Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
గోస పట్టేనా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

గోస పట్టేనా?

- 20 ఏండ్లుగా పని చేస్తున్నా పెరగని వేతనాలు
- పీజీలు, డిప్లొమాలు, టీటీసీలు, డిగ్రీ అర్హతతో కొలువులు
- జీతం నాలుగు వేలు దాటని వైనం
- మంత్రులు, ప్రజా పతినిధులకు వినతుల మీద వినతులు
- ఆశగా బాల కేంద్రాల ఉద్యోగులు, సిబ్బంది ఎదురుచూపులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
'రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను, ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతాం. అన్ని శాఖల్లోనూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తాం. ప్రభుత్వ, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, వర్క్‌ చార్జ్‌డ్‌, డెయిలీ వేజ్‌, ఫుల్‌ టైమ్‌ కాంటింజెంట్‌, పార్ట్‌ టైమ్‌ కాంటింజెంట్‌, హోంగార్డులు, అంగన్‌వాడీలు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఆశాలు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్‌, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు... ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాలను పెంచుతాం...' సీఎం కేసీఆర్‌ నూతన సంవత్సరం సందర్భంగా చేసిన ప్రక టన ఇది. సీఎం చేసిన ఈ ప్రకటనతోనైనా తమ జీవితాలు మారతాయా..? లేదా..? అని రాష్ట్రంలోని బాల కేంద్రాల్లో పని చేస్తున్న కన్సాలిడేటెడ్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, గౌరవ వేతన ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని బాల బాలికలకు సంగీతం, నాట్యం, గానం, చిత్రలేఖనం, జానపదాలు తదితర లలిత కళలతోపాటు కుట్లు, అల్లికల్లాంటి స్వయం ఉపాధి రంగాల్లో తర్ఫీదునివ్వా లనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో బాల కేంద్రా లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లోగల జవహర్‌ బాలభవన్‌కు ఇవి అనుసంధానంగా పని చేస్తు న్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 బాల కేంద్రాలు, మరో 7 మినీ బాల భవన్లు ఉన్నాయి. అయితే వాటిలో పనిచేసే అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు పెంచకపోవటంతో వారి జీవితాలు అధ్వాన్నంగా తయారయ్యాయి. పిల్లల మానసిక వికాసానికి, విజ్ఞానానికి ఎంతగానో ఉపయోగపడుతున్న బాల కేంద్రాలపట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది. ఉన్నత విద్యనభ్యసించిన వారితోపాటు లలిత కళల్లో డిప్లొమా, పీజీ డిప్లొమాలు, డిగ్రీ, టీటీసీ పూర్తి చేసి ఆయా కేంద్రాల్లో పని చేస్తున్న శిక్షకులు, సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దాదాపు 20 ఏండ్ల నుంచి పని చేస్తున్నప్పటికీ వారికి వేతనాలు ఎంతమాత్రమూ పెరగటం లేదు. ఇప్పటికీ సూపరింటెండెండ్లకు నెలకు రూ.4 వేలు, టీచర్లకు రూ.3 వేలు, ఆయాలు, అటెండర్లకు రూ.వెయ్యి మాత్రమే జీతంగా చెల్లిస్తున్నారు. అది కూడా మూణ్నెల్లకు ఒకసారి ఇవ్వటంతో పలువురు సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేమంటే మీరు చేసేది పార్ట్‌టైం జాబేగా అంటూ ఉన్నతాధికారులు ఎగతాళి చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో తమ వేతనాలను పెంచాలనీ, ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ 2014 నుంచి ఇప్పటిదాకా తాము ఎక్కని మెట్టూ, దిగని మెట్టూ లేదని బాల కేంద్రాల్లోని ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్‌రెడ్డికి, ఆ తర్వాత అదే శాఖకు మంత్రి అయిన కడియం శ్రీహరికి, ఇప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించామని వారు చెబుతున్నారు. దాంతో పాటు ఇటీవల ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డిని, కాటేపల్లి జనార్థన్‌రెడ్డిని కూడా కలిసి తమ సమస్యలను విన్నవిం చుకున్నామని వివరించారు. వారి ద్వారానైనా తమ సమస్య లు ప్రభుత్వం దృష్టికి వెళతాయనే ఆశతో ఉన్నామని తెలిపారు.
మూసివేత దిశగా...
ఏండ్ల నుంచి పని చేస్తున్నా... సర్కారు తమ వేతనాలను పెంచకపోవటంతో ఉద్యోగులు, సిబ్బందిలో అనేక మంది మూడు, నాలుగు వేల వేతనంతోనే ఉద్యోగ విమరణ పొందుతున్నారు. ఇక మిగిలున్న కొద్ది మంది సిబ్బంది ఆ జీతాలతో కుటుంబాలను పోషించలేక బాల కేంద్రాల్లోని ఉద్యోగాలను వదిలి.. వేరే వృత్తులు, పనుల్లోకి వెళ్లిపోతున్నారు. దీంతో 14 బాల కేంద్రాల్లో రెండు ఇప్పటికే మూతబడ్డాయి.
ఇక హైదరాబాద్‌లోని వనస్థలిపురం బాల కేంద్రం మొత్తం మీద ఒక్కరే పని చేస్తున్నారు. ఇక సిద్ధిపేట బాల కేంద్రాన్ని అసలు తెరిచిన దాఖలాలే కనబడటం లేదని తెలిసింది. అంటే ఇవి రెండు కూడా త్వరతోనే మూతబడే అవకాశం ఉందన్నమాట. వేతనాలు పెంచకపోవటం, సిబ్బందిని కొత్తగా నియమించకపోవటం తదితర కారణాల రీత్యా మున్ముందు ఇతర బాల కేంద్రాలకు కూడా ఇదే గతి పట్టే అవకాశం లేకపోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఇప్పటికైనా వాటిని పటిష్టం చేయాలని కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆహార భద్రతకు ముప్పు
సాగునీటి గోస లేకుండా చేయడమే లక్ష్యం
పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపునకు బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
రాజ్‌ భవన్‌ ముట్టడి ఉద్రిక్తం
మహిళా సంఘాలకు మిత్తి రాలే!
కార్పొరేట్ల ఊడిగం కోసమే...
ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే ఆక్రమిస్తాం
రైతాంగ పోరాట స్ఫూర్తితో జీపీ, మున్సిపల్‌ కార్మికులు ఉద్యమించాలి
ఉదయ్, ఆదిత్యతో ఒరిగిందేమీ లేదు
జీవో 215 కేసులో కౌంటర్‌ ఎందుకు వేయలేదు ?
నేటి నుంచి కార్మిక-కర్షక పోరుయాత్ర
వినియోగదారుల సేవల్లో అలసత్వం వద్దు
తుది దశకు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
ట్రంప్‌ పాలసీలనే బైడెన్‌ అనుసరిస్తారు
వారంలో ఇంటర్‌ పరీక్షల తేదీలు
3.48 లక్షల వ్యాక్సిన్‌ డోసుల రాక
కరోనా చికిత్సకు మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌
రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు
కృష్ణా బోర్డు విశాఖలో వద్దు
కాళేశ్వరంపై హైకోర్టులో రిట్‌
బడికో స్వచ్ఛ కార్మికున్ని నియమించాలి
ఐఈఆర్పీల సమస్యల పరిష్కారానికి కృషి : మంత్రి సబిత
ప్రయివేటు అధ్యాపకుల సమస్యలపై స్పందించండి
పట్టణాభివృద్ధిపై పార్లమెంటరీ స్థాయి సంఘం సమీక్ష
హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు అవసరం
కోవిడ్‌ మార్గదర్శకాలతో 1 నుంచి విద్యాసంస్థలు షురూ..
నేడు కాళేశ్వరానికి సీఎం
ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయండి
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఐక్య పోరాటాలు
భూబకాసురుల నుంచి భూములను కాపాడాలి

తాజా వార్తలు

09:54 PM

రోజు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేస్తాం: ఈటల

09:36 PM

కేసీఆర్ పూజలపై అనుమానాలు.. : విజయశాంతి

09:15 PM

బైక్‌ను ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి

09:00 PM

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్

08:51 PM

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ

08:28 PM

ఎస్‌ఐ ఆత్మహత్య.. ప్రియురాలు జైలుకు

08:01 PM

మళ్లీ పెరిగిన బంగారం ధర

07:42 PM

కేక్ కట్ చేసినందుకు మహిళ అరెస్ట్..

07:16 PM

బంజారాహిల్స్‌ కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు

07:02 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

06:44 PM

హైదరాబాద్‌లో మరోసారి నిలిచిపోయిన మెట్రో ట్రైన్‌

06:44 PM

ధరణిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష‌..

06:39 PM

ఏపీలో కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు

06:35 PM

మద్యం మత్తులో బైకుకు నిప్పు పెట్టిన మందుబాబు..

06:33 PM

ఐపీఎల్ 2021.. ఆర్సీబీ రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల

06:26 PM

రెడ్‌ అంబులెన్స్ సంస్థకు వ్యతిరేకంగా నిరసన

06:26 PM

జయలలిత సన్నిహితురాలు శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

05:54 PM

త్రిపురలో బీజేపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ సీపీఐ(ఎం) ర్యాలీ

05:52 PM

టీడీపీ నేత హత్య.. నిందితులు అరెస్ట్

05:43 PM

రాష్ట్రంలో కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు 3కోట్ల ఆర్థిక సాయం..

05:36 PM

మరో 15 మెగావాట్ల సింగరేణి సోలార్‌ విద్యుత్తు ప్లాంట్ ప్రారంభం..

05:27 PM

కార్మిక కర్షక పోరు యాత్రను జయప్రదం చేయండి:- సీఐటీయ

05:21 PM

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

05:03 PM

నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి..

04:55 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:40 PM

తగిన సమయంలో కేటీఆర్ సీఎం అవుతారు..

04:25 PM

సైనిక బలగాల రహస్యాలు బహిర్గతం చేయడం దేశద్రోహమే..

04:21 PM

వేడుకలు చేసుకోవడం కాస్త ఆపేయండి..

04:01 PM

ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ.. 50 గొర్రెలు మృతి

03:55 PM

ప్రభాస్ పెళ్లి.. యాంకర్ పై కృష్ణం రాజు సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.