Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధావన్ స్థానంలో వన్డేలకు ఎంపిక
ముంబయి : కర్ణాటక స్టార్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌కు మరోసారి టీమ్ ఇండియా వన్డే జట్టులోకి పిలుపు వచ్చింది. 2019 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్ విజరుశంకర్‌కు గాయంతో వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికైన మయాంక్.. తాజాగా ఓపెనర్ శిఖర్ ధావన్‌కు గాయంతో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మహరాష్ట్రతో మ్యాచ్‌లో శిఖర్ ధావన్ గాయపడ్డాడు. ధావన్ మోకాలి గాయానికి గురయ్యాడు. ధావన్ మోకాలి కుట్లు వేశారు. ధావన్ గాయంతో టీ20 జట్టులోకి సంజూ శాంసన్ రాగా.. ఇప్పుడు వన్డే జట్టులోకి మయాంక్ అగర్వాల్ చేరాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సమయానికి శిఖర్ ధావన్ పూర్తిగా కోలుకునే అవకాశం కనిపిస్తోంది. మయాంక్ ప్రస్తుతం కర్ణాటక తరఫున రంజీ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌తో రెండో రౌండ్ రంజీ మ్యాచులకు అగర్వాల్ దూరం కానున్నాడు.
వెస్టిండీస్‌తో 3 వన్డేలకు భారత జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, శ్రేయాష్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్, శివం దూబె, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, యుజ్వెంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్.