Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అలుపెరుగని కార్మికోద్యమ నేత కామ్రేడ్‌ టి. నరసింహన్‌ | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Feb 18,2021

అలుపెరుగని కార్మికోద్యమ నేత కామ్రేడ్‌ టి. నరసింహన్‌

ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు టి.నరసింహన్‌ (77) గుండెపోటుతో జనవరి 8న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 60ఏండ్లుగా కార్మిక ఉద్యమంలో పనిచేస్తున్న నరసింహన్‌ అమరత్వం ప్రజా కార్మికోద్యమానికి తీరనిలోటు. నిరంతరం కష్టజీవిగా, అలుపెరుగని కార్యకర్తగా, నాయకునిగా, ఉద్యోగ కార్మిక ప్రజాభిమానం చూరగొన్న నాయకులు నరసింహన్‌. వారి జ్ఞాపకాలు మరువలేం. నరసింహన్‌ తిరునల్వేలి (తమిళనాడు) జిల్లా, నంగునేరి గ్రామంలో 28.10.1943లో లక్ష్మీఅమ్మాల్‌- తిరుమలై దంపతులకు జన్మించారు. నరసింహన్‌ తిరునల్వేలి (తమిళనాడు)జిల్లాలో గ్రాడ్యుయేషన్‌ చేసి ఆర్‌ఎంఎస్‌ పోస్టల్‌ మధురై డివిజన్‌లో 1963 ఆగస్టు 5న ఉద్యోగంలో చేరారు. వారి సతీమని అలువెలుకు 1968లో టెలికాం డిపార్ట్‌మెంట్‌ హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో బదిలీపై వారి కుటుంబంతో 1969 ఫిబ్రవరి 12న హైద్రాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీదేవి, శ్రీవిద్య ఉన్నారు. 1968లో దేశవ్యాప్తంగా జరిగిన ఆల్‌ ఇండియా పోస్టల్‌ ఎంప్లాయిస్‌ సమ్మెలో టి.నరసింహన్‌ చురుకైన పాత్ర పోషించారు. ఆర్‌ఎంఎస్‌. గ్రూప్‌-4వ క్లాస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా 1970లో ఎన్నికయ్యారు. 1974లో గ్రూప్‌-4వ క్లాస్‌ కార్యదర్శిగా ఎన్నికైన 1980 వరకు ఆ బాధ్యతలలో ఉన్నారు. 1981లో పోస్టల్‌ సర్కిల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగాను, 1985లో పోస్టల్‌ సర్కిల్‌ సెక్రెట్రరీగానూ బాధ్యతలు చేపట్టి 2000 సంవత్సరం వరకు బాధ్యతలో పనిచేశారు. 1995 నుంచి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులుగా, 2018లో సీపీఐ నేషనల్‌ కంట్రోల్‌ కమిషన్‌ సభ్యులుగా ఉన్నారు.
2000సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మికసంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా జాతీయ కమిటీకి ఉపాధ్యక్షులుగా ఎన్నికై తుదిశ్వాస విడిచే వరకు కొనసాగుతూ వారి ఉద్యమంలో మమేకమై ఉన్నారు. 2003 అక్టోబర్‌ 31న రైల్వే మెయిల్‌ సర్వీస్‌ విభాగం నుంచి పదవీ విరమణ పొందారు. వారి సతీమణి అలువేలు బీఎస్‌ఎన్‌ఎల్‌ విభాగంలో 2007లో పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌కు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 2014 వరకు బాధ్యతలలో ఉన్నారు. 2001 హైదరబాద్‌లో జరిగిన ఏఐటీయూసీ జాతీయ మహాసభలో జనరల్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2016లో ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికోబడినారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమన్వయ కమిటీకి ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి ఏఐటీయూసీ రాష్ట్ర 10వ మహాసభలో ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడి రాష్ట్ర విభజన వరకు పనిచేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్‌కు అధ్యక్షులుగా ఎన్నికై 2019 వరకు కొనసాగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలు, నాయకులు సాగరహారంతో పాటు, సకలజనుల సమ్మె వంటి అనేక ఆందోళనలలో ముందు వరుసలో ఉండి నడిపించారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఉద్యోగ కార్మికులకు నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీలు అమలుపర్చాలని 2015లో ఏఐటీయూసీ చేపట్టిన ప్రచార ఆందోళనలలో రాష్ట్ర బాధ్యులుగా చురుగ్గా పాల్గొని ఏఐటీయూసీని రాష్ట్రంలో విస్తరించటానికి కృషి చేయటంలో ముందు వరుసలో ఉన్నారు. 2019 ఏప్రిల్‌లో జరిగిన రెండవ మహాసభలో గౌరవ అధ్యక్షులు ఎన్నుకోబడ్డారు. టి.నరసింహన్‌ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించటం యావత్‌ కార్మిక వర్గానికి తీరనిలోటు.
కేంద్ర ప్రభుత్వ సెక్టార్లో పనిచేసిన అనుభవంతో రాష్ట్రంలోని సెంట్రల్‌ అండ్‌ స్టేట్‌ పబ్లిక్‌ సెక్లార్లకు ఇన్‌చార్జిగా పనిచేస్తూ సింగరేణి, మెడికల్‌, బ్యాంకు, ప్యాక్స్‌, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ రాష్ట్ర యూనియన్‌లకు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో పోస్టల్‌, టెలికాం ఉద్యోగులు జాతీయ స్థాయిలో చేపట్టిన అనేక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొంటూ క్రియాశీలక పాత్ర పోషించారు నరసింహన్‌. రాష్ట్ర కనీస వేతనాల బోర్డులో సభ్యులుగా 2014-16, 2016-18వరకు కొనసాగారు. అసంఘటితరంగంలో పనిచేస్తున్న వివిధ షెడ్యూల్‌ ఆఫ్‌ ఎంప్లారుమెంట్‌ కేటగిరీ వారికి కనీస వేతనాలు పెంచటానికి కృషి చేశారు.

- యు.రత్నాకరరావు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జనహృదయ విజేత..నర్రా రాఘవరెడ్డి
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఎవరికోసం?
మొబైల్‌ మాయలో నేటి సమాజం
ప్రపంచ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన కరోనా..!
చిన్నారుల్లో సృజనాత్మకతను పెంపొందించండి
రాంజీ గోండ్‌ అమరత్వానికి 161ఏండ్లు
ధరాభారం షరా మామూలే
అస్థిత్వ సంక్షోభంలో మానవ జాతి..?
ప్రభుత్వమా... ఆలోచించుమా...
ఇవి ప్రభుత్వ హత్యలే...
మయన్మార్‌ నెత్తురోడుతోంది....
మలబార్‌ తీరంలో... సర్వేలు.. స్వరాలు
ఆధునిక బానిసత్వ రూపాలు - అమానవీయ పోకడలు
విప్లవయోధ - ధర్మభిక్షం
వివాహాలతో కనుమరుగవుతున్న బాల్యం
రెవెన్యూ లీలలు ధరణి పరిష్కరిస్తుందా?
క్షయ రహిత భారతం కోసం..
ప్రభుత్వరంగాన్ని కాపాడుకోవాలి
విశ్వానికి మార్గం చూపిన న్యూటన్‌
మనిషిని కబళించేస్తున్న సాంకేతికత..
తెలంగాణ రణభేరి అనభేరి ప్రభాకర్‌రావు
మహానగరాలు కాలుష్య కేంద్రాలు...!
విద్యా విప్లవ జ్యోతి సావిత్రిబాయి ఫూలే
ప్రభుత్వరంగాన్ని కాపాడుకోవాలి
మనిషిని కబళించేస్తున్న సాంకేతికత..
సులభతర జీవన సూచికల్లో తెలుగు నగరాల వెనుకంజ
''పెన్సిలిన్‌''ను కనుగొన్న అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌
స్ధితప్రజ్ఞతకు పర్యాయపదం స్త్రీ..
రెండు దశాబ్దాల పోరాట స్ఫూర్తి లక్ష్మి
''జాతీయ భద్రతా దినోత్సవం''

తాజా వార్తలు

09:59 PM

ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: చంద్రబాబు

09:41 PM

కోల్‌కతా లక్ష్యం 153

09:26 PM

పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత

09:23 PM

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!

09:06 PM

లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం

08:56 PM

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి గేమింగ్ స్మార్ట్‌ఫోన్

08:49 PM

రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు

08:34 PM

సీఎం కార్యాలయంలో కరోనా కలకలం..ఐసోలేషన్‌లో సీఎం

08:15 PM

నిజామాబాద్‌లో వడగళ్ల వర్షం

08:09 PM

భద్రాద్రి కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత

07:59 PM

కరోనా వాక్సిన్ తీసుకున్న‌వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.!

07:58 PM

నిజామాబాద్‌ జిల్లాలో దంపతుల క్షుద్ర పూజలు

07:13 PM

నల్గొండ ‌లో విద్యావాలంటీర్ శైల‌జ ఆత్మహత్య

07:07 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

07:01 PM

కరోనా వైరస్ కంటే ఈ వైరస్ చాలా డేంజర్‌..!

06:35 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:56 PM

గజియాబాద్‌లో భారీ అగ్ని‌ప్ర‌మాదం

05:49 PM

ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు

05:43 PM

రేపటి నుంచి 30 వరకు లాక్‌డౌన్‌.!

05:30 PM

రాళ్ల దాడి ఘటనపై సీఈసీకి ఫిర్యాదు చేసిన టీడీసీ ఎంపీలు

05:11 PM

ఐపీఎల్‌ చర్రితలో గేల్‌ అరుదైన రికార్డు

05:08 PM

'విరాటపర్వం' నుంచి సాయిపల్లవి ఫెస్టివల్ లుక్

05:02 PM

ఖైరతాబాద్‌లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు

04:53 PM

భర్త మెడపై కాళ్లతో తొక్కి దారుణంగా..!

04:32 PM

ఆర్‌బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌...బ్యాంకులకు వరుసగా 4రోజుల పాటు సెలవులు

04:19 PM

హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థిని దారుణ హత్య

04:01 PM

యస్‌ బ్యాంక్‌కు మరో భారీ షాక్

03:48 PM

కేసీఆర్‌ సభపై ఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు

03:43 PM

సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయండి: కేంద్రాన్ని కోరిన సీఎం

03:35 PM

కోల్‌కతాలో ధర్నాకు దిగిన మమతా బెనర్జీ!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.