Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పెరుగుతున్న జాత్యహంకారం | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

పెరుగుతున్న జాత్యహంకారం

తాజాగా సిడ్నీలో ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య జరిగిన మూడవ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో కొందరు ప్రేక్షకులు టీమ్‌ ఇండియాని లక్ష్యంగా చేసుకొని జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. గతంలో కొందరు ఆస్ట్రేలియా క్రికెటర్స్‌ స్లెడ్జింగ్‌ చేసి ఇతర దేశాల క్రీడాకారుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశారు. అయితే ఈసారి ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టీమ్‌ ఇండియాకు క్షమాపణలు చెప్పడం కొంతలో కొంత ఊరట కల్గించే అంశం. భారత క్రీడాకారులకు సరైన సౌకర్యాలు కల్పించలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
భారత్‌లో కులవివక్ష ఉన్నట్లే, విదేశాల్లో జాతివివక్ష నేటికీ కొనసాగుతుంది. ముఖ్యంగా అమెరికా, దక్షిణ ఆఫ్రికా, మరికొన్ని యూరోప్‌ దేశాల్లో ఈ వివక్ష ఎక్కువగా ఉంది. శ్వేత జాతీయులలో కొంతమంది అందరికంటే తామే తెలివిగలవారమనే భావంతో ఉంటారు. వారు ఆఫ్రికా, ఆసియా ఖండాలలో పలు దేశాలను ఆక్రమించుకొని వాటిని వలస రాజ్యాలుగా మార్చారు. ఆయా దేశాలలోని స్థానిక సంస్కతులని నాశనం చేశారు. ముడివనరులని దోచుకున్నారు. ప్రజల హక్కులని కాలరాసారు.
గాంధీజీ సైతం దక్షిణాఫ్రికాలో వివక్షకు గురైయ్యారు. అమెరికాలో నల్లజాతీయులపై ఇంకా ఏదో ఒక రూపంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. అమెరికాలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, ఆఫ్రికాలో నెల్సన్‌ మండేలా వంటివారు ఏండ్ల తరబడి జాతి వివక్షకి వ్యతిరేకంగా పోరాడారు. మధ్యాయుగాల్లో నల్లజాతీయులని బానిసలుగా మార్చారు. వివక్ష అనేది పలు రూపాల్లో ఉంటుంది. రంగు, అంగవైకల్యం, వయస్సు, పేదరికం, కులం, మతం, జాతి, లింగం, వర్గం తదితర రూపాల్లో వివక్ష కొనసాగుతుంది. కెంట్‌ విశ్వవిద్యాలయం సర్వే ప్రకారం ఇంగ్లాండ్‌లో వయసుపైబడి ఉద్యోగం చేయలేకపోవడం వల్ల 29శాతం మంది వివక్షకు గురవుతున్నారు. జాతి వివక్షతతో నల్ల జాతీయులతో సహా పలువురు తమ హక్కులని కోల్పుతున్నారు. ట్రంప్‌ పాలనా కాలంలో అమెరికాలో జాతీయవాదం పెరిగింది. ఈ వాదం అమెరికా ప్రజలకి మేలు చేయలేదు. గతంలో ఆస్ట్రేలియాలో కూడా పలువురు భారతీయ విద్యార్థులపై దాడులు జరిగాయి. మనదేశంలో దళితులు ఇంకా అంటరానివారిగానే కొనసాగుతున్నారు. అంబేద్కర్‌ మహాశయుడు ఇటువంటి వివక్షను ఇండియాలో ఎదుర్కొన్నారు. జాతి, కుల వివక్షను ఎదుర్కొనేవారు మనవహక్కులని కోల్పోతారు. వీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడుతుంటారు. దేశ సరిహద్దులలో నివసిస్తున్న ప్రజలకి పౌరసత్వ సమస్యలు తలెత్తుతున్నాయి. పటిష్టమైన మానవహక్కుల చట్టాలని వివిధ దేశాలు రూపొందించాలి.
జార్జ్‌ ఫ్లాయుడ్‌ని దారుణంగా హతమార్చిన తరువాత ప్రపంచవ్యాప్తంగా జాతివివక్షపై నిరసనలు వ్యక్తం అయ్యాయి. అమెరికాలోని సిబిఎస్‌ న్యూస్‌ అంచనా ప్రకారం 2020 జనవరి 1 నుంచి ఆగస్ట్‌ 31 వరకు అమెరికా పోలీసులు 164మంది నల్లజాతీయులని వివిధ కారణాలతో చంపారు. అన్ని హక్కులకంటే జీవించే హక్కే ప్రధానమని ఇటీవల మద్రాస్‌ హైకోర్టు తెలిపింది. కానీ వివక్ష వల్ల వివిధ ప్రాంతాల్లో అణగారిన వర్గాల ప్రజలు జీవించే హక్కుని కోల్పోతున్నారు. మానవ హక్కుల కమిషన్‌లని వివిధ ప్రాంతాల్లో పటిష్ట పరచాలి. సమాజంలో శాస్త్రీయ ఆలోచనల్ని పెంచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. హక్కులు కోల్పోయిన వారికి వెంటనే పునరావాసం కల్పించాలి. అమ్నెష్టి ఇంటర్నేషనల్‌ వంటి సంస్థలు మరింత బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది. తద్వారా కొంతవరకైనా జాతి, కులవివక్ష తగ్గే అవకాశం ఉంటుంది.
- ఎం. రామ్‌ ప్రదీప్‌
సెల్‌: 9492712836


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ కుట్రల మధ్య ఢిల్లీ రైతు ఉద్యమం
పసుపు రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు
పన్నుల భారంతోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదల
మానవ సమాజానికి శ్రమలే అవసరం, డబ్బు కాదు!
'డబ్బు' అంటే, శ్రమ! 'శ్రమ' అంటే, డబ్బు కాదు!
తరగతుల ప్రారంభంతోనే మొదలైన ప్రయివేట్‌ విద్యా సంస్థల దోపిడీ
జగతికి వెలుగులు ఈ శాస్త్రవేత్తలు
అలుపెరుగని కార్మికోద్యమ నేత కామ్రేడ్‌ టి. నరసింహన్‌
ఉభయకుశలోపరి...
బెల్లంలా పుల్లగా ఉంటది...
ప్రతి దానికీ కోర్టు చెప్పాల్సిందేనా...
వాట్సాప్‌...హ్యాండ్సప్‌
కష్టాల కొలిమిలో బడ్జెట్‌ పాఠశాలలు
డిజిటల్‌ యుగంలో నానో టెక్నాలజీ
క్షణికావేశంలో... పోతున్న ప్రాణాలు
ఆహారమే ఔషదం..!
ప్లాస్టిక్‌ భూతాన్ని నిలువరించలేమా?
ఓ పనైపోతుందిగా...
సమర్ధనకైనా సిగ్గుండాలే...
శూన్యమే...!
అసమానతలు పెరుగుతున్నారు! - ఆక్స్‌ఫామ్‌
ఈ మూఢహత్యలు ఆగేదెప్పుడు
మహనీయులకి గుర్తింపేది?
ప్రజాకళలకు గమ్యం చూపిన గరికపాటి
''స్ఫూర్తి ప్రధాత మగ్దూం''
మొబైల్‌ మాయలో నేటి సమాజం
ఢిల్లీ టూ గల్లీ...
కమ్యూనిస్టోల్లే వస్తారు
మనం మారం...
విధానాల్లో మార్పుంటుందా..?

తాజా వార్తలు

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

10:50 AM

షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

10:41 AM

తెలంగాణలో కొత్తగా మరో 176 పాజిటివ్ కేసులు

10:09 AM

దేశంలో కొత్తగా మరో 16వేల పాజిటివ్ కేసులు

09:56 AM

రాంగ్ రూట్‌లో వెళ్లాడు.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

09:41 AM

తరుణ్‌ బజాజ్‌కు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు

09:33 AM

అమెరికాలో భూకంపం..

09:24 AM

స్ట్రాంజా స్మారక బాక్సింగ్​ టోర్నీలో దీపక్​కు రజతం

09:16 AM

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

09:03 AM

వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్ చల్..

08:51 AM

విదేశాల నుంచి వచ్చే వారికి ఉచిత ఆర్టీపీసీఆర్ టెస్టులు..

08:43 AM

నేటి నుంచి పెద్దగట్టు జాతర..

08:29 AM

ప్రియుడిని చంపేందుకు సుపారీగా 'వన్ నైట్ ఆఫర్' ఇచ్చిన యువతి

08:15 AM

పీఎస్‌ఎల్‌వీ-సీ51 కౌంట్​డౌన్​.. నేడు నింగిలోకి రాకెట్

08:05 AM

తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక..

07:52 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

07:42 AM

కర్నూలు జిల్లాలో సీతారాముల ఆలయ రాత్రి స్తంభాల ధ్వంసం

07:33 AM

బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.60కే బిర్యానీ

07:21 AM

ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బదిలీల నిలిపివేత

07:10 AM

హయత్ నగర్ బస్టాండ్ వద్ద కారులో మంటలు..

06:59 AM

నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్​ షా పర్యటన

06:50 AM

ఉదయం 11 గంటలకు ప్రధాని మన్​కీ బాత్

06:43 AM

ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్..

06:34 AM

వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం : విజయసాయిరెడ్డి

09:56 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.