Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 మంది సమాజ సేవకులకు విఐటి జ్ఞాపికలు
- రూ.25వేల చొప్పున పారితోషికం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆచార్య యన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలం వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఎ విష్ణువర్ధన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఇతర ప్రాణాలను కాపాడిన, సమాజ సేవ చేస్తున్న 11 మందికి విఐటి జ్ఞాపికలతో పాటు ఒక్కొక్కరికి రూ.25 వేల పారితోషికాన్ని విష్ణువర్ధన్‌రెడ్డి అందజేశారు. 2019-2020 విద్యా సంవత్సరానికి 46 విద్యార్థులకు అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డులను ఇచ్చారు. సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన 17 మంది అధ్యాపకులకూ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఐటీ ఏపీ యూనివర్సిటీ నాలుగేండ్లుగా సమాజానికి ఎంతో కృషి చేసి, చివరకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కాపాడిన వారిని స్మరించుకుంటూ అవార్డులు ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. వ్యవసాయానికి సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చుననీ, వ్యవసాయరంగంలో ఆర్థిక ప్రగతి సాధించవచ్చునని తెలిపారు. వీఐటీ వైస్ ఛాన్స్‌లర్ మాట్లాడుతూ ఎస్‌వీ కోటారెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యా లయంలో సామాజిక భాద్యత ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు శేఖర్ విశ్వనాథన్, ఉప కులపతి డాక్టర్ ఎస్.వి. కోట రెడ్డి , రిజిస్ట్రార్ సి.యల్.వి.శివకుమార్, స్టూడెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుపమ నంబూరు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అవార్డులు పొందినవారిలో ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది, ఆరుగురు ఫైర్‌మెన్లు, ముగ్గురు పోలీసులు ఉన్నారు. అయితే, ఇందులో కొందరు చనిపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.