Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
చైనా ఐదేండ్లు ముందుకు.. భారత్‌ వెనక్కు.. మోడీనామిక్సు నిర్వాకం! | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Jan 07,2021

చైనా ఐదేండ్లు ముందుకు.. భారత్‌ వెనక్కు.. మోడీనామిక్సు నిర్వాకం!

చప్పట్లు కొట్టించి - దీపాలు వెలిగించగానే కరోనా పోలేదు. మోడినామిక్స్‌తో దేశంలో అభివద్ధి ఉరకలెత్తుతుందన్నారు. నరేంద్రమోడీ కారణంగానే దేశం ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించిందన్నారు. ఈ విజయగానాలన్నీ ఒక్కసారిగా మూగబోయాయి. ఆర్దిక వ్యవస్ధ మరింత దిగజారకుండా అన్నదాతలు నిలబెట్టారు. ఆ అన్నదాత వెన్ను విరిచేలా మోడీ ప్రభుత్వం మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు లక్షలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలో అయిదు వారాలుగా తిష్టవేసి వాటిని రద్దు చేస్తారా లేదా అని నిలదీస్తున్నారు.
సరిగ్గా ఈ సమయంలోనే ప్రపంచ జిడిపిలో ఐదవ స్దానానికి దేశం ఎదగటానికి నరేంద్రమోడీ నాయకత్వమే కారణమన్న భజనను ఆపివేయాలని లండన్‌ మేథో సంస్ధ సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసెర్చ్‌(సిఇబిఆర్‌) డిసెంబరు 26న తన నివేదికలో చెప్పింది. మనం ఐదు నుంచి ఆరవ స్ధానంలోకి ఎందుకు పడిపోయాం? మన కరెన్సీ విలువ బలహీనంగా ఉండటమే కారణం అని సిఇబిఆర్‌ చెప్పింది.
సిఇబిఆర్‌ విశ్లేషణ ప్రకారం అంచనా వేసినదానికంటే ఐదు సంవత్సరాలు ముందుగానే చైనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అగ్రస్ధానాన్ని చేరుకుంటుందని చెప్పింది. ఇదే సమయంలో గతంలో సాధించిన ఐదవ స్ధానాన్ని కోల్పోయిన భారత్‌ తిరిగి దాన్ని చేరుకోవడానికి మరో అయిదేళ్లవరకు వేచి ఉండాల్సివస్తుందని అది తెలిపింది. చైనాను వెనక్కు నెట్టేసి దేశాన్ని వేగంగా అభివద్ధి పధంలో నడిపిస్తున్నామని చెబుతున్న బిజెపి మరి దీన్ని గురించి ఏమి చెబుతుంది. 2019లో బ్రిటన్‌ను వెనక్కు నెట్టి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో ఐదవ స్ధానానికి ఎదిగిన భారత్‌ ఇంతలోనే ఆరవ స్ధానానికి దిగజారింది.
గతంలో వేసిన అంచనాకు భిన్నంగా చైనా 2028 నాటికే అమెరికాను వెనక్కు నెట్టి ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్ద స్ధానానికి చేరనుంది. కరోనా మహమ్మారి నుంచి కోలుకోవటంలో రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసం దీనికి కారణం.
దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంత ఎదిగిందని కాదు, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం. ఆ విధంగా చూసినపుడు అంతర్జాతీయ సంస్దలు రూపొందించిన అనేక సూచికల్లో మన దేశం నరేంద్రమోడీ హయాంలో మొత్తం మీద దిగజారింది తప్ప పెరగలేదు. ప్రత్యేక విమానాల్లో తిరిగే అంబానీ ఒక వైపు, కాలినడకన వందల కిలోమీటర్లు నడిచి స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికులు మరోవైపు ఈ రెండు దశ్యాలను కరోనా కాలంలో దేశ ప్రజలు చూశారు. సిఇబిఆర్‌ అంచనా ప్రకారం 2021్ష25 మధ్య చైనా వార్షిక వద్దిరేటు 5.7శాతం, 2026 - 30 మధ్య 4.5శాతంగానూ, ఇదే అమెరికా విషయానికి వస్తే 2022 - 24 మధ్య 1.9శాతం తరువాత 1.6శాతం వద్దిరేటు ఉంటుంది.
చైనా వద్ధి రేటు పైన పేర్కొన్న మాదిరి ఉంటుందా లేదా తగ్గుతుందా-పెరుగుతుందా, 2028 నాటికి అమెరికాను అధిగమిస్తుందా అన్నది పక్కన పెడితే వద్ది రేటు అమెరికా కంటే ఎక్కువ అన్నది స్పష్టం. అందుకే చైనాకు వ్యతిరేకంగా అమెరికా కుట్ర సిద్దాంతాలను ముందుకు తెస్తోంది. మన కాషాయ మరుగుజ్జుల మాదిరి గొప్పల కోసం, ప్రధమ స్దానం గురించి చైనీయులు తాపత్రయ పడటం లేదు. గత నాలుగు దశాబ్దాల సంస్కరణల చరిత్ర, తీరుతెన్నులు చూసినపుడు ప్రజల జీవన ప్రమాణాలు ఎంతగా మెరుగుపడ్డాయన్నదే కీలకంగా భావించారు. 2049లో చైనా విప్లవానికి వందేండ్లు నిండే సమయానికి మరింతగా ఎలా మెరుగుపరచాలా అన్నదాని మీదే కేంద్రీకరించింది. ఇటీవలనే 2021లో ప్రారంభమయ్యే 14వ వార్షిక ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది.
చైనా స్వంతంగా ఆయుధాలు తయారు చేసుకుంటుంటే మనం జన కష్టార్జితాన్ని అమెరికా ఆయుధాల కొనుగోలుకు వెచ్చిస్తున్నాం. గుజరాత్‌ తరహా అభివద్ది అన్నారు. మేడిన్‌ ఇండియా పిలుపునిచ్చారు. మోడినామిక్స్‌ అని చెప్పారు. ప్రపంచాభివద్దికి చేసిన కషికి గాను నరేంద్రమోడీ సియోల్‌ అవార్డును కూడా పొందారు.
జనానికి జ్ఞాపకశక్తి తగ్గిపోతోందో లేక పాలకుల మీద భ్రమలు పెరుగుతున్నాయో తెలియటం లేదు. దేశ ఎగుమతులను 2015్ష20 సంవత్సరాలలో 900 బిలియన్‌ డాలర్లకు పెంచుతానని మోడీ సర్కార్‌ ప్రకటించింది. వికీపీడియా అంకెల మేరకు 2014 నుంచి 2020 మధ్య ఏడు సంవత్సరాల కాలంలో వార్షిక సగటు ఎగుమతులు 302 బిలియన్‌ డాలర్లు.2014లో 318.2బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరిగితే 2020లో 314.31 బిలియన్‌ డాలర్లు.ఇదే సమయంలో మన దిగుమతుల వార్షిక సగటు 446 బిలియన్‌ డాలర్లు.2014లో 462.9 బి.డాలర్లు ఉంటే 2020లో 467.19 బి.డాలర్లు. మేక్‌(తయారు) ఇన్‌ ఇండియా కాస్తా మెస్‌ (తారు మారు లేదా గందరగోళం) ఇన్‌ ఇండియాగా మారింది.
తమ విదేశీ వాణిజ్యం (ఎగుమతుల్షుదిగుమతుల విలువ) నిమిషానికి 91.9లక్షల డాలర్లు దాటిందని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ డిసెంబరు 25న ప్రకటించింది.2015తో పోల్చితే 2020లో 30శాతం పెరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్ద వివరాల ప్రకారం 2015లో ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా 13.8శాతంగా ఉంది.
మన ఆర్దిక వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో, అనుసరించిన విధానాలు ఎంత దివాలాకోరుగా ఉన్నాయో కరోనాకు ముందే వెల్లడైంది. కరోనా కారణంగా తలెత్తిన విపత్కర పరిస్ధితుల్లో వినియోగాన్ని పెంచేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలన్న అనేక మంది ఆర్ధికవేత్తల సూచనలను నరేంద్రమోడీ సర్కార్‌ పెడచెవినపెట్టింది. జనం చేతుల్లో డబ్బులు పెడితే సమస్య పరిష్కారం కాదని వాదించింది. వారికి డబ్బు ఇస్తే ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని, జనం పాత రుణాలను చెల్లించటానికి దాన్ని వినియోగించవచ్చు లేదా భవిష్యత్‌లో తలెత్తే అనిశ్చిత అవసరాలకు పొదుపు చేస్తారని, దీనివల్ల ఆర్ధిక వ్యవస్ధకు ఎలాంటి ఉపయోగమూ ఉండదంటూ కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది.
దీన్ని మరో విధంగా చెప్పాలంటే కరోనాకు ముందే జనం అప్పులపాలయ్యారు(ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకుంటారు అంటే అర్దం అదే కదా ) కడుపు కాల్చుకొని డబ్బు ఎప్పుడు దాచుకుంటారు అంటే భవిష్యత్‌ ఎలా ఉంటుందో అన్న విశ్వాసం లేనపుడు, దారీ తెన్నూ కనిపించనపుడే. అంటే ఆరేళ్ల మోడీ పాలన అలాంటి పరిస్ధితిని తీసుకొచ్చిందన్నమాట. కరోనా వస్తే చికిత్సకు అయ్యే ఖర్చు గురించి జనం ఎంత ఆందోళన చెందారో అందరికీ తెలిసిందే. సిఎంఐయి సమాచారం ప్రకారం 2019లో వేతన జీవులు 8.7 కోట్ల మంది ఉన్నారు.2020 నవంబరులో ఆ సంఖ్య 6.8కోట్లకు తగ్గింది. అంటే ప్రతి వంద మందిలో 21 మంది ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగాల్లో ఉన్నవారి వేతనాల్లో కోతల గురించి తెలిసిందే.
లాక్‌డౌన్‌ సడలించిన తరువాత దసరా, దీపావళి ఇతర పండుగలు వచ్చాయి. ఆర్ధిక వ్యవస్ధ పుంజుకుంటుంది, పెద్ద మొత్తంలో జనాలు కొనుగోలు చేస్తారనే వాతావరణం కల్పించారు. కానీ జరిగిందేమిటి ? పెద్ద సంఖ్యలో నిలువ చేసిన వస్తువులు పెరిగాయి. కార్లు, ద్విచక్రవాహనాల అమ్మకాలు దారుణంగా ఉన్నాయని నవంబరు లెక్కలు చెప్పాయి. గహౌపకరణాల పరిస్దితీ అంతే. ఆర్ధిక వ్యవస్ధ సజావుగా ఉందని చెప్పేందుకు కార్పొరేట్‌ కంపెనీల లాభాలు పెరగటాన్ని కొందరు చూపుతున్నారు.
ముఖ్యమంత్రిగా మోడీ గుజరాత్‌ను ఉద్దరించినట్లు ఊదరగొట్టారు. దాన్నే దేశమంతటా అమలు చేస్తానని 2014 ఎన్నికల్లో జనాన్ని నమ్మించారు. 2016 నవంబరు ఎనిమిదిన మోడీ పెద్ద నోట్లరద్దు షాక్‌ నుంచే ఇంకా తేరుకోలేదు. తరువాత జిఎస్‌టితో చిన్న పరిశ్రమలు, వ్యాపారాల వారిని ఎంత ఇబ్బంది పెట్టారో దాని ప్రతికూల పర్యవసానాలు ఏమిటో చూస్తున్నాము. ప్రయివేటు రంగం గురించి నరేంద్రమోడీ సర్కార్‌ పెద్ద ఆశలు పెట్టుకుంది. వారికి ఇవ్వని రాయితీలు లేవు. అయినా ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తోంది. ఇదీ ప్రైవేట్‌ రంగం ఘనత. కనుక మోడినామిక్స్‌ అన్నా మరొకటి అన్న అవి జనానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయా లేదా అన్నదే ముఖ్యం. గత ఆరున్నర సంవత్సరాలలో ఆ జాడే లేదు. సంపద కొద్ది మంది చేతుల్లో పోగుపడుతుందడం వల్ల ఆర్థిక అసమానతలు విపరీతంగా పెటరిగిపోతున్నాయి.

- ఎం. కోటేశ్వరరావు
సెల్‌: 8331013288

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ కుట్రల మధ్య ఢిల్లీ రైతు ఉద్యమం
పసుపు రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు
పన్నుల భారంతోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదల
మానవ సమాజానికి శ్రమలే అవసరం, డబ్బు కాదు!
'డబ్బు' అంటే, శ్రమ! 'శ్రమ' అంటే, డబ్బు కాదు!
తరగతుల ప్రారంభంతోనే మొదలైన ప్రయివేట్‌ విద్యా సంస్థల దోపిడీ
జగతికి వెలుగులు ఈ శాస్త్రవేత్తలు
అలుపెరుగని కార్మికోద్యమ నేత కామ్రేడ్‌ టి. నరసింహన్‌
ఉభయకుశలోపరి...
బెల్లంలా పుల్లగా ఉంటది...
ప్రతి దానికీ కోర్టు చెప్పాల్సిందేనా...
వాట్సాప్‌...హ్యాండ్సప్‌
కష్టాల కొలిమిలో బడ్జెట్‌ పాఠశాలలు
డిజిటల్‌ యుగంలో నానో టెక్నాలజీ
క్షణికావేశంలో... పోతున్న ప్రాణాలు
ఆహారమే ఔషదం..!
ప్లాస్టిక్‌ భూతాన్ని నిలువరించలేమా?
ఓ పనైపోతుందిగా...
సమర్ధనకైనా సిగ్గుండాలే...
శూన్యమే...!
అసమానతలు పెరుగుతున్నారు! - ఆక్స్‌ఫామ్‌
ఈ మూఢహత్యలు ఆగేదెప్పుడు
మహనీయులకి గుర్తింపేది?
ప్రజాకళలకు గమ్యం చూపిన గరికపాటి
''స్ఫూర్తి ప్రధాత మగ్దూం''
మొబైల్‌ మాయలో నేటి సమాజం
ఢిల్లీ టూ గల్లీ...
కమ్యూనిస్టోల్లే వస్తారు
మనం మారం...
విధానాల్లో మార్పుంటుందా..?

తాజా వార్తలు

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

05:29 PM

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..

05:21 PM

ఎంపీ అరవింద్ సభలో కుర్రాడి రియాక్షన్స్.. వీడియో వైరల్

05:09 PM

నగరంలో 16కేజీల గంజాయి స్వాధీనం

05:02 PM

మార్చి 8న ఘనంగా మహిళా దినోత్సవం: కేవీపీఎస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.