Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుమ్రాపై రజాక్ వ్యాఖ్యలపై పఠాన్
న్యూఢిల్లీ : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ అనుచిత వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా రజాక్‌కు హుందానే చురకలు అంటించారు. కెరీర్‌లో ప్రపంచ శ్రేణి పేసర్లను ఎదుర్కొన్నాను. గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. జశ్‌ప్రీత్ బుమ్రా నా ముందు ఓ బచ్చా బౌలర్. ఇప్పుడు బుమ్రా నాకు బౌలింగ్ చేస్తే అలవోకగా పరుగులు చేసేవాడిని, ఎదురుదాడి చేసేవాడిని అంటూ రజాక్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. జశ్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ వన్డే వరల్డ్ నం.1 బౌలర్ అనే విషయం తెలిసిందే. రజాక్ వ్యాఖ్యలపై ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చొప్రా స్పందించారు. ' వయసు పెరగటం ప్రధానం కాదు. పరిణితి సాధించటం ముఖ్యం. వెల్ ప్లే' అంటూ ఆకాశ్ చొప్రా రజాక్‌ను ఉద్దేశించి అన్నాడు. ' ఇటువంటి మాటలు విని..అభిమానులు నవ్వి ఊరుకోవాలి. పెద్దగా పట్టించుకోవద్దు' అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. గతంలో ఇర్పాన్ పఠాన్‌ను ఉద్దేశించి జావెద్ మియాందాద్ సైతం ఇలాగే మాట్లాడాడు. పఠాన్ వంటి బౌలర్లు పాకిస్థాన్‌లో గల్లీకి ఒకరు ఉన్నారు, పఠాన్ చూసి భయపడాల్సింది ఏముంది? అని అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.