Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికలొస్తే చాలు.... తాము ఏమి చేశామో... గెలిపిస్తే ఏమి చేస్తామో ప్రధాన పార్టీలు చెప్పడం లేదు. పైపెచ్చు గతంలో అధికారంలో ఉండి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పరస్పరం ఇతరుల వైఫల్యాలను ఎండగట్టడంలోనే మునిగిపోయాయి. వైషమ్యాలను రెచ్చగొడుతూ అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయి. ప్రజాసంఘాలు పదే పదే ప్రజల తరపున డిమాండ్లను వినిపిస్తున్నా వాటిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మేధావులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ప్రజల తరపున ప్రజాసంఘాలు మరింత కీలకంగా వ్యవహ రించి రాజకీయ పార్టీలపై ఒత్తిడిపెంచాల్సిన అవసర ముందని సూచిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో జరు గుతున్న ఎన్నికల్లో ఎక్కువ మంది విద్యావంతులే పాల్గొంటున్నందన ఎన్నికల్లో పరిణితీ, తగిన రాజకీయ చైతన్యం కనిపించాలని ఆశిస్తున్నారు.
- కె.ప్రియకుమార్