల్లా అగ్ని ఉంటుంది. 4. పర్వతంపై పొగ కనిపిస్తుంది కదా. 5.కనుక పర్వతం మీద అగ్ని ఉండక తప్పదు. ఇదే సూ త్రాన్ని అరిస్టాటిల్‌ మొదటి రెండింటిని తీసేసి మూడు వి భాగాల్లో చెప్పాడు. నిశ్చయ జ్ఞాన నిర్మాణంలో కార్యాచరణ నిరూపణ అనేది ముఖ్య విషయం. అయితే ఈ కార్యాచరణ సూత్రాన్ని తీసుకునే అశాస్త్రీయతను చెప్పే ప్రయ త్నమూ చేశారు. ఉదాహరణకు మన భారతీయ తత్వశా స్త్రంలో ఆస్తిక దర్శనాలలో దేవునికంటే భిన్నమైన సృష్టిని దేనికదిగా చూసేది వైశేషికం. దేవుని ప్రమేయం ద్వారా కలిగే సృష్టి పరిణామాన్ని సామాన్య పరిచింది సాం ఖ్యం. దేవునిలో లేని పరిణామం సృష్టిలో కూడా ఉండద నేది అద్వైతం. ఈ అన్ని సూత్రీకరణలూ కార్యాచరణ నిరూపణకు పూనుకున్నాయి. కారణం దేవునిగా, ప్రకృతి కార్యంగా రెండింటినీ సమన్వయ పరిచేందుకు తర్కాన్ని ఆశ్రయి ంచాయి. అనేక ఊహాగానాలకు లోనయ్యాయి. త ర్కం అ నేది ఆలోచనల నిర్దిష్టత వరకే గాని వస్తుస్థితి నిర్ది ష్టతకు గీటురాయి కాదు. ప్రకృతి పరిణామ వివరణ ప్రకృతి శా స్త్ర వికాసంపై ఆధారపడుతుందే కానీ తర్కంపై కాదు.
ఇక జీవితావసరాల ఉత్పత్తిలో నెలకొనే సంబంధాల ను బట్టి సాంఘికభావాలు, సిద్ధాంతాలు రూపుతీర్చుకుం టాయి. భూస్వామ్యంలో ఫూడల్‌ యజమాన్య భావాలు కొనసాగుతాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలోని సంబంధాల ను బట్టి పెట్టుబడిదారీ సిద్ధాంతాలు కొనసాగుతాయి. సామాజిక ఆస్తి సంబంధాలలో ప్రతిబింబించే భావాలు, సిద్ధాంతాలు, రాజకీయ న్యాయ, మత సిద్ధాంతాలలో ప్ర తిఫలిస్తాయి. ముఖ్యంగా మత భావాలలో ప్రస్ఫుటంగా మనం చూస్తాం. మానవుడు తన ఊహలతో కల్పించే స్వ ర్గం, నరకం, ఆయా సమాజ భౌతిక జీవిత వ్యవస్థనూ ఉ త్పత్తి సంబంధాలనూ ప్రతిబింబిస్తాయి. యజ్ఞయాగాలు చేసి, యుద్ధంలో మరణిస్తే స్వర్గంలో రంభా సంభోగం, అమృత పానియం మొదలైన సౌఖ్యాలు దొరుకుతాయట. నిత్య జీవితంలో ఏవి మనకు సౌఖ్యంగా, సంతోషాన్ని కలిగిస్తాయో అవే ఇవి. అలాగే నరకంలో శిక్షలు. స్వర్గనర కాలు అభూత కల్పనలే అయినా ఆనాటి సామాజిక సంబంధాల ఉనికిని సమర్థించేవే. అలాగే భారతీయ వర్ణ వ్యవస్థలో బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, పొట్ట నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారని ఒక సూత్రీకరణ. అంటే బ్రాహ్మణుల ఆదేశానుసారం క్షత్రియులు రాజ్యాంగ నిర్వహణ, వైశ్యులు వ్యాపారం, శూద్రులు అనగా కింది కులాల వారు శ్రమ చే యాలి. ఇవి ఆనాటి ఫూడల్‌ సామాజిక సంబంధాలకు అ నుగుణమైనవి. ఇదంతా దైవ సంకల్పమని సిద్ధాంతాలు చెప్పబడ్డాయి. ఇవన్నీ బ్రాంతులు. అంటే సమాజ పరి ణామంలో సామాజిక గతిని బట్టే కొన్ని బ్రాంతిపూర్వక సిద్ధాంతాలు జనిస్తాయి.
సిద్ధాంతాలు ఆయా వర్గాలకు చెందిన మేధావుల ద్వారా తమ వర్గ ఆస్తికీ ప్రయోజనానికీ అనుగుణంగా వ ర్గ సంఘర్షణలో పెంపొందుతాయి. సామాజిక అభివృద్ధి లోంచే అభివృద్ధి చెందుతాయి. అయితే వర్గ సిద్ధాంతాల లో వాస్తవికత, బ్రాంతి కూడా పాత్ర వహించి క్లిష్టత ఏర్ప డుతుంది. ఒకవైపు వర్గ ప్రయోజనాల అనివార్యత మూ లంగా ఆచరణాత్మక, సవిమర్శక ఆలోచనలు కొనసాగు తాయి. ఇది శాస్త్రీయ ధోరణి. ఉదాహరణకు పెట్టుబడిదా రీ వర్గం తన ఉత్పత్తి పెరగడం కోసం ప్రకృతి శాస్త్రాలను పెంపొందిస్తుంది. సామాజిక సంబంధాలలో మార్పులు సాధించి సాంఘిక శాస్త్రాలనూ అభివృద్ధి చేస్తుంది. రెండో వైపు వర్గ ప్రయోజనాల అనివార్యతలో సామాజిక ఉత్పత్తి లో వర్గ పాత్రను గుర్చిన బ్రాంతులు ఏర్పడతాయి. ఇది అ శాస్త్రీయ ధోరణి. ఉదాహరణకు పెట్టుబడిదారీ విధానం లో మాల్దస్‌ సిద్ధాంతం. ఆర్థిక ఉత్పత్తికంటే జనాభా హె చ్చువేగంతో పెరుగుతుందనీ అందుకని కరువులు, యు ద్ధాలు, వ్యాధులతో జనాక్షయం అనివార్యమవుతుందని ఒక సిద్ధాంతం చేశాడు (ఇది తప్పు. ఎందుకంటే పెరిగిన జనాభా ఉత్పత్తిని కూడా పెంచుతుంది). ఇలా బూర్జువా సిద్ధాంతవేత్తలు శాస్త్రీయ, అ శాస్త్రీయ ధోరణులను పెం పొందించారు. అందువల్ల పెట్టుబడిదారీ సిద్ధాంత అభివృ ద్ధిలో ఈ వైరుధ్యం అన్ని రంగాల్లో ప్రభావం చూపుతుం ది. అంటే అనేక బ్రాంతికర విషయాలు అందులో కొనసా గుతాయి. ఈ బూర్జువా తత్వశాస్త్రంలో విభిన్న శాస్త్రవిజ్ఞా న పరిశోధనలను, అలాగే వారి వర్గ ప్రయోజనాలనూ సమన్వయం చేయటం కొనసాగుతుంది. అంటే విజ్ఞాన శాస్త్ర విషయాలను మత భావాలతో సమన్వయం చేయటంతో వైరుధ్యం స్పష్టంగా కనపడుతుంది. ప్రకృతి శాస్త్రం ప్రయోగాల ఫలితం. మత బోధనల పునాది గుడ్డి నమ్మకం. ఇప్పటి వరకు ఫూడల్‌ వ్యవస్థలో రాజులూ పురో హితులు అధికారం చేసి రాజులను దైవాంశ సంభూతు లని దోపిడీకి హక్కులు ఏర్పర్చుకున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికుల శ్రమశక్తిని దోచుకుంటూ మత స్వేచ్ఛ ను గూర్చి బోధిస్తారు. వ్యవస్థ సంక్షోభంలో పడ్డప్పుడల్లా మత సిద్ధాంతాలను ముందుకు తోసి పెట్టుబడిదారులు తమ ఉత్పత్తి విధానాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నది అదే.
సిద్ధాంతాభివృద్ధికి సామాజిక, భౌతిక జీవనం ఆ ధారం. సిద్ధాంతాలలో శాస్త్రీయత, అశాస్త్రీయతాంశాలూ చోటు చేసుకుంటాయి. అవి నిరంతరం విమర్శకు గుర వుతాయి. వాస్తవికత, ఆచరణ గీటురాయిగా సిద్ధాంతం నూతనమై వికసిస్తుంది. సత్యాల ఆధారంగానే సిద్ధాంతా లు కొనసాగుతాయి. సామాజిక పరిస్థితులు మారుతుం టాయి. అందువల్ల కొత్త పరిస్థితులకు అనుగుణమైన మా ర్పులతో సిద్ధాంతం విమర్శకు గురవుతుంది. విమర్శకు ఆధారం తర్కం, అనుభవం, ఈ రెండే. ఉన్నత శ్రేణి సైద్ధా ంతిక జ్ఞానం శాస్త్రీయ సూత్రీకరణలలోనూ, నియమాల లోనూ వాస్తవీకరింపబడుతుంది. మార్క్స్‌ ఆర్థిక సిద్ధాం తం ఈ విషయాన్ని చక్కగా నిరూపించింది. మార్క్స్‌ తన పెట్టుబడికి ఏ వాస్తవాలను ఆధారం చేసుకున్నాడో వాటి ని ఇతర పరిశోధకులు కూడా వర్ణించారు. ఆర్థిక, రాజకీ య అసమానత్వం, దోపిడీ, శ్రామికుల దరిద్రం మొదలైన వన్నీ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలకూ తెలుసు. కానీ వారు సుసంగతమైన దృక్పథంలో వారు వివరించలేకపోయా రు. మార్క్స్‌ చేత సూత్రీకరింపబడిన, పెట్టుబడిదారీ స మాజాభివృద్ధి నియమాలపై ఆధారపడిన మార్క్సిస్టు సి ద్ధాంతం ఒక్కటి మాత్రమే, లభ్యమైన వాస్తవాలను వివరి ంచింది. పెట్టుబడిదారీ విధానం నుండి నూతన కమ్యూని స్టు నిర్మాణ రూపానికి పరివర్తనకు సంబంధించిన దశలనూ, వస్తు పర నియమాలనూ నిర్దిష్టంగా ఊహించి చెప్పింది.
- కె.ఆనందాచారి
సెల్‌ : 9948787660



మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉద్యమాల పొద్దుపొడుపు
ప్రభుత్వ బడులే విజ్ఞాన గనులు
ఏ 'దిశ'కు మానవ ప్రస్థానం
మగపిల్లలకూ హద్దులు, ఆంక్షలు పెట్టి పెంచాలి
ఖేల్‌ ఖతం దుకాణ్‌ బంద్‌! వాట్‌ నెక్ట్స్‌?
ఒక వీరుడు మరణిస్తే ప్రభవింతురు వేలకొలది
వైరుధ్య నియమంలో ఏముంది?
కామపిశాచాల లోకం..?!
నైతిక విలువలతో కూడిన విద్య అవసరం
దొర గారి మూర్ఖత్వం
ప్ర‌జల మనిషి
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
బలహీన తీర్పు
ఆటలకు దూరమవుతున్న చిన్నారులు
గతితార్కిక భౌతికవాదమంటే..
ఇంత మాత్రానికి ఈ వ్యవస్థలెందుకు..?
ఆశయం తీర్చిదిద్దిన మానవుడు
ప్లాస్టిక్‌ను అరికట్టకపోతే భావితరానికి ముప్పు
ఎరప్రూల వనం
అమ్మ చనుబాలమయం 'అవని'
రాజే మొండి వాడైతే?!
అంతర్మథనం అవసరం
మహా 'షాక్‌'
మోడీ అనుకుంటే...
మెత్తబడ్డారా? అమ్ముడుపోయారా?
జార్జిరెడ్డి ఎవరు?
పదార్థం అంటే ఏమిటి?
కేసీఆర్‌కు పేమ్రలేఖ! కేసీఆర్‌ గారూ!
బాల్యానికి ఏదీ భరోసా?!
బడుల మూసివేత తగదు

తాజా వార్తలు

11:36 PM

సొంత పార్టీ నిర్ణయం పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫైర్

09:59 PM

ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయాలి : గరవ్నర్‌

09:55 PM

మిలిటరీ ఛీఫ్‌గా మైనారిటీ వ్యక్తి..శ్రీలంక చరిత్రలో మొదటిసారి

09:46 PM

పోలీసుల కస్టడీ నుండి తప్పించుకున్న దొంగ

09:34 PM

సిద్ధార్థ్ ‘టక్కర్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన వరుణ్‌ తేజ్‌

09:25 PM

కొత్త చట్టం తెస్తానన్న జగన్‌కు అభినందనలు: విజయశాంతి

09:13 PM

అందుకే శివం దూబేను ఫస్ట్ డౌన్‌లో పంపాము : కోహ్లీ

09:02 PM

వరంగల్ హత్యాచారం కేసులో పోలీసులు కీలక నిర్ణయం

08:59 PM

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్

08:35 PM

సైనికుల జీవితాలపై ఎంఎస్ ధోనీ టీవీ షో

08:28 PM

పౌరసత్వ బిల్లును ముస్లింలకు వర్తింపజేయాలి: ఎంపీ నామా

08:24 PM

ప్రముఖ జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి

08:22 PM

ఏపీ సీఎం అధ్యక్షతన ఎస్‌ఐపీబీ పునరుద్ధరణ

08:20 PM

మాట్లాడే గొంతుకలను నొక్కేస్తున్నారు : ప్రొఫెసర్ కోదండరాం

07:58 PM

దిశ నిందితుల మృతదేహాల తరలింపునకు ఏర్పాట్లు

07:56 PM

బన్నీతో సినిమా చేయాలని నాకూ వుంది: బాబీ

07:50 PM

బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్-2019 టోర్నీకి సింధు

07:45 PM

నిర్భయ నిధులివ్వండి: స్మృతి ఇరానీకి స్వాతి లేఖ

07:39 PM

ఎస్సై, కానిస్టేబుల్‌ను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

07:35 PM

కేటీఆర్‌తో సౌదీ అరేబియా రాయబారి భేటీ

07:28 PM

వర్మపై కేఏ పాల్‌ కోడలి ఫిర్యాదు

07:07 PM

లారీలో దిశను తరలిస్తున్న నిందితుల దృశ్యాలు

07:01 PM

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో ఉద్యోగాలు

06:49 PM

హౌవిజ్జ‌ర్ తూటాల‌ను ప‌రీక్షించిన ఆర్మీ

06:41 PM

మైనర్ బాలికపై లైంగిక వేధింపులు

06:37 PM

కెప్టెన్‌గా గర్వపడుతున్నా: పొలార్డ్

06:35 PM

సిట్ విచారణకు గైర్హాజరైన ఆదినారాయణరెడ్డి

06:31 PM

విద్యార్థిని ఆత్మహత్య

06:29 PM

సాంబిరెడ్డి మృతి ఘటన ప్రభుత్వానికి కనువిప్పు కావాలి: జనసేన

06:26 PM

సైన్స్ ఫెయిర్ ను వీక్షించిన మంత్రి ఈటల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.