Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహీ ముగింపు అదిరేనా? | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Apr 08,2021

మహీ ముగింపు అదిరేనా?

- దిగ్గజానికి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌!
- పూర్వ వైభవం దిశగా సూపర్‌ అడుగులు
- అత్యుత్తమ ప్రదర్శన 2010, 2011, 2018 చాంపియన్‌
          యుఏఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ లెక్కలేనన్ని సమస్యలు చవిచూసింది. పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానానికి పరిమితమైంది. 11 సీజన్ల ఐపీఎల్‌లో సూపర్‌కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌కు దూరం కావటం అదే ప్రథమం. సుమారు ఐదు నెలల అనంతరం ఐపీఎల్‌ మళ్లీ వచ్చేసింది. సూపర్‌కింగ్స్‌ కష్టాలు మాత్రం అలాగే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. దిగ్గజం ఎం.ఎస్‌ ధోని చివరి ఐపీఎల్‌ సీజన్‌గా ఊహాగానాలు వినిపిస్తుండగా.. చాంపియన్‌ వీడ్కోలుకు చెన్నై సిద్ధమవుతోంది. సూపర్‌కింగ్స్‌తో భావోద్వేగ అనుబంధం కలిగిన మహీ.. మరి ఐపీఎల్‌ 14ను ఎలా ముగిస్తాడో!!?
నవతెలంగాణ క్రీడావిభాగం
జట్టు ఎలా ఉంది?
గత సీజన్‌లో చాలా అంశాలు సూపర్‌కింగ్స్‌కు ప్రతికూలంగా సాగాయి. ప్రధాన బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా సీజన్‌కు దూరం కాగా.. అంబటి రాయుడు వంటి కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. షేన్‌ వాట్సన్‌, కేదార్‌ జాదవ్‌లు దారుణంగా విఫలమయ్యారు. సీజన్‌ ముగింపు దశలో సూపర్‌కింగ్స్‌ తుది జట్టులో సమతూకం సాధించింది. రాబిన్‌ ఉతప్ప, మోయిన్‌ అలీ రాకతో బ్యాటింగ్‌ బలోపేతం కాగా.. నెమ్మదైన పిచ్‌లపై చతేశ్వర్‌ పుజారా గొప్ప వ్యత్యాసం చూపించగలడు. మోయిన్‌ అలీ, కృష్ణప్ప గౌతమ్‌లు ఆఫ్‌ స్పిన్‌ సమస్యలకు సైతం చెక్‌ పెట్టనున్నారు. యువ ఆటగాళ్లు ఎన్‌.జగదీశన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లు సీజన్‌ ఆరంభం నుంచీ సూపర్‌కింగ్స్‌కు కీలకం కానున్నారు. శార్దుల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌లకు తోడు లుంగి ఎంగిడి పేస్‌ విభాగం బాధ్యతలు చూసుకోనున్నారు. నూతన ఆటగాళ్ల చేరిక, కోర్‌ జట్టు అందరూ బరిలో నిలువటం సూపర్‌కింగ్స్‌ను ఉత్సాహపరుస్తోంది. ఆస్ట్రేలియా పేసర్‌ జోశ్‌ హజిల్‌వుడ్‌ సీజన్‌కు దూరం కావటం ప్రతికూలతే అయినా.. గత సీజన్‌లో ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ పెద్దగా తుది జట్టులో నిలువలేదు. సురేశ్‌ రైనా రీ ఎంట్రీ.. మోయిన్‌ అలీ, రాబిన్‌ ఉతప్పల రాకతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ను తేల్చటం ధోనికి తలనొప్పి కానుంది!.
బలం, బలహీనతలు
ఎం.ఎస్‌ ధోని రూపంలో అనుభవజ్ఞుడైన నాయకుడు చెన్నై సూపర్‌కింగ్స్‌కు అతి పెద్ద బలం. ఐపీఎల్‌లో అత్యధిక ఫైనల్స్‌ ఆడిన మహీ.. గత సీజన్‌ జ్ఞాపకాలను తుడిచేయాలని కోరుకుంటు న్నాడు. కోర్‌ గ్రూప్‌ ఆటగాళ్లపై నమ్మకముంచే ధోని.. ఈ సీజన్‌ ఆరంం నుంచే తనదైన టీమ్‌ అందుబాటులో ఉండటంతో మ్యాజిక్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ సారి బ్యాటింగ్‌ విభాగం, బౌలింగ్‌ విభాగంలో మెరుగైన వనరులు చెన్నై సొంతం. గత సీజన్‌లో బ్యాట్‌తో, బంతితో సరైన ప్రత్యామ్నాయం లేకపోవటం చెన్నైకి దెబ్బతీసింది. ఆ లోపాలను సూపర్‌కింగ్స్‌ సరిచేసుకుంది. కాగితంపై సాధారణంగా కనిపించే సూపర్‌కింగ్స్‌.. మైదానంలో ఎప్పుడూ భిన్నమైన జట్టే.
వెటరన్‌ క్రికెటర్లను నమ్ముకుని టైటిల్‌ సాధించినా.. అదే ఫార్ములా ప్రతిసారీ పనిచేయదు. సురేశ్‌ రైనా 2019 నుంచి కేవలం ఐదు మ్యాచులే ఆడాడు. ఎం.ఎస్‌ ధోనికి సైతం గత సీజన్‌ తర్వాత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించలేదు. మిగతా జట్ల తరహాలో మిడిల్‌ ఆర్డర్‌లో విధ్వంసక హిట్టర్లు సూపర్‌కింగ్స్‌ శిబిరంలో కరువయ్యారు. ఇది ఈ సీజన్‌లో సూపర్‌కింగ్స్‌కు ప్రతికూలంగా మారనుంది.
ఎక్స్‌ ఫ్యాక్టర్‌
ఇద్దరు అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్‌ కరణ్‌లు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఎక్స్‌ ఫ్యాక్టర్‌. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ జడేజా, పేస్‌ ఆల్‌రౌండర్‌ కరణ్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. బంతితో ఎంత ప్రభావం చూపించగలరో.. ఇటీవల బ్యాట్‌తో అంతకుమించిన ప్రదర్శన చేస్తున్నారు. ఈ సీజన్‌లో జడేజా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకొచ్చి.. ఫినీషర్‌గా కరణ్‌ను పంపించే అవకాశం ఉంది. బ్యాట్‌తో, బంతితో ఈ ఇద్దరి ప్రదర్శన సూపర్‌కింగ్స్‌ ఫలితాలను నిర్దేశించనుంది.
చెన్నై జట్టు (స్వదేశీయులు)
ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌), సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, రుతురాజ్‌ గైక్వాడ్‌, రాబిన్‌ ఉతప్ప, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, శార్దుల్‌ ఠాకూర్‌, కర్ణ్‌ శర్మ, ఎన్‌. జగదీశన్‌, కెఎం ఆసిఫ్‌, సాయి కిశోర్‌, కృష్ణప్ప గౌతమ్‌, చతేశ్వర్‌ పుజారా, హరిశంకర్‌ రెడ్డి, భగత్‌ వర్మ, హరి నిశాంత్‌.
విదేశీయులు
డుప్లెసిస్‌, డ్వేన్‌ బ్రావో, ఇమ్రాన్‌ తాహీర్‌, శామ్‌ కరన్‌, లుంగి ఎంగిడి, మిచెల్‌ శాంట్నర్‌, మోయిన్‌ అలీ.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఢిల్లీ ఛేదించింది
బెంగళూరు హ్యాట్రిక్‌
దీపక్‌కు రజితం, సంజీత్‌కు కాంస్యం
స్విమ్మింగ్‌లో శ్రీహరి జాతీయ రికార్డు
సన్‌ రైజర్స్‌ కు మరో దెబ్బ
పాక్‌ క్రికెటర్లకు వీసాలు ఓకే: బిసిసిఐ
మోంటే కార్లే ఫైనల్లో సిట్సిపస్‌, రుబ్లేవ్‌
టైటిల్‌ నిలబెట్టుకున్న రవి
ఆర్సీబీకి అందుబాటులో డేనియల్‌ సామ్స్‌
సన్‌ రైజ్‌ బౌలర్ల హవా
సూపర్‌ చాహర్‌
బోణీ కొడతారా?!
అశ్విన్‌ కోటా పూర్తి కావాల్సింది
ఢిల్లీ క్యాపిటల్స్‌ కు ఊరట
కోలుకున్న హర్మన్‌ ప్రీత్‌
బెన్‌ స్టోక్స్‌ అవుట్‌
మోరిస్‌ మోత...
ఢిల్లీకి ఉనాద్కట్‌ దెబ్బ
దశాబ్ద ఉత్తమ ఆటగాళ్లు వీరే: ఐసీసీ
సరితకు స్వర్ణం
విశ్వనాథన్‌ ఆనంద్‌కు పితృ వియోగం
బెంగళూరును గెలిపించిన షాబాజ్‌
తీరుమారని బెంగళూరు
సుదీర్ఘ కాలంగా టాప్‌లో కోహ్లి
అవినీతి ఆరోపణలు.. మాజీ కెప్టెన్‌ హీత్‌ స్ట్రీక్‌పై నిషేధం
అభిమానులకు షారుక్‌ ఖాన్‌ క్షమాపణ
ఒలింపిక్స్‌ అథ్లెట్లందరికీ తొలిదఫా కరోనా వ్యాక్సిన్‌: ఐఓఏ
ఐపీఎల్‌లో కరోనా కలకలం..మరో క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌
ఉత్కంఠ పోరులో..ముంబై విజయం
చెలరేగిన రస్సెల్‌..

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.