Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్‌పీఆర్‌డీ క్యాలెండర్ ఆవిష్కరణలో నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఉద్యమించాలని ఎన్‌పీఆర్‌డీ నేతలు పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న చట్టాలను నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు బుధవారం ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కార్యాలయంలో సంఘానికి సంబంధించిన క్యాలెండర్ -2021ను విద్యాసంస్థల అధినేత పటాన్ ఉమ్మార్ ఖాన్, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె వెంకట్, ఏం అడివయ్య, రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి నాగలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు బాలయ్య ,రంగారెడ్డి, షైన్ బేగం తదితరులతో కలిసి ఆవిష్కరించారు వికలాంగుల సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయనీ, వాటిని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని విమర్శించారు. చట్టాల గురించి అవగాహన కల్పించడంలో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. వికలాంగుల పట్ల సమాజంలో చిన్నచూపు, వివక్ష కొనసాగుతున్నదన్నారు. విద్యా ఉద్యోగాల్లో వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదనీ, వికలాంగుల విద్య పట్ల పాలకులకు చిత్తశుద్ధిలేదన్నారు. బ్రెయిలీ, సైన్‌లాంగ్వేజ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సరైన పాఠశాల లేకపోవడం ద్వారా వికలాంగుల అక్షరాస్యత పెరగడం లేదన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగానే నిరుద్యోగ వికలాంగులకు నిరుద్యోగ భతిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఎలాంటి షరతులు లేకుండా రూ 5లక్షల వరకు ఆర్థిక సహాయం చేయాలనీ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.