Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీజేపీతో దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రమాదం ఏర్పడిందని, మతోన్మాద రాజకీయాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) విద్యా విభాగం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అధ్యక్షత వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు, విద్యా విభాగం ఇన్‌చార్జి బండారు రవికుమార్ నివేదిక ప్రవేశపెట్టారు. సమావేశం ముగింపులో సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలపై ఢిలీలో రైతులు పెద్దఎత్తున పోరాడుతున్నారని, వారి ఐక్యతను విచ్ఛినం చేయడానికి బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి, ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.