Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గిన దిగుబడులు..
- తగ్గుతున్న ధరలు
- ఆందోళనలో మిర్చి రైతులు
నవతెలంగాణ-వరంగల్
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మిర్చి పంట దిగు బడులు తగ్గాయి. పెట్టుబడి మాత్రం పెరిగింది. కానీ పంట ధరలు క్రమంగా తగ్గాయి. దాంతో రైతులు తీవ్రంగా నష్టపో తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ లో వరుసగా వచ్చిన నాలుగు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున మిర్చిని రైతులు తీసుకు వచ్చారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు మార్కెట్‌కు 19 వేల క్వింటాళ్ల మిర్చి మాత్రమే రాగా, రూ.13 వేల ధర వచ్చింది. అనంతరం 6,7 తేదీల్లో 21 నుంచి 22 వేల క్వింటాళ్ల మిర్చి వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీకి, 7వ తేదీకే క్వింటాల్‌కు రూ.2 వేలు ధర పడిపోయింది. పెట్టుబడి కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు దిగుబడులు తగ్గడం, మార్కెట్‌లో ధరలు తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారు. మంగళ, బుధవారాలు మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి రావడంతో 'నవతెలంగాణ' మార్కెట్‌ను సందర్శించినప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. గత ఏడాది ఏప్రిల్‌లో కోవిడ్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ఎనుమాముల మార్కెట్‌లో క్రయ, విక్రయాలు జరగలేదు. ఈ ఏడాది మార్కెట్‌కు తేజ, వండర్‌హాట్, యుఎస్ 341, దేశీ మిర్చి, సింగిల్‌పట్టి, డిడి తదితర మిర్చి దిగుబడులు అధికంగా వస్తాయి. గత ఏడాదితో పోల్చితే మిర్చి దిగుబడులు తగ్గినట్టు రైతులు స్పష్టం చేశారు. ధరలేమో పడిపోతున్నాయి.
పతనమవుతున్న ధరలు
ఏడాదికేడాది మిర్చి ధరలు తగ్గుతూ
పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉంది. ఎనుమాముల మార్కెట్‌కు 2019 డిసెంబర్‌లో 14,295 క్వింటాళ్ల మిర్చి వస్తే క్వింటాల్‌కు రూ.13,633 ధర వచ్చింది. 2020 జనవరిలో 49,906 క్వింటాళ్ల మిర్చి రాగా, రూ.16 వేల ధర పడింది. ఫిబ్రవరిలో 1,12,500 క్వింటాళ్లు రాగా రూ.13,500 ధర, మార్చిలో 2 లక్షల క్వింటాళ్ల మిర్చికి క్వింటాకు రూ.14 వేల ధర పడింది. ఏప్రిల్‌లో కోవిడ్ లాక్‌డౌన్‌తో మార్కెట్ బందయ్యింది. దాంతో మిగిలిన మిర్చి పంటను కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేశారు. అదంతా ఇప్పుడు మార్కెట్‌కి తరలుతుంది. ఈ ఏడాది మార్కెట్ సీజన్ 2020 డిసెంబర్ నుంచి ప్రారంభమవగా.. 2020 డిసెంబర్‌లో 8,604 క్వింటాళ్ల మిర్చి రాగా, క్వింటాల్‌కు రూ.13,300 ధర పలికింది. 2021 జనవరిలో 20,100 క్వింటాళ్లు రాగా.. రూ.13 వేల ధర వచ్చింది. ఫిబ్రవరిలో 1,64,831 క్వింటాళ్ల మిర్చి రాగా, క్వింటాల్‌కు రూ.12 వేల ధర పడింది. మార్చిలో 3,56,235 క్వింటాళ్ల మిర్చి రాగా క్వింటాల్ ధర రూ.12,800 వచ్చింది. ఏప్రిల్‌లో ఇప్పటి వరకు 19,471 క్వింటాళ్ల మిర్చి రాగా, రూ.12,500 ధర పడింది. దాంతో పెట్టుబడి కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బుధవారం 21,947 క్వింటాళ్ల మిర్చి మార్కెట్‌కు రాగా వండర్‌హాట్ మిర్చి క్వింటాల్‌కు ధర రూ.1000 తగ్గగా, యుఎస్-341 రకానికి రూ.500, సింగిల్‌పట్టి రకం రూ.1,000లకు ధర తగ్గింది. గతేడాదికి ఈ సంవత్సరానికి ధరల్లో తేడా భారీగా ఉండటంతో ధరల పతనం రైతులకు అంతుపట్టక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
దిగుబడులు తగ్గినరు.. : కంకట సదయ్య, వేములపల్లి, మొగుళ్లపల్లి
ఎకరంల మిర్చి పెట్టితే.. 23 బస్తాలు వచ్చినయి.. క్వింటాల్‌కు రూ.14 వేల ధర పడింది. గతేడాదే దిగుబడి తగ్గితే.. ఈ ఏడాది వర్షాలతో మరింత తగ్గింది. కూలీలతో పాటు పెట్టుబడి ఖర్చులు చానా పెరిగినయ్..
ధరలు తగ్గుతానరు : అచ్చ సతీష్, వెలిశాల, టేకుమట్ల
రెండెకరాల మిర్చి సాగు చేసిన.. ఎకరానికి లక్ష పెట్టుబడిపెడితే 18 బస్తాల దిగుబడి వచ్చింది. గత ఏడాది కూడా దిగుబడితగ్గింది. పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు. రోజురోజుకూ ధరలు తగ్గుతానరు 20వేలు ధర పడితే బాగుండేది.