Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాకినాడ: అర్జున్ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిప్రణీత్ వివాహం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన సాయి ప్రణీత్‌కూ, కాకినాడకు చెందిన జయంతి శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీశ్వేతతో కాకినాడలోని విద్యుత్ నగర్‌లోని వెంకన్నబాబు కల్యాణ మండపంలో జరిగింది. ఈ వేడుకకు నగర ప్రముఖులు, జాతీయ క్రీడాకారులు పాల్గొన్నారు. చైతన్య విద్యాసంస్థల అధినేత మాజీ ఎంఎల్‌సి చైతన్యరాజు, ముమ్మిడివరం మాజీ ఎంఎల్‌ఎ దాట్ల బుచ్చిబాబు, పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశ్వీర్వదించారు.