Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అత్యంత ప్రజాధరణ పొందిన ఇండియన్‌ వెబ్‌ సీరీస్‌లు..! | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

అత్యంత ప్రజాధరణ పొందిన ఇండియన్‌ వెబ్‌ సీరీస్‌లు..!

కరోనా విధించిన కర్ఫ్యూ లాంటి పరిస్థితిలో అన్నిరంగాలు కుంటు పడటం లేదా మూత పడటం జరిగింది. విద్యాలయాలు, సినిమా హాల్‌లు గత 8 మాసాలకు పైగా మూసి వేయబడ్డాయి. సినిమా షూటింగులే కాదు, సినిమాల ప్రదర్శనలనూ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కరోనా లాక్‌డౌన్‌, కదలికల తగ్గింపుతో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇండ్లలో టీవీల ముందు కూర్చొని కాలం గడపాల్సి వస్తున్నది. ఈ ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ఓటీటీ వేదికలకు గిరాకీ పెరిగింది. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ, హాట్‌స్పాట్‌, ఆహా, సోనీ టివీ, జీ టివీ లాంటి ఓటిటి (ఓవర్‌ ది టాప్‌) వేదికల్లో సినిమాలతో పాటు వెబ్‌ సీరియల్స్‌ను విడుదల చేస్తున్నారు. ఇలాంటి వెబ్‌ సీరీస్‌కు ప్రజాధరణ అనేక రెట్లు పెరిగిందని ఐయండిబి సీఈఓ నీధమ్‌ తెలిపారు. ఇలాంటి 250 భారతీయ ఓటీటీ వెబ్‌ సీరియల్స్‌ను ఐయండిబి కూలంకషంగా పరిశోధించి, పరిశీలించిన 10పాయింట్ల స్కేల్‌ ప్రాతిపదికన రేటింగ్‌ ఇవ్వడం జరిగింది. ఇంటర్నెట్‌ మూవీ డాటాబేస్‌ (ఐయండిబి) సంస్థ ద్వారా జాతీయ అంతర్జాతీయ వేదికల్లో ప్రజాధరణలో అగ్రస్థానంలో నిలిచిన సినిమాలు, ఓటీటీ వెబ్‌ సీరీస్‌ల జాబితాలను విడుదల చేయడం గత కొంత కాలంగా జరుగుతోంది. ఇండియన్‌ వెబ్‌ సీరీస్‌-2020లో అత్యంత ప్రజాధరణ పొందిన 10 సీరియల్స్‌ గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం.
1. స్కామ్‌-1992: ది హర్షద్‌? మెహతా స్టోరీ:
భారతీయ వెబ్‌ సీరీస్‌-2020లో 9.5/10 రేటింగ్‌తో 'స్కామ్‌ 1992: ది హర్షద్‌? మెహతా స్టోరీ' సీరియల్‌కు ఐయండిబి జాబితాల ప్రథమ స్థానం (ర్యాంక్‌) లభించడం విశేషంగా చెప్పవచ్చు. 1992లో స్టాక్‌ బ్రోకర్‌ ద్వారా బాంబే స్టాక్‌ ఎక్సచ్ఛేంజ్‌లో జరిగిన వేల కోట్ల కుంభకోణాన్ని సవివరంగా చిత్రీకరణ చేసి చూపరుల మన్ననలు పొందడం జరిగింది. ప్రముఖ స్టాక్‌ బ్రోకర్‌ హర్షద్‌? మెహతా జీవిత చరిత్రగా తీసిన ఈ డిస్నీ-హాట్‌స్టార్‌ (సోని లైవ్‌) వెబ్‌ సీరీస్‌లో నటీనటులు, కథ, కథనం, సరళత లాంటివి సామాన్యులకు అర్థం అయ్యే రీతిలో తీయడం జరిగింది. 'సుచేతదలాల్‌, దేబశీష్‌ బసు'లు రచించిన 'ది స్కామ్‌: హు వన్‌, హు లాస్ట్‌, హు గాట్‌ అవే' పుస్తకా ఆధారంగా ప్రతిక్‌ గాంధీ ప్రధాన పాత్రగా తీసిన ధారావాహికలో షరీబ్‌ హస్తి, శ్రేయ ధన్వంతరి, హేమంత్‌ ఖేర్‌, నిఖిల్‌ ద్వివేదిలు పాత్రలకు జీవం పోశారు.
2. పంచాయత్‌:
అమెజాన్‌ ప్రైమ్‌ విడియో సీరియల్‌గా విడుదలైన 'పంచాయత్‌' వెబ్‌ సీరీస్‌కు 8.7/10 రేటింగ్‌తో ద్వితీయ స్థానం లభించింది. ఉద్యోగ వేటలో యూపీలోని యువ ఇంజనీరు గ్రామ సెక్రటరీగా ఉద్యోగంలో చేరడం, తదనంతర హాస్య కథగా ఈ వెబ్‌ సీరియల్‌ నిర్మించారు. జితేంద్ర కుమార్‌, రఘువీర్‌ యాదవ్‌, నీనా గుప్తా, బిశ్వపతి సర్కార్‌లు ప్రముఖ నటీనటులుగా పాత్రలలో జీవించారు.
3. స్పెషల్‌ ఓపియస్‌:
ఎనిమిది ఎపిసోడులుగా నీరజ్‌ పాండే తీసిన 'స్పెషల్‌ ఓపియస్‌' ప్రజాధరణలో 8.7/10 రేటింగ్‌తో 3వ స్థానాన్ని దక్కించుకుంది. గూఢచర్యం ఆధారంగా 'రీసర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా)'లో పని చేసే హేమంత్‌ సింగ్‌ కథగా మరియు ఐదుగురు సహచర ఏజెంట్ల జీవిత గమనాన్ని ఆకర్షణీయంగా చిత్రీకరించారు. కె.కె. మెనన్‌ ప్రధాన పాత్ర పోషించిన 'స్పెషల్‌ ఓపియస్‌' సిరియల్‌ హాట్‌స్టార్‌- డిస్నీ వేదికలో ప్రసారం అవుతోంది.
4. బాండిష్‌ బండిట్స్‌:
శాస్త్రీయ సంగీత ప్రధాన 10-ఎపిసోడ్‌ల 'బాండిష్‌ బండిట్స్‌' వెబ్‌ సీరీస్‌లో రాధే, తమన్నా నటించారు. భారతీయ శాస్త్రీయ, పాప్‌ సంగీత సమ్మిళిత కథను హృధ్యంగా చిత్రీకరించారు. రిత్విక్‌, శ్రేయ కూడానటించిన ఈ సీరియల్‌కు 8.7/10 రేటింగ్‌తో 4వ స్థానం ప్రకటించారు. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై ప్రజాదరణలో మంచి ర్యాంకింగ్‌ను పొందింది.
5. మిర్జాపూర్‌-2:
టాప్‌-10 వెబ్‌ సీరీస్‌లో 8.4/10 రేటింగ్‌తో 5వ స్థానంలో క్రైమ్‌ థిల్లర్‌ డ్రామాగా నిలిచిన మిర్జాపూర్‌-2లో ప్రధాన పాత్రల్లో అవి ఫజల్‌, శ్వేత త్రిపాటిలు నటించారు. రెండవ సీజన్‌గా విడుదలైన ఈ వెబ్‌ సీరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది.
6. అసుర్‌:
వెల్‌కమ్‌ టు యువర్‌ డార్క్‌ సైడ్‌: ఊట్‌ సెలెక్ట్‌ వెబ్‌ వేదికగా విడుదలైన 'అసుర్‌' వెబ్‌ సీరీస్‌లో హర్షద్‌? వర్షీ, బరున్‌ సోబ్తీ నటించారు. సీరియల్‌ కిల్లర్‌ ప్రధాన అంశంగా వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'అసుర్‌' వెబ్‌ సీరియల్‌లో నిఖిల్‌ నాయర్‌ ఫొరెన్సిక్‌ నిపుణతగల ఉపాధ్యాయుడిగా నటించగా 8.4/10 రేటింగ్‌ పొందగలిగింది.
7. పాతాల్‌ లోక్‌:
అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన ఈ వెబ్‌ సీరీస్‌ 'పాతాల్‌ లోక్‌'లో ఢిల్లీ పోలీస్‌గా హతీరామ్‌ చౌదరీ పాత్ర హత్యానేరం చేసిన నలుగురిని పట్టించడం ఆధారంగా కథ సాగుతుంది. క్రైమ్‌ థిల్లర్‌గా నడిచిన ఈ సీరీస్‌లో ప్రథాన నటీనటులుగా నీరజ్‌ కబీ, అభిషేక్‌ బెనర్జీ, గుల్‌ పనగ్‌ పాత్రలకు జీవం పోశారు. 8.4/10 రేటింగ్‌తో 7వ స్థానంలో నిలిచి ప్రజాధరణ పొందింది.
8. హై:
అక్షరు ఒబెరాయ్ నటించిన 'హై' వెబ్‌ సీరీస్‌ యంయక్స్‌ ప్లేయర్‌ సీరీస్‌ వేదికగా విడుదలైంది. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తి కథగా సాగే ఈ వెబ్‌ సీరీస్‌లో శ్వేత బసు ప్రసాద్‌?, రనరీర్‌ షోరి, ప్రకాష్‌ బెలవడి మరియు నకుల్‌ భల్లాలు నటించగా 8.2/10 రేటింగ్‌తో 8వ స్థానం పొందింది.
9. అభయ్-2:
జీ 5 ఒరిజినల్‌గా తీసిన 'అభయ్-2' సీరీస్‌లో కునాల్‌ కెమ్ము అభరుగా నటించారు. క్రైమ్‌ స్టోరీగా తీసిన ఈ వెబ్‌ సీరీస్‌కు కెన్‌ ఘోష్‌ దర్శకత్వం వహించగా, బిపి సింగ్‌ ఫైర్‌ఫై ప్రొడక్షన్‌ వారు నిర్మించారు. ఇందులో కునాల్‌ కెమ్ము, సందీప ధర్‌, ఎల్నాజ్‌నొరోజి మరియు దీపక్‌ తిజోరి నటించగా 8.0/10 రేటింగ్‌ పొందింది.
10. ఆర్య:
సుస్మిత సేన్‌ నిర్మించి నటించిన క్రైమ్‌ డ్రామా 'ఆర్య' డిజిటల్‌ సీరీస్‌ డిస్నీ-హాట్‌స్టార్‌లో విడుదలైంది. అంకుర్‌ భాటియ, చంద్రచూర్‌ సింగ్‌, సికందర్‌ ఖేర్‌, నమిత దాస్‌లు నటించారు. రెండవ సీజన్‌కు తయారు అవుతున్న ఆర్యకు 7.9/10 రేటింగ్‌తో 10వ స్థానం దక్కింది.
కరోనా మబ్బులు తొలగడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. సినిమా హాల్స్‌ పూర్తి స్థాయిలో పని చేయటానికి మరింత సమయం పట్టవచ్చని అర్థం అవుతున్నది. ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తున్నది. వెబ్‌ ఆధార సినిమాలు, సీరీస్‌లకు గిరాకీ రోజు రోజుకు పెరుగుతున్నది. రాబోయే రోజుల్లో కరోనా తగ్గి సినిమా థియేటర్లు తెరుచుకున్నా ఓటీటీ వేదికలకు ఆదరణ తగ్గక పోగా డిమాండ్‌ అధికంగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓటీటీ వేదికల ద్వారా నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు పెరిగాయి. ఇదే క్రమంలో సినిమాకు సమాంతరంగా ఓటీటీల ద్వారా మంచి ప్రజాధరణగల సినిమాలు, వెబ్‌ సీరీస్‌లకు ఆదరణ క్రమంగా పెరుగుతుందని ఈ రంగాల నిపుణులు భావిస్తున్నారు.
(ఐయంబిడి రేటింగ్‌లో అగ్రభాగాన నిలిచిన ఇండియన్‌ వెబ్‌ సీరీస్‌-2020 జాబితా ఆధారంగా)

- డా|బి.మధుసూదన్‌ రెడ్డి
సెల్‌:9949700037




మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ కుట్రల మధ్య ఢిల్లీ రైతు ఉద్యమం
పసుపు రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు
పన్నుల భారంతోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదల
మానవ సమాజానికి శ్రమలే అవసరం, డబ్బు కాదు!
'డబ్బు' అంటే, శ్రమ! 'శ్రమ' అంటే, డబ్బు కాదు!
తరగతుల ప్రారంభంతోనే మొదలైన ప్రయివేట్‌ విద్యా సంస్థల దోపిడీ
జగతికి వెలుగులు ఈ శాస్త్రవేత్తలు
అలుపెరుగని కార్మికోద్యమ నేత కామ్రేడ్‌ టి. నరసింహన్‌
ఉభయకుశలోపరి...
బెల్లంలా పుల్లగా ఉంటది...
ప్రతి దానికీ కోర్టు చెప్పాల్సిందేనా...
వాట్సాప్‌...హ్యాండ్సప్‌
కష్టాల కొలిమిలో బడ్జెట్‌ పాఠశాలలు
డిజిటల్‌ యుగంలో నానో టెక్నాలజీ
క్షణికావేశంలో... పోతున్న ప్రాణాలు
ఆహారమే ఔషదం..!
ప్లాస్టిక్‌ భూతాన్ని నిలువరించలేమా?
ఓ పనైపోతుందిగా...
సమర్ధనకైనా సిగ్గుండాలే...
శూన్యమే...!
అసమానతలు పెరుగుతున్నారు! - ఆక్స్‌ఫామ్‌
ఈ మూఢహత్యలు ఆగేదెప్పుడు
మహనీయులకి గుర్తింపేది?
ప్రజాకళలకు గమ్యం చూపిన గరికపాటి
''స్ఫూర్తి ప్రధాత మగ్దూం''
మొబైల్‌ మాయలో నేటి సమాజం
ఢిల్లీ టూ గల్లీ...
కమ్యూనిస్టోల్లే వస్తారు
మనం మారం...
విధానాల్లో మార్పుంటుందా..?

తాజా వార్తలు

01:10 PM

టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలు.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

12:59 PM

విద్యావ్యవస్థలో మార్పులు రావాలి : రాహుల్ గాంధీ

12:48 PM

జగిత్యాల జిల్లాలో కారు ఢీకొని బాలుడు మృతి

12:40 PM

ముగిసిన రామమందిరం విరాళాల సేకరణ..రూ.2వేల కోట్లు వసూలు

12:29 PM

అప్పు తీర్చలేదని స్నేహితుడిపై కత్తితో దాడి

12:20 PM

గెలిచే టీడీపీ అభ్యర్థులను.. జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్

12:08 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దారుణ హత్య..

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

10:50 AM

షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

10:41 AM

తెలంగాణలో కొత్తగా మరో 176 పాజిటివ్ కేసులు

10:09 AM

దేశంలో కొత్తగా మరో 16వేల పాజిటివ్ కేసులు

09:56 AM

రాంగ్ రూట్‌లో వెళ్లాడు.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

09:41 AM

తరుణ్‌ బజాజ్‌కు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు

09:33 AM

అమెరికాలో భూకంపం..

09:24 AM

స్ట్రాంజా స్మారక బాక్సింగ్​ టోర్నీలో దీపక్​కు రజతం

09:16 AM

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

09:03 AM

వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్ చల్..

08:51 AM

విదేశాల నుంచి వచ్చే వారికి ఉచిత ఆర్టీపీసీఆర్ టెస్టులు..

08:43 AM

నేటి నుంచి పెద్దగట్టు జాతర..

08:29 AM

ప్రియుడిని చంపేందుకు సుపారీగా 'వన్ నైట్ ఆఫర్' ఇచ్చిన యువతి

08:15 AM

పీఎస్‌ఎల్‌వీ-సీ51 కౌంట్​డౌన్​.. నేడు నింగిలోకి రాకెట్

08:05 AM

తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక..

07:52 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

07:42 AM

కర్నూలు జిల్లాలో సీతారాముల ఆలయ రాత్రి స్తంభాల ధ్వంసం

07:33 AM

బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.60కే బిర్యానీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.