Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీసీసీఐ
న్యూఢిల్లీ : జస్టిస్ ఆర్‌ఎం. లోధా కమిటీ సిఫారుసుల్లో కీలక సంస్కరణలకు తిలోదకాలు ఇచ్చేందుకు సౌరభ్ గంగూలీ సారథ్యంలోని బీసీసీఐ ఏజీఎం ఏకాభిప్రాయంతో పలు తీర్మానాలు ఆమోదించింది. బీసీసీఐ రాజ్యాంగ సవరణకు సుప్రీంకోర్టు అనుమతి అవసరం లేదు. రెండు పదవీ కాలాల మధ్య విరామం సమయం ఎత్తివేయాలి. సభ్యుల అనర్హత నిబంధనలను సడలించాలి. బోర్డు కార్యదర్శికి పూర్వ అధికారాలు కట్టబెట్టాలి వంటి ప్రతిపాదనలు ఇటీవల ఏజీఎంలో ప్రతిపాదించింది. కానీ ఇవేవీ ఏజీఎం ఆమోదం తెలపలేదు. కోర్టు అనుమతి లేకుండా ఆమోదం తెలిపితే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ఏజీఎం ప్రతిపాదనలతో బీసీసీఐ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. దీనిపై విచారణ జనవరి 14న జరుగనుంది. జనవరి 14 విచారణ తర్వాత ఏజీఎం ప్రతిపాదనలపై న్యాయస్థానం వైఖరి తేలిపోనుంది. గంగూలీ పదవీకాలంపైనా అప్పుడే ఓ స్పష్టత రానుంది. ఇదిలా ఉండగా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తమ ప్రతినిధిని నియమించింది. ఆల్కా రెహాని కాగ్ ప్రతినిధిగా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో ఉంటారని బోర్డుకు తెలిపింది. జస్టిస్ లోధా సిఫారసుల్లో భాగంగా ఈ నియామకం చోటుచేసుకుంది.