Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంతితో (1/196) ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న కేశవ్ మహరాజ్.. బ్యాట్‌తోనూ అత్యధిక పరుగులు చేశాడు. టెయిలెం డర్లు మెరవటం, భారీ స్కోర్లు సాధించటం టెస్టు క్రికెట్‌కు కొత్త కాదు. కానీ కేశవ్ మహరాజ్ ఇన్నింగ్స్ ప్రత్యేకం. రెండో రోజు ఫీల్డింగ్‌లో గాయపడిన కేశవ్ మహరాజ్ రెండు సార్లు వైద్య పరీక్షలకు (స్కానింగ్)కు వెళ్లాడు. భుజం గాయంతో బాధపడుతున్న మహరాజ్‌కు బ్యాటింగ్ గ్రీన్ సిగల్ ఇవ్వటంతో క్రీజులోకి వచ్చాడు. నొప్పి వేధిస్తున్నా సహనంతో భారత బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఓపిగ్గా అసమాన ఇన్నింగ్స్ ఆడేశాడు. భుజం గాయంతో పుణె టెస్టులో నేడు మహరాజ్ బౌలింగ్ చేసే పరిస్థితి కనిపించటం లేదు. అయినా, బ్యాట్‌తో మహరాజ్ వరల్డ్ క్లాస్ ఇన్నింగ్స్‌తో విమర్శకుల హృదయాలను గెల్చుకు న్నాడు.