Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదల ఇలా 18శాఖలకు మంత్రులు ఉంటారనీ తెలుసు. కొత్తగా నవ్వుల మంత్రి కూడా ఉన్నారన్న సంగతి అక్కడ ఇక్కడ అంటుంటే విన్నాను. ఈ విషయం కొంత మందికే తెలుసు. ఆయన ఆవేశంగా మాట్లాడినా... ఉత్సాహంగా ప్రసంగించినా ఎదుటి వారు కడుపుబ్బా నవ్వాల్సిందే. అది అసెంబ్లీ కావచ్చు. లేదా బహిరంగసభా కావచ్చు... ఆయన మాటలు వింటే వీక్షకుల్లో నవ్వులపువ్వులు విరజిమ్ముతాయి. ఎవరేమనుకున్నా ఆయన చెప్పాల్సింది చెపితేగానీ ఆయన మనస్సు కుదట పడదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు ఎవర్నెనైనా తన ఉపన్యాసంతో నవ్వించగలరు. జోకులతో అదరగొట్టగలరు. ఇప్పటికైనా ఆ మంత్రి ఎవరో మీకు గుర్తొంచి ఉంటుదనుకుంటా. ఇటీవల మూడు చింతలపల్లిలో సీఎం ధరణి వెబ్‌సైట్ ప్రారంభం సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. సీఎం మాట్లాడే ముందు ఆ జిల్లా మంత్రికి మాట్లాడే అవకాశం ఇవ్వడంతో సీఎంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సభకు వచ్చిన వారు, వేదికపై ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో నవ్వులే నవ్వులు. ఇది గమనించిన సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని ఆ మంత్రి స్పీచ్ ఆపమన్నట్టుగా సీఎస్‌ను ఆదేశించారు. సారూ మీ ఉపన్యాసం ముగించాలని సీఎస్ కోరడంతో విత్ ఇన్ సెకండ్‌లోనే ఉపన్యాసం ఆపేసి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ గట్టిగా నినాదాలు చేయడంతో మళ్లీ నవ్వారు. ఆయనే మన నవ్వుల మంత్రి మల్లారెడ్డి గారు...
- గుడిగ రఘు