Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊరిని విడిచి వెళ్లలేక తల్లడిల్లిన మల్లన్న సాగర్ భూనిర్వాసితులు
- ఒకరినొకరు ఓదార్చుకుంటూ పయనం
నవతెలంగాణ-తొగుట
తాతల నాటి ఆస్తులతో పాటు తరతరాల అను బంధాన్ని వదులుకోలేక భూనిర్వాసితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని దాచు కోలేక కన్నీటితోనే నూతన గృహాలకు పయనమ య్యారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ భూనిర్వాసితులైన వేములగట్టు గ్రామానికి చెందిన 142, పల్లెపహడ్ నుంచి 103 కుటుంబాలను గజ్వేల్ నగర పంచాయతీలోని ముట్రాజ్‌పల్లి వద్ద నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలోకి బుధవారం అధికారులు తరలించారు. సుమారు 25కి పైగా వాహనాలను సమకూర్చి వారిని నూతన గృహాలకు తరలించారు. అయితే, ఊరిపై, భూమిపై ఏండ్ల నుంచి అనుబంధాన్ని, బంధుత్వాలను వదులుకోలేక, వాటిని విడిచి వెళ్లలేక ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఎంతో భారంగా అక్కడి నుంచి నిర్వాసితులు పయనమయ్యారు.
భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం : సిద్దిపేట ఆర్డీఓ అనంతరెడ్డి
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందిస్తాం. ముంపు గ్రామాలైన వేముల గట్టు, పల్లెపహడు గ్రామాల్లోని భూనిర్వాసితులను డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు తరలిస్తున్నాం. వారికి శాశ్వత నివాసం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వపరంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకు కృషి చేస్తాం.