Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీఆర్సీ నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈ నివేదిక రూపొందినట్టుగా స్పష్టమవుతున్నదని విమర్శించారు. ఉద్యోగులు 63 శాతం ఫిట్‌మెంట్ ఆశిస్తే, కేవలం 7.5 శాతం సిఫారసు చేయడం దారుణమని తెలిపారు. భూముల ధరలు, అద్దెలు విపరీతంగా పెరుగుతుంటే హెచ్‌ఆర్‌ఏను తగ్గించడం విడ్డూరంగా ఉందని పేర్కొనానరు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ అని చెప్పుకునే ఈ ప్రభుత్వం ఏమాత్రం తాత్సారం చేయకుండా ఉద్యోగసంఘాలన్నింటినీ చర్చలకు పిలిచి నెలాఖరులోగా సముచితమైన నిర్ణయాన్ని తీసుకోవాలని డిమాండ్ చేశారు.