Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2028 ఒలింపిక్స్‌పై మంత్రి రిజిజు
న్యూఢిల్లీ : 2028 ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ టాప్-10లో నిలవకుంటే క్రీడా మంత్రిగా విఫలమైనట్టే భావిస్తానని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. త్వరలోనే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలువబోతుంది. ఈ సమయంలో క్రీడా రంగంలో భారత్ వెనుకంజలో నిలువడానికి వీల్లేదని మంత్రి అన్నారు. క్రీడా సమాఖ్యల సాదాసీదా నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు. '2022, 2024 సమయానికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలువనుంది. వచ్చే 4-5 ఏండ్లలో ఎన్నో రంగాల్లో టాప్-3లో ఉండనున్నాం. ఒలింపిక్స్‌లోనూ మనం మెరుగైన ప్రదర్శన చేయకపోవడానికి ఎటువంటి కారణాలు కనిపించటం లేదు. 2020 ఒలింపిక్స్ సమీపిస్తున్నాం. కానీ 2024, 2028 సమయానికి భారత్ టాప్-10 నిలిచేందుకు ప్రయత్నించాలి. ఆ లక్ష్యం చేరకుంటే, క్రీడా మంత్రిగా నేను ఫెయిల్ అయినట్టు భావిస్తాను' అని రిజిజు అన్నారు. టోక్యో ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసే ఇండియా హౌస్ లోగోను మంత్రి గురువారం ఆవిష్కరించారు.