Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'షీ పహి' ఫస్ట్ యాన్యువల్ మీట్ 2021 ప్రారంభం
- పాల్గొన్న సీపీ సజ్జనార్
- ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరోయిన్ అనుష్క శెట్టి
నవతెలంగాణ - మియాపూర్ (గచ్చిబౌలి)
విధుల్లో మహిళా సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో బుధవారం ఫస్ట్ యాన్యువల్ మీట్ 2021 'షీ పహి' ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దానికి హీరోయిన్ అనుష్క శెట్టి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మహిళా భద్రతా అదనపు డీజీ స్వాతిలక్రా, సైబరాబాద్ సీపీ సజ్జనార్, షీ టీమ్స్ డీసీపీ అనసూయతో కలిసి సైబరాబాద్ డయల్ 100 క్విక్ రెస్పాన్స్ వాహనాలను అనుష్క ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. సైబరాబాద్ పరిధిలో మొత్తం 750 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారనీ, సీనియర్ అధికారుల్లో కూడా 50 శాతం మహిళలున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మహిళా సిబ్బందికి కేసుల దర్యాప్తుపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామన్నారు. అలాగే, డ్రైవింగ్‌పై శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. ట్రాఫిక్‌లో సైతం మహిళా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అనంతరం అనుష్క మాట్లాడుతూ.. కరోనా సమయంలో పోలీసులు మంచిగా పనిచేశారని, ఇలాంటి కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు ప్రశంస అవార్డులతో సత్కరించారు. 2014లోనే షీ టీమ్స్‌ను మొదలు పెట్టామని అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలిపారు.