Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు/శంషాబాద్
ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో డెంగ్యూతో సోమవారం ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్ర ఆరో వార్డు మెంబర్ ఉబ్బన వెంకటమ్మ(48) స్థానిక అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉండేది. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానికంగా ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందగా.. పరిస్థితి విషమించడంతో ఖమ్మం తరలించారు. డెంగ్యూగా వైద్యులు నిర్ధారించారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల నర్కుడ గ్రామ పాశం బల్వంత్ శివనీలల కుమార్తె శ్రీక్షేత్ర(10) గ్రామ పరిధిలోని ఓయాసిస్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పాఠశాలలో ఐదో తరగతి చదివేది. శుక్రవారం ఉదయం తన ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించడంతో తల్లిదండ్రులు వెంటనే శంషాబాద్‌లోని చిల్డ్రన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడున్నంచి రెయిన్‌బో ఆస్పత్రికి తరలించగా చిన్నారికి డెంగ్యూ సోకిందని నిర్ధారించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతిచెందింది.