Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోట్ల గిత్తలకే ముకుతాడు వేసి
కాడి కట్టించే రైతన్నలు
చెలరేగి పోతున్న పాలకుల మెడలు వంచి
చర్చలకు లాగడంలో ఆశ్చర్యమేముంది!
క్రిమికీటకాలు,పశుపక్షాదులనుండి
తమ పంటలను కాపాడుకునే రైతన్నలు
కార్పొరేట్ గద్దలనుండి తమ పొలాలను
కాపాడుకోవడంలో ఆశ్చర్యమేముంది!
ఎండా వాననకా ఆరుగాలం శ్రమించి
వ్యవసాయం చేసే రైతన్నలు, ఢిల్లీ సరిహద్దుల్లో
గడ్డకట్టే చలిలోశిబిరం వేసి
పోరుశంఖం పూరించడంలో ఆశ్చర్యమేముంది!
కులమత విద్వేషాలను కలుపు మొక్కల్లా
ఏరిపారేసి, ప్రజలందరినీ ఐక్యం చేసే ఎజండాను
దేశం ముందు ఉంచిన రైతన్నలకు
ప్రజలంతా జేజేలు పలకడంలో ఆశ్చర్యమేముంది!
-సత్యభాస్కర్,9848391638