Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ మాజీ బాస్ అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నుంచి కోర్టు ధిక్కరణ కేసులో ఉపశమనం లభించిందో లేదో అప్పుడే మళ్లీ క్రికెట్ రాజకీయాలపై దృష్టి సారించాడు బీజేపీ ఎంపీ, మాజీ భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్. భారత క్రికెట్‌ను తన అవసరం ఉంటే కచ్చితంగా అందుబాటులో ఉంటానని ఠాకూర్ పేర్కొన్నాడు. ఇటీవల సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా దాదాకు ఠాకూర్ శుభాకాంక్షలు తెలిపాడు. ఠాకూర్ శుభాకాంక్షలకు బదులుగా స్పందించిన గంగూలీ ' మరోసారి క్రికెట్ పరిపాలనలోకి రావాలని' ఆకాంక్షించాడు. గంగూలీ వ్యాఖ్యలతో ఆనందభరితుడైన ఠాకూర్ నేను రెఢ అంటూ బదులిచ్చాడు. ' భారత క్రికెట్ మాజీ కెప్టెన్ గంగూలీ వంటి వ్యక్తుల నుంచి ఇలాంటి మాటలు వింటుండటం సంతోషంగా ఉంది. నేను ఏమీ నిర్ణయించుకోలేదు, కానీ భారత క్రికెట్‌కు నేను అవసరమైతే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. బాధ్యతల నుంచి ఎప్పటికీ తప్పించుకోను' అని ఠాకూర్ పేర్కొన్నాడు. జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల అమలు అంశంలో రాష్ట్ర సంఘాలను ఒప్పించటంలో విఫలం కావటం సహా స్వయంగా అడ్డుతగిలే ప్రయత్నాలు చేయటంతో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ ఠాకూర్‌ను సుప్రీంకోర్టు తప్పించింది. బీసీసీఐ అధ్యక్ష కుర్చీ ఊడి ఆరు నెలలు కావస్తున్న సందర్భంగా ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.