Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మోడీకి అంబాని, అదానీ ప్రయోజనాలే ముఖ్యం | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Jan 07,2021

మోడీకి అంబాని, అదానీ ప్రయోజనాలే ముఖ్యం

అంబానీ, అదానీలకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను చౌకగా కొనడానికి, నిల్వ చేసుకోవడానికి ఈ చట్టాలు చక్కటి అవకాశం కల్పిస్తున్నాయి. ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పంటనైనా నిల్వ చేసుకోవచ్చు. విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. వీరికి ఎటువంటి నిబంధనలు వర్తించవు. కిసాన్‌ ముక్తి మోర్చా పేరుతో 500 రైతు సంఘాలు ఢిల్లీ చేరి దాదాపు నెలన్నర కావస్తుంది. రైతాంగం చేస్తున్న పోరాటానికి భారత్‌ బంద్‌ సందర్భంగా కార్మిక వర్గాలతో సహా దేశ ప్రజానీకం యావత్తూ మద్దతు తెలిపింది. అంతర్జాతీయంగా సంఘీభావం వచ్చింది. బిజెపి ప్రభుత్వం మాత్రం చట్టాలను రద్దు చేసే సమస్య లేదని తేల్చి చెప్పింది. పోరాడుతున్న రైతాంగంపై నిందలకు దిగింది. వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ బిల్లు-2020 రద్దయ్యే వరకు పోరాటాన్ని ఉధతం చేస్తామని 500 రైతు సంఘాలు ముక్త కంఠంతో చెప్పాయి. రైతాంగం మరింత సమీకతం అవుతున్నారు. మోడీ ప్రభుత్వంపై పోరాటంతో పాటు భారతదేశ బడా పెట్టుబడిదారులైన అదానీ, అంబానీల వస్తు బహిష్కరణకు పిలుపు ఇచ్చారు. ఈ ఇరువురు మోడీ ప్రభుత్వానికి అండగా వుండగా... మోడీ ప్రభుత్వం దేశ ప్రయోజనాల కన్నా వీరి ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోంది.
అదానీ, అంబానీలకు విస్తారమైన వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల యావత్‌ ప్రజానీకం ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాయి. చిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు మూతబడి తీవ్ర నష్టాలపాలయ్యాయి. అయినప్పటికీ వీరిద్దరి ఆదాయాలు మాత్రం అత్యధికంగా పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. మోడీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలు వీరిద్దరికీ మరింత లాభాలు చేకూర్చుతున్నాయి అదానీ, అంబానీలు విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో ప్రధానమైన ఉత్పత్తిదారులు. ప్రైవేట్‌ విద్యుత్‌ ఉత్పత్తిదారులకు అయ్యే ఉత్పత్తి ఖర్చు మేరకు లాభాలు కలిపి యూనిట్‌ ధరను నిర్ణయించాలని విద్యుత్‌ బిల్లు-2020 పేర్కొన్నది. అందుకుగాను రైతాంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్‌ స్థానంలో మీటర్లు పెట్టాలని నిర్ణయించింది. దేశంలో మొత్తం 25 కోట్ల స్మార్ట్‌ మీటర్ల తయారీ ఆర్డర్‌ రిలయన్స్‌కు దక్కింది. ఈ మీటర్ల వల్ల అంబానీకి కనీసం రూ.50 వేల కోట్లు లాభం చేకూరుతుందని ఆర్థికవేత్తల అంచనా. విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ మొత్తం కారుచౌకగా ప్రైవేటు వారికి అప్పగించాలనే జీవో విడుదల చేసింది. మొత్తం పంపిణీ వ్యవస్థ వీరిద్దరి కనుసైగ తోనే నడవనుంది. 'విద్యుత్‌ బిల్లు-2020' అదానీ కార్యాలయంలోనే తయారయిందన్న వార్తలు వచ్చాయి.
అంబానీకి దేశవ్యాప్తంగా రిటైల్‌ మాల్స్‌ ఉన్నాయి. అదానీకి ఎగుమతి వ్యాపారాలు ఉన్నాయి. అంబానీకి దేశంలోనే ప్రధానమైన బట్టల పరిశ్రమ ఉన్నది. వీరిద్దరికీ అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను చౌకగా కొనడానికి, నిల్వ చేసుకోవడానికి ఈ చట్టాలు చక్కటి అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే రైతుల దగ్గర కిలో రూ.60 కొంటున్న మినుములు గుళ్ళుగా మార్చి...కిలో రూ.200కు అమ్ముకుంటున్నారు. కిలో రూ. 60కు కొంటున్న పెసలు కిలో రూ.170కు అమ్ముకుంటున్నారు. ఈ చట్టాల వల్ల రు.300కు అమ్ముకున్నా వీరికి ఎటువంటి నిబంధనలు వర్తించవు. అదానీకి 2019 లోనే 9 వ్యవసాయ వ్యాపారాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ శుభసమయంలో అదానీకి హర్యానా లోని బి.జె.పి ప్రభుత్వం భారీ గోడౌన్లు నిర్మించుకోవడానికి భూములు కేటాయించింది. నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ సొమ్ములో సింహభాగం వీరికే దక్కుతుంది. నేరుగా రైతుకు దక్కేది ఒక్క రూపాయి కూడా లేదు. ఈ చట్టాల వల్ల అదానీ ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువచేసే పంటనైనా నిల్వ చేసుకోవచ్చు. విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. ఎటువంటి నిబంధనలు వర్తించవు.
అంబానీకి దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ వ్యాపారాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ వల్ల పెట్రోలు డీజిల్‌ ధరలు 40 శాతానికి పడిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయినా మోడీ ప్రభుత్వం పన్నులు పెంచి ప్రజలను కొల్లగొడుతోంది. పాపం అంబానీ గారికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పడిపోకుండా మోడీజీ కాపలా కాస్తున్నారు కదా! ఈ లాక్‌డౌన్‌ కాలంలో రిలయన్సు వారికి పెట్రోల్‌, డీజిల్‌ ద్వారా ఎన్ని రూ. వేల కోట్లు లాభం చేకూరిందో ఏ లెక్కల మాష్టారయినా చెప్పగలరు. అంబానీ, అదానీల వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికి...మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల గుప్పెట్లో పెట్టడానికి...మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. రెండో వైపు కార్మికవర్గం 100 సంవత్సరాల కాలంలో పోరాడి సాధించుకున్న హక్కులన్నిటిని హరిస్తూ కార్మిక కోడ్‌లు చేసింది. అందుకే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ప్రధాన సలహాదారులుగా ఉన్నారు. అందుకే వీరికి కోర్టుల వల్ల ఏ ఇబ్బందీ కలగనీయకుండా....చట్టంలో కోర్టులపై నిషేధం పెట్టారు. అందుకు బదులుగా అంబానీ తదితరులు వారి పాదాక్రాంతమై ఉన్న ప్రచార మాధ్యమాలు వీసమెత్తు మాట పడకుండా చూడటంతో పాటు, రైతుల సాగిస్తున్న పోరాటాన్ని ప్రపంచానికి తెలియచేయకుండా తొక్కిపెడుతున్నారు. అంబానీ, అదానీల వస్తువులను బహిష్కరించాలని కిసాన్‌ ముక్తి మోర్చా ఇచ్చిన పిలుపు సముచితమైనది. ఇది స్వాతంత్రోద్యమంలో వస్తు బహిష్కరణ వంటిదని పలువురు చెబుతున్నారు. ప్రజలందరూ దీనిని అమలు పరచాలి.

- కే. కేశవరావు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ కుట్రల మధ్య ఢిల్లీ రైతు ఉద్యమం
పసుపు రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు
పన్నుల భారంతోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదల
మానవ సమాజానికి శ్రమలే అవసరం, డబ్బు కాదు!
'డబ్బు' అంటే, శ్రమ! 'శ్రమ' అంటే, డబ్బు కాదు!
తరగతుల ప్రారంభంతోనే మొదలైన ప్రయివేట్‌ విద్యా సంస్థల దోపిడీ
జగతికి వెలుగులు ఈ శాస్త్రవేత్తలు
అలుపెరుగని కార్మికోద్యమ నేత కామ్రేడ్‌ టి. నరసింహన్‌
ఉభయకుశలోపరి...
బెల్లంలా పుల్లగా ఉంటది...
ప్రతి దానికీ కోర్టు చెప్పాల్సిందేనా...
వాట్సాప్‌...హ్యాండ్సప్‌
కష్టాల కొలిమిలో బడ్జెట్‌ పాఠశాలలు
డిజిటల్‌ యుగంలో నానో టెక్నాలజీ
క్షణికావేశంలో... పోతున్న ప్రాణాలు
ఆహారమే ఔషదం..!
ప్లాస్టిక్‌ భూతాన్ని నిలువరించలేమా?
ఓ పనైపోతుందిగా...
సమర్ధనకైనా సిగ్గుండాలే...
శూన్యమే...!
అసమానతలు పెరుగుతున్నారు! - ఆక్స్‌ఫామ్‌
ఈ మూఢహత్యలు ఆగేదెప్పుడు
మహనీయులకి గుర్తింపేది?
ప్రజాకళలకు గమ్యం చూపిన గరికపాటి
''స్ఫూర్తి ప్రధాత మగ్దూం''
మొబైల్‌ మాయలో నేటి సమాజం
ఢిల్లీ టూ గల్లీ...
కమ్యూనిస్టోల్లే వస్తారు
మనం మారం...
విధానాల్లో మార్పుంటుందా..?

తాజా వార్తలు

09:42 PM

మంత్రి కేటీఆర్ కు షాక్..

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

05:29 PM

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..

05:21 PM

ఎంపీ అరవింద్ సభలో కుర్రాడి రియాక్షన్స్.. వీడియో వైరల్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.