Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డ వైనం
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఒక కేసులో అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసిన సిటీ సివిల్ కోర్టుకు చెందిన బెంచ్ క్లర్కు బొజ్జ రామ కృష్ణను ఏసీబీ అధికారులు రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ జె.పూర్ణచంద్రరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్యామిలీ కోర్టులో సికింద్రాబాద్‌కు చెందిన ఆలోక్‌వర్దన్ సింగ్‌కు చెందిన రెండు కేసుల విచారణ సాగుతున్నది. ఈ రెండు కేసుల్లో తీర్పు అనుకూలం గా వచ్చేలా చేస్తానని క్లర్కు రామకృష్ణ అలోక్‌వర్దన్‌కు తెలిపాడు. అందుకు ఫ్యామిలీ కోర్టు అదనపు జిల్లా జడ్జి ఎస్.శ్రీవాణికి రూ.15 లక్షలు ఇవ్వాలనీ, అలాగే తనకు ఒక కొత్త మోటర్‌సైకిల్ ఇప్పించాలని రామకృష్ణ డిమాండ్ చేశాడు. దీంతో ఈ విషయమై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి సిటీ సివిల్ కోర్టు వద్ద కాపు కాసి నిందితుడు రామకృష్ణను రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్టు చేసిన నిందితుడిని మంగళవారం ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.-