Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి ఫుట్‌బాలేతర బ్రాండ్ అంబాసిడర్
ముంబయి : టీమ్ ఇండియా హిట్‌మ్యాన్, ఐపీఎల్ విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ప్రముఖ స్పెయిన్ సాకర్ లీగ్ లా లిగా భారత బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు గురువారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో రోహిత్ శర్మను ప్రచారకర్తగా లా లిగా ప్రకటించింది. లా లిగాకు ఓ ఫుట్‌బాలేతర అథ్లెట్ ప్రచారకర్తగా వ్యవహరించటం ఇదే తొలిసారి. ' భారత్‌లో ఫుట్‌బాల్ పురోగతి ప్రపంచవ్యాప్త పురోగతితో పోటీపడుంది. ఫుట్‌బాల్‌లో భారత్ ఇక నిద్రపోతున్న దిగ్గజం కాదని గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉంది. గత ఐదేండ్లలో భారత్‌లో ఫుట్‌బాల్ ఎంతో ముందడుగు వేసింది. అందుకు కారణమైన అందరికీ, ప్రత్యేకించి అభిమానులకు ఈ ఘనత దక్కుతుంది. లా లిగాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాను. భారత్‌లో క్షేత్ర స్థాయి ప్రణాళికతో ఫుట్‌బాల్ వ్యవస్థలో మమేకం అయ్యేందుకు లా లిగా అడుగులు వేస్తోంది. వ్యక్తిగతంగా లాలిగాతో నా ప్రయాణంపై ఎంతో ఉత్సుకతతో ఉన్నాను. భారత సాకర్ అభిమానులను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.