Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాసర/చేగుంట/నిజాంపేట
ఒక రైతు సొంత భూమితోపాటు మరికొంత కౌలుకు తీసుకుని సాగు చేస్తే అప్పులు తప్ప ఆదాయం మిగల్లేదు.. ఆ అప్పులకు వడ్డీలు తోడయ్యాయి. మరోవైపు కుటుంబ పోషణ భారమైంది.. ఇంకో రైతు భూమి విషయంలో తగాదా ఉండటంతో తనకు వస్తుందో రాదోనన్న ఆందోళన చెందాడు.. మరో రైతు ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఇలా వీరిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా.. ఓ రైతు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలు నిర్మల్, మెదక్ జిల్లాల్లో జరిగాయి. వీటికి సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని టాక్లి గ్రామానికి
చెందిన చిల్లెవాడ్ సాయినాథ్(34)కు నాలుగెకరాల భూమి ఉంది. మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేశాడు. గతేడాది ఆశించినంతగా సోయా పంట దిగుబడి రాకపోవడంతో అప్పులు పెరిగాయి. రబీలో శనగ సాగు చేసినా.. అదీ దిగుబడి వస్తుందో లేదోనని ఆందోళనకు గురయ్యాడు. దిగుబడి రాకపోతే అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెంది చేనులో చెట్టుకు ఉరేసుకున్నాడు. బ్యాంకుతో పాటు ప్రయివేట్‌గా రూ.5లక్షలు అప్పులు ఉన్నాయి. రైతుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ప్రేమ్‌దీప్ తెలిపారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామానికి చెందిన కొమ్మాట చంద్రయ్య(55)కు ఐదెక రాల పొలం ఉంది. అతనికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. రెం డ్రోజుల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. అయితే ,బుధవారం తెల్లవారుజామున అతని కొడుకు బాబు బోరుబావి వెళ్లేసరికే చంద్రయ్య మామిడి చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. అక్కడే బిర్యానీ ప్యాకెట్, పురుగు మందుల డబ్బా ఉన్నాయి. వెంటనే కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. రైతు మృతిపై బంధువులు పలు అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు. పురుగు మందు తాగితే ఉరెందుకు వేసుకుంటాడు.. కాళ్లుభూమికి ఆనుకొని ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపారు.
మనస్తాపంతో రైతు ఆత్మహత్య : బంధువులతో భూ తగాదా ఉన్నందున తమకు భూమి వస్తుందో, రాదో అని ఆందోళనకు గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలంలోని మక్కరాజుపేట గ్రామానికి చెందిన జంగారి అంజయ్య(57) వ్యవసాయం చేసుకుంటూ జీవిం చేవాడు. అతనికి బంధువులతో ఆరు నెలలుగా భూ తగాదాలు నడుస్తున్నాయి. బుధవారం పెద్దల సమక్షంలో ఇరువురు కూర్చుని మాట్లాడుకోవాల్సి ఉండగా.. అంజయ్య తన భూమి తనకు వస్తుందో లేదో ఆందోళనకు గురై.. తెల్లవారుజామునే పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. 8:30 అవుతున్నా ఇంటికి రాకపోవడంతో అతని కుమారుడు భూపాల్ పొలం వద్దకు వెళ్లగా, తండ్రి విగతజీవిగా కనిపించాడు. ఎస్‌ఐ సుభాష్ గౌడ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కొడుకు భూపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.