Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పరుగుల జోరు | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Dec 07,2019

పరుగుల జోరు

- రెచ్చిపోయిన హెట్మయర్‌, లెవిస్‌
- వెస్టిండీస్‌ భారీ స్కోరు 207/5
నవ తెలంగాణ-హైదరాబాద్‌
ఉప్పల్‌ స్టేడియంలో పరుగుల ప్రవాహం. పరుగుల వరద ఖాయమనే అంచనాలతో ఆరంభమైన భారత్‌, వెస్టిండీస్‌ తొలి టీ20 ఊహించిన విధంగానే జోరు చూపించింది. విధ్వంసక వెస్టిండీస్‌ తొలుత ఇక్కడ 207/5 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. యువ ఆటగాడు షిమ్రోన్‌ హెట్మయర్‌ (56, 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌ ఎవిన్‌ లెవిస్‌ (40, 17 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ (37, 19 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో కదం తొక్కారు. భారీ ఛేదనలో భారత్‌ 15 ఓవర్లలో 155 పరుగులు చేసింది. ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ (62), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అర్ధ సెంచరీలు నమోదు చేశారు.
సిక్సర్ల మోత మోగించారు : టాస్‌ నెగ్గిన టీమ్‌ ఇండియా ఛేదనకు మొగ్గు చూపింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్‌కు ఫామ్‌లో ఉన్న సీమర్‌ దీపక్‌ చాహర్‌ తొలి షాక్‌ ఇచ్చాడు. సీనియర్‌ ఓపెనర్‌ లెండ్లి సిమోన్స్‌ (2)ను ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే సాగనంపాడు. సిమోన్స్‌ నిష్క్రమణతో కరీబియన్లు ఒత్తిడిలో పడతారనే భావన నెలకొంది. మరో ఓపెనర్‌ ఎవిన్‌ లెవిస్‌ (40, 17 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), బ్రాండన్‌ కింగ్‌ (31, 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడిన ఈ జోడీ బౌండరీలపైనే కన్నేసింది. లెవిస్‌ మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. సీపీఎల్‌ ఫామ్‌లో ఉన్న బ్రాండన్‌ కింగ్‌ సైతం మూడు ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌ కొట్టాడు. దీంతో విండీస్‌ రన్‌రేట్‌ పదికి పైగా నమోదైంది. అర్థ సెంచరీ ముందు లెవిస్‌ అవుటైనా.. కరీబీయన్ల జోరు తగ్గలేదు. షిమ్రోన్‌ హెట్మయర్‌ (56, 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీర విహారం చేశాడు. కింగ్‌తో కలిసి కదం తొక్కిన హెట్మయర్‌ వెస్టిండీస్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన హెట్మయర్‌ అర్థ సెంచరీతో మెరిశాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బ్రాండన్‌ కింగ్‌ను పంత్‌ స్టంపౌట్‌ చేశాడు. హెట్మయర్‌తో జతకలిసిన విధ్వంసకారుడు కీరన్‌ పొలార్డ్‌ (37, 19 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పొలార్డ్‌ నాలుగు సిక్సర్లతో వెస్టిండీస్‌ స్కోరు 200 దాటేలా చేశాడు. హెట్మయర్‌, పొలార్డ్‌ డగౌట్‌కు చేరుకోగా.. ఆఖర్లో జేసన్‌ హౌల్డర్‌ (24 నాటౌట్‌, 9 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), దినేశ్‌ రామ్‌దిన్‌ (11 నాటౌట్‌, 7 బంతుల్లో 1 ఫోర్‌) మెరుగైన ముగింపునిచ్చారు. మణికట్టు స్పిన్నర్‌ యుజ్వెంద్ర చాహల్‌ రెండు వికెట్లు తీసుకున్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, రవీంద్ర జడేజాలు తలా ఓ వికెట్‌ పడగొట్టారు.
స్కోరు వివరాలు :
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ : లెండ్లి సిమోన్స్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) దీపక్‌ చాహర్‌ 2, ఎవిన్‌ లెవిస్‌ (ఎల్బీ) వాషింగ్టన్‌ సుందర్‌ 40, బ్రాండన్‌ కింగ్‌ (స్టంప్డ్‌) రిషబ్‌ పంత్‌ (బి) రవీంద్ర జడేజా 31, షిమ్రోన్‌ హెట్మయర్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) చాహల్‌ 56, కీరన్‌ పొలార్డ్‌ (బి) చాహల్‌ 37, జేసన్‌ హౌల్డర్‌ నాటౌట్‌ 24, దినేశ్‌ రామ్‌దిన్‌ నాటౌట్‌ 11, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 207.
వికెట్ల పతనం : 1-13, 2-64, 3-101, 4-172, 5-173.
బౌలింగ్‌ : వాషింగ్టన్‌ సుందర్‌ 3-0-34-1, దీపక్‌ చాహర్‌ 4-0-56-1, భువనేశ్వర్‌ కుమార్‌ 4-0-36-0, రవీంద్ర జడేజా 4-0-30-1, యుజ్వెంద్ర చాహల్‌ 4-0-36-2, శివం దూబె 1-0-13-0.
అజహర్‌ స్టాండ్‌ ఆవిష్కరణ
భారత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు, సూపర్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ను హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) సముచితంగా గౌరవించుకుంది. కళంకిత క్రికెటర్‌గా అజహరుద్దీన్‌కు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఎటువంటి గుర్తింపు దక్కలేదు. రెండో ఇన్నింగ్స్‌లో క్రికెట్‌ పరిపాలకుడిగా మారిన అజహరుద్దీన్‌ ఇటీవల హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉప్పల్‌ స్టేడియంలోని నార్త్‌ స్టాండ్‌కు మహ్మద్‌ అజహరుద్దీన్‌ పేరు పెట్టారు. భారత్‌, వెస్టిండీస్‌ మ్యాచ్‌ ఆరంభానికి ముందు దిగ్గజ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ స్టాండ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెచ్‌సీఏ బాస్‌ అజహర్‌ , మాజీ క్రికెటర్లు వెంకటపతి రాజు, నోయిల్‌ డెవిడ్‌ సహా యువ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ హాజరయ్యారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు
రంజీ జరిగేనా?!
సేవలు పున ప్రారంభం?
సిరాజ్‌ ఆ పని చేశాడు
బుమ్రాకు గాయం?
స్టీవ్‌ స్మిత్‌ పై రాయల్స్‌ వేటు
క్రికెటర్ల స్వీయ సర్వీస్‌!
ఆ నలుగురు అద్వితీయం
309 కొట్టగలరా?!
హద్దుమీరిన జాత్యహంకారం
కంగారూ గుప్పిట్లో సిడ్నీ
గబ్బాపై నీలినీడలు
ఐఎంజితో బీసీసీఐ కటీఫ్‌
రెండోరోజు మనదే
ఒలింపిక్స్‌కు టీ10 ఫార్మాట్‌ బెటర్‌: గేల్‌
3న బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నికలు
ఆసీస్‌ దే తొలి రోజు
ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం
పాక్‌ కు ఇంగ్లాండ్‌ అమ్మాయిలు
నట్టూను తీసుకోలేదేం!?
ఆధిపత్య సవాల్‌!
ఒలింపిక్స్‌ లో స్వర్ణం సాధించాలి
సన్నీ ముంబయి బ్రాడ్‌ మన్‌
కనీస ధర రూ.1500 కోట్లు?
హిట్‌మ్యాన్‌ సరిపోతాడు!
ఎందుకీ అంపైర్‌ కాల్‌?
అందరికీ నెగెటివ్‌

తాజా వార్తలు

11:45 AM

నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం : సోనూ సూద్

11:33 AM

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

11:24 AM

తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు

11:16 AM

ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:22 AM

భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

10:16 AM

అలర్ట్.. 983 పక్షులు మృతి..

10:03 AM

ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్

09:53 AM

నిర్మల్ జిల్లాలో దారుణం..

09:42 AM

వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం

09:33 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం

09:23 AM

ఫిబ్రవరి 15నుంచి ప్రత్యక్ష తరగతులు..?

09:09 AM

అతివేగంగా వచ్చి ఏనుగును ఢీకొట్టిన ట్రక్​

08:57 AM

మహారాష్ట్ర, ఒడిశాల్లో నిలిచిపోయిన వ్యాక్సినేషన్!

08:43 AM

చికెన్, గుడ్లు తినడంపై కేంద్రం కీలక ప్రకటన..

08:28 AM

తమకు కొవాగ్జిన్ టీకా వేయెద్దంటున్న ఎయిమ్స్ డాక్టర్స్..

08:12 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

08:01 AM

పీఆర్సీపై త్వరలో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ

07:53 AM

బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్ పై నెటిజన్లు ఫైర్..

07:41 AM

ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రివేళలో పెద్దపులి సంచారం..

07:31 AM

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సైకత శిల్పం

07:21 AM

మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు బాఖర్ అలీ అరెస్ట్

07:12 AM

కూలిన వాయుసేన విమానం.. 7గురు మృతి

07:03 AM

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు..

06:57 AM

కరెంటు వైర్లు బస్సుకు తగిలి మంటలు..6గురు మృతి

06:50 AM

హెచ్1బీ వీసాదారులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్..

06:43 AM

సొంతూళ్ల నుంచి నగరాలకు వెళ్లేందుకు.. ప్రత్యేక రైళ్ల ఏర్పాటు!

09:00 PM

వికారాబాద్‌ జిల్లాలో బుల్లెట్‌ కలకలం

08:51 PM

మోడీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.