Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రభుత్వాల వల్లే వ్యవసాయ సంక్షోభం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

ప్రభుత్వాల వల్లే వ్యవసాయ సంక్షోభం

- రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
- ఖమ్మంలో భారీ ప్రదర్శన, ధర్నా
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్లే వ్యవసాయరంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయాలనీ, గిట్టుబాటు ధరలకు పంటలు కొనుగోలు చేయాలనీ, రైతుబంధు నిధులు విడుదల చేయాలనీ డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఖమ్మంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పోతినేని మాట్లాడుతూ.. మోడీ, కేసీఆర్‌కు రైతులంటే చాలా చిన్నచూపనీ, వ్యవసాయం పట్ల వీరిద్దరిదీ ఒకే దారనీ విమర్శించారు. ఐదేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా లక్షా పదిహేను వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని కార్పొరేట్‌ సంస్థలు ఇంతకు ముందు రూ.250కోట్ల టర్నోవర్‌ చేస్తే వచ్చిన ఆదాయంలో 35శాతం పన్ను కట్టాలనే నిబంధన ఉండేదని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.250 కోట్ల టర్నోవర్‌ను రూ.400 కోట్లకు పెంచారనీ, 35శాతం ఉన్న పన్నును 20శాతానికి కుదించారని విమర్శించారు. ఈ లెక్కన ఇరవై ముప్పై కార్పొరేట్‌ సంస్థల కుటుంబాలకే రూ.2లక్షల కోట్ల ఆదాయం వచ్చేలా చేశారన్నారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన సమయంలో రూ.లక్ష కోట్ల ఆస్తులున్న ముఖేష్‌ అంబానీ నేడు రూ.19లక్షల కోట్లకు చేరుకున్నారని చెప్పారు. మరో వైపు రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.
సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ చేసిన పాపానికి రైతులు, అధికారులు తన్నులాడుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం తన తప్పులను అధికారులపైకి నెట్టి చోద్యం చూస్తోందన్నారు. ఇప్పటికైనా రైతాంగ సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరారు. ప్రదర్శన అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బత్తుల లెనిన్‌, భూక్యా వీరభద్రం, మాచర్ల భారతి, బండిరమేష్‌, కల్యాణం వెంకేటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పోడుభూములకు హక్కుపత్రాలివ్వాలి:వ్యకాస ఆధ్వర్యంలో నిరసన దీక్ష
పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఉపాధి కూలీల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, అర్హులందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాటోత్‌ కృష్ణ, మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పేదలందరికీ ఎవరి స్థలంలో వారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామనీ, పోడు సాగుదారులకు హక్కు పత్రాలిస్తామన్న ప్రభుత్వ హామీలను అమలు చేయాలని కోరారు. చౌకధరల దుకాణాల్లో 14 రకాల వస్తువులు ఇస్తామని చెప్పి బియ్యం మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. దళిత, గిరిజనులకు మూడెకరాల సాగు భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య, సహాయ కార్యదర్శులు రేపాకుల శ్రీనివాస్‌, బత్తుల వెంకటేశ్వర్లు, ఎస్‌.వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇక తిరుగుబాటే..
బీజేపీ విధానాలతో సంక్షోభంలో రవాణారంగం
19 నెలలుగా ఒక్కపైసా రాలే
రాజ్యాంగంపై దాడి..
నాలుగు వేళ్లు నోట్లోకెళ్లాలంటే..
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిందే
రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర
ఓటు.. రాజ్యాంగం కల్పించిన హక్కు
కళాకారుల మౌనం క్యాన్సర్‌ కంటే ప్రమాదం
వ్యవసాయ సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచాలి
గిరాకీ మెండు...తగ్గిన దిగుబడి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురి హత్య
అది ఒక రహస్య విచారణ
రాబడులకు భిన్నంగా పద్దులు..
హైదరాబాద్‌లో కిసాన్‌-మజ్దూర్‌ పరేడ్‌
పీఆర్సీలో సీపీఎస్‌ ఉద్యోగులకు న్యాయం చేయాలి
మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పీవీ సంజయ్ కుమార్‌
ఏజెన్సీలో వందశాతం పదోన్నతులు గిరిజన టీచర్లకే ఇవ్వాలి
మహీంద్ర వర్సిటీ ప్రొఫెసర్‌ బిష్ణుపాల్‌కు అవార్డు
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
వ్యాక్సిన్‌ తీసుకున్న ఆశా వర్కర్‌ కు అస్వస్థత
'వీఆర్వోలకు పదోన్నతి కల్పించాలి'
ప్రేమజంట ఆత్మహత్య
ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ
కేసీఆర్‌కు ధన్యవాదాలు
పసుపు రైతుల సమస్యలపై ఆర్మూర్‌లో 30న దీక్ష : జీవన్‌ రెడ్డి
సీఎం ఆదేశాలు అమలు చేయరా?
బలవంతపు భూసేకరణను ఆపాలి
27న సంఘాలతో సమావేశం...?
ఐటీ అభివృద్ధి కోసం సలహాలను స్వీకరించండి

తాజా వార్తలు

01:49 PM

మెట్రో స్టేషన్ల మూసివేత

01:39 PM

రోడ్డుపై బైఠాయించి రైతుల ట్రాక్టర్ పరేడ్ ను అడ్డుకున్న పోలీసులు

01:26 PM

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పరిపాలన ప్రభుత్వాలు : ఉత్తమ్

01:23 PM

పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

01:21 PM

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ..

01:18 PM

ఢిల్లీ రైతులకు మద్దతుగా విశాఖలో బైక్ ర్యాలీ

01:07 PM

కూతుళ్ల జంట హత్యల కేసులో తల్లిదండ్రులు అరెస్ట్..

01:07 PM

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌ మార్చ్‌

12:55 PM

ఢిల్లీలో ప్రారంభమైన రైతుల ట్రాక్టర్ పరేడ్

12:39 PM

వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయము : స్పీకర్

12:36 PM

కేటీఆర్‌ను సీఎం కాకుండా ఆ ముగ్గురు అడ్డుకుంటారు: రేవంత్

12:34 PM

కడప జిల్లాలో ట్రాక్టర్లతో అఖిలపక్ష పార్టీల నిరసన ర్యాలీ

12:23 PM

రాజేంద్రనగర్‌లో ఇంట‌ర్ విద్యా‌ర్థి‌ని అదృశ్యం

12:21 PM

గణతంత్ర వేడుకలకు రానందుకు విచారకరంగా ఉంది : బ్రిటిన్ ప్రధాని

12:09 PM

దేశంలోనే శక్తివంతమైన రాష్ట్రంగా తెలంగాణ : గవర్నర్ తమిళ సై

12:00 PM

హైకోర్టులో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న చీఫ్ జస్టీస్ హిమా కోహ్లీ

11:55 AM

నడిరోడ్డుపై భార్యాపిల్లల ఎదుట వ్యక్తి దారుణ హత్య

11:44 AM

రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

11:40 AM

విదేశీ అతిథి లేకుండానే ఈసారి గణతంత్ర వేడుకలు..

11:15 AM

జెండా వందనంలో పాల్గొన్న లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా..

11:07 AM

గ్రామ సచివాలయాలు, వాలంటీర్లకు షాకిచ్చి‌న‌ ఎస్ఈసీ

11:05 AM

ఢిల్లీ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత

10:49 AM

గణతంత్ర వేడుకల్లో ఘర్షణ

10:48 AM

దేశంలో కొత్తగా మరో 9వేల పాజిటివ్ కేసులు

10:45 AM

మోడీ ఆటలు.. కేసీఆర్ కబుర్లు ఇక సాగవు : బృందాకారత్

10:43 AM

టాటాఏస్, లారీ ఢీకొన్ని ఒక‌రు మృతి

10:40 AM

ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం

10:38 AM

జాతీయ పతాకం ఆవిష్కరించిన రాష్ట్రపతి

10:27 AM

పోలీసుల అదుపులో మరో సైకో కిల్లర్

09:54 AM

రైతుల ట్రాక్టరు ర్యాలీ ప్రారంభం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.