Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
గులాబీ టర్నర్‌? | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

గులాబీ టర్నర్‌?

- మోతెరాలో స్పిన్‌ పిచ్‌ సిద్ధం
- డే నైట్‌ టెస్టులకు ఇది కొత్త ప్రయోగం
              డే నైట్‌ గులాబీ టెస్టు మ్యాచులు సహజంగానే సీమర్లకు అనుకూలం. పింక్‌ బాల్‌ టెస్టు పిచ్‌లకు పూర్తి భిన్నంగా అహ్మదాబాద్‌లో పింక్‌ టర్నర్‌ సిద్ధం అవుతుందనే చెప్పవచ్చు!. చెన్నై సమరంలో భారత్‌, ఇంగ్లాండ్‌లు 1-1తో సమవుజ్జీలుగా అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి. 2014 నుంచి మోతెరా స్టేడియం అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వలేదు. 1,10,000 సామర్థ్యంతో అత్యాధునికంగా మోతెరా మైదానం సిద్ధమైంది. భారత్‌లో జరుగుతున్న రెండో పింక్‌ బాల్‌ టెస్టు ఇదే, కానీ ఇక్కడ ఎన్నో నూతన ప్రమాణాలు కీలక పాత్ర పోషించనున్నాయి. అవేమిటో చూద్దామా!.
నవతెలంగాణ క్రీడావిభాగం
గులాబీ బంతి :
సంప్రదాయ టెస్టులకు ఉపయోగించే ఎరుపు రంగు ఎస్‌జీ బంతి, డే నైట్‌ టెస్టులకు వాడే ఎస్‌జీ బంతికి ఉండే ఎకైక వ్యత్యాసం.. బంతిని రంగు అద్దే విధానం మాత్రమే. ఎరుపు రంగు ఎస్‌జీ బంతికి డైయింగ్‌ పద్దతిలో రంగు అద్దుతారు. అదే గులాబీ బంతికి పలు పొరలుగా రంగును అద్దుతారు. బంతిపై అదనపు మెరుపు కోసం లాకెర్‌ను వినియోగిస్తారు. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన తొలి డే నైట్‌ టెస్టులో లాకెర్‌ కారణంగా బంతి ఊహించిన దాని కంటే వేగంగా దూసుకొచ్చినట్టు కొందరు ఆటగాళ్లు అభిప్రాయం వెలిబుచ్చారు. ఫీల్డింగ్‌ సమయంలోనూ బంతి కాస్త భారంగా అనిపించిందని చెప్పారు. ఈ అదనపు మెరుపు కారణంగానే కోల్‌కత టెస్టులో సీమర్లు ఎక్కువ స్వింగ్‌ రాబట్టుకున్నారు. కోల్‌కత టెస్టుకు ఈడెన్‌ గార్డెన్‌ క్యూరేటర్‌ 6మిమి పరిమాణంలో పిచ్‌పై పచ్చికను ఉంచాడు. బంగ్లాదేశ్‌తో టెస్టులో ఆ నిర్ణయం పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు ప్రత్యర్థి శిబిరంలోనూ నాణ్యమైన పేసర్లు ఉండటంతో మోతెరాలో ఆ మేరకు పిచ్‌పై పచ్చికను ఉంచలేరు.
పిచ్‌ స్వభావం :
డే నైట్‌ టెస్టులు మొదలై ఆరేండ్లు మాత్రమే అయినా.. సంప్రదాయంగా ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో టెస్టు మ్యాచులు పేసర్లకు సానుకూలం. ప్రపంచవ్యాప్తంగా జరిగిన 15 డే నైట్‌ టెస్టుల్లో ఫాస్ట్‌ బౌలర్లు 24.47 సగటుతో 354 వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్లు 35.38 సగటుతో 115 వికెట్లు తీసుకున్నారు. బంగ్లాదేశ్‌తో కోల్‌కత పింక్‌ బాల్‌ టెస్టులో ప్రత్యర్థి జట్టు 20 వికెట్లనూ పేసర్లే ఖాతాలో వేసుకున్నారు. ఆ మ్యాచ్‌లో స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏడు ఓవర్లు మాత్రమే వేశారు. డే నైట్‌ టెస్టులు పేసర్లకు అనుకూలంగా ఉండటానికి కారణం క్యూరేటర్లు పిచ్‌పై పచ్చికను ఉంచటం. మూడో టెస్టుకు ఐదు రోజుల ముందుగానే మోతెరా పిచ్‌పై క్రమంగా పచ్చిక తగ్గుతూ వస్తోంది. పింక్‌ బాల్‌ రంగు, మెరుపు మన్నిక కోసమైనా ఉంచే నామమాత్రపు పచ్చికను సైతం మోతెరా పిచ్‌పై ఉంచే అవకాశం కనిపించటం లేదు. పిచ్‌పై పచ్చిక లేకపోతే బంతి రంగు తగ్గుతుంది. మోతెరా టెస్టుకు ముందు ఆందోళనకు కలిగిస్తోన్న అంశం ఇది. కోల్‌కత టెస్టు అనుభవం అనంతరం ఎస్‌జీ బంతిని మరింత మెరుగ్గా తయారు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఎదురైనా బంతి మెరుపు కోల్పోకుండా ఎక్కువ ఓవర్లు ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా, మోతెరా పిచ్‌పై ఎస్‌జీ పింక్‌ బంతి రంగు సమస్యగా మారవచ్చు!.
ఫ్లడ్‌ లైట్ల వెలుతురు :
ఈడెన్‌ గార్డెన్స్‌ టెస్టులో అత్యంత చర్చనీయాంశం వెలుతురు సమస్య. నలుగురు బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మెన్‌ బౌన్సర్లకు బలయ్యారు. ఆ టెస్టులో బంగ్లాదేశ్‌ ఇద్దరు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌లను వినియోగించుకుంది. వెలుతురు గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇరు జట్ల నుంచి కొంతమంది వెలుతురు సమస్య లేదని తేల్చగా.. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్‌ బాల్‌ను ఎదుర్కొవటం సవాలని టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా అన్నాడు. అధునాతన మోతెరా స్టేడియంలో సంప్రదాయ ఫ్లడ్‌లైట్లు లేవు. ఇక్కడ పైకప్పుకు ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. దుబారు అంతర్జాతీయ స్టేడియంలోనూ ఇదే తరహా లైటింగ్‌ వ్యవస్థ ఉంది. ఐపీఎల్‌13లో దుబారు మ్యాచుల్లో ఎక్కువగా క్యాచులు నేలపాలు అయ్యాయి. అందుకు ఫ్లడ్‌లైట్ల వెలుతురే కారణమని క్రికెటర్లు వ్యాఖ్యానించారు. టెస్టు మ్యాచ్‌ కావటంతో గాల్లోకి లేచే క్యాచులు తక్కువే, అందుకు ఇప్పుడు ఆ సమస్య ఉండకపోవచ్చు!.
మంచు ప్రభావం :
మోతెరా పింక్‌ టెస్టులో మంచు ప్రభావం కనిపించే అవకాశం ఉంది. టెస్టు మ్యాచ్‌ ఆఖరు సెషన్లో మంచు ప్రభావం ఉండనుందని పుజారా అభిప్రాయపడ్డాడు. మంచు కారణంగా ఇతర సమస్యలు సైతం తలెత్తనున్నాయి. ఈడెన్‌ గార్డెన్‌ టెస్టులో పింక్‌ బాల్‌ ఓసారి మార్పు చేయాల్సి వచ్చింది. భారత ఇన్నింగ్స్‌ 59వ ఓవర్లో బంతి తన ఆకారాన్ని కోల్పోయింది. పాత బంతి మంచు ప్రభావానికి ఎక్కువగా గురవుతుంది. మంచు కారణంగా ఇప్పుడు బంతి ఆకృతిలో మార్పు రాకపోయినా.. బంతి స్వింగ్‌ అయ్యే స్వభావాన్ని కోల్పోతుంది. స్పిన్నర్లకు సైతం బంతిపై పట్టు లభించదు. అదే సమయంలో బ్యాట్స్‌మెన్‌ ఈ పరిస్థితిని ఆస్వాదిస్తారు. ఆ సమయంలో బంతి నేరుగా బ్యాట్‌పైకి వస్తుంది. పరుగులు సులువుగా వస్తాయి. అందుకే దుబారు డేనైట్‌ టెస్టులో (2016)లో బ్యాట్స్‌మెన్‌ పైచేయి సాధించారు. మంచుతో తడిసిన పింక్‌ బాల్‌ స్వింగ్‌, టర్న్‌ అవదు. అది బ్యాట్స్‌మెన్‌కు పండుగ వాతావరణం.
స్వింగ్‌ కాదు టర్న్‌! :
పింక్‌ టెస్టులకు భిన్నంగా మోతెరాలో స్పిన్‌ పిచ్‌ సిద్ధమయ్యే అవకాశం మెండుగా ఉంది. ఆతిథ్య జట్టు అనుకూలతలకు అనుగుణంగా పిచ్‌ తయారు కానుందని భారత జట్టు సీనియర్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ సైతం వ్యాఖ్యానించాడు. రోహిత్‌ వ్యాఖ్యలు మోతెరాలో టర్నర్‌ పిచ్‌ వాదనను బలపరుస్తున్నాయి. కోల్‌కత టెస్టులో భారత పేసర్లు రెచ్చిపోయారు. భారత స్పిన్నర్లు ఇద్దరు కలిసి ఏడు ఓవర్లే వేసినా.. బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం 25 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేశాడు. ఎస్‌జీ పింక్‌ బాల్‌తో ఆశించిన దాని కంటే ఎక్కువ టర్నే లభించిందని పుజారా అన్నాడు. ' దులీప్‌ ట్రోఫీలో కూకాబుర్రా బంతితో ఆడినప్పుడుతో పోల్చితే.. ఈడెన్‌గార్డెన్స్‌లో ఎస్‌జీ బంతితో స్పిన్‌ ఎక్కువ అయ్యింది. మణికట్టు స్పిన్నర్లను మినహాయిస్తే.. సంప్రదాయ స్పిన్నర్లకు కూకాబుర్రాతో పెద్దగా స్పిన్‌ రాలేదు. కానీ ఎస్‌జీ బంతితో తైజుల్‌ సహా అశ్విన్‌ చెప్పుకోదగిన స్థాయిలో స్పిన్‌ చేశారు. పింక్‌ బాల్‌ టెస్టులకు మణికట్టు స్పిన్నర్లను ఆడించటం జట్ల వ్యూహాత్మక ఎత్తుగడగా వస్తోంది. ప్రస్తుత జట్టులో కుల్‌దీప్‌ యాదవ్‌ను తుది జట్టులో చేర్చటం సాధ్యకానిది. అయినా, అశ్విన్‌ తోడుగా అతడినీ బరిలోకి దింపుతారేమో చూడాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిచ్చి పిచ్చిగా పిచ్‌
యూసుఫ్‌ పఠాన్‌ వీడ్కోలు
జపాన్‌ కు ఒలింపిక్స్‌ కళ
అక్షర్‌ 2.0
బాధను ప్రేరణగా చేసుకుంటాం
వింటర్‌ స్పోర్ట్స్‌ వేదిక గుల్‌మార్గ్‌
రెండు రోజుల్లోనే..
స్థాయికి తగ్గ ప్రదర్శన చేశామ‌ని అనుకోవటం లేదు
సద్వినియోగం చేసుకోలేదు
400 వికెట్లు క్లబ్‌ లో అశ్విన్‌
అక్షర్‌ సిక్సర్‌
పటేల్‌ కాదు మోడీ స్టేడియం
గెలుపే లక్ష్యంగా..
మోతెరాకు రాష్ట్రపతి
నేడు ఆడుతున్నాను
రెండు టెస్టులూ గెలుస్తాం!
సచిన్ క్రికెట్ పాఠాలు.. ఫ్రీ..
ప్రకటనలకు పరిమితులు!
హెచ్‌సీఏ అక్రమాలపై విచారణ జరపాలి
తెవాటియా చితక్కొట్టాడు !
ఐఎస్‌ఎల్‌ తరహాలో ఐపీఎల్‌ !
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జకోవిచ్‌
ఆ విషయంలో భారత్‌ను తప్పుబట్టలేం..!
ఒసాకాదే టైటిల్‌
ఫిట్టా..అన్‌ ఫిట్టా..!
దుమ్ము రేపాడు..
అందుకే వేలం వెర్రి!
ఫైనల్లో మెద్వదేవ్‌
సెరెనా కథ ముగిసే..
జకోవిచ్‌ జోరు

తాజా వార్తలు

06:59 AM

నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్​ షా పర్యటన

06:50 AM

ఉదయం 11 గంటలకు ప్రధాని మన్​కీ బాత్

06:43 AM

ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్..

06:34 AM

వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం : విజయసాయిరెడ్డి

09:56 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ..

09:47 PM

బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

09:39 PM

మార్చి నెలలో బ్యాంకులకు 8రోజులు సెలవులు..

09:30 PM

పాము కాటుతో గొర్కెల కాపరి మృతి

09:19 PM

కుమార్తెను తల్లిదండ్రులే విక్రయించిన ఘటనపై చంద్రబాబు స్పందన

09:12 PM

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం..12మందికి పాజిటివ్

09:02 PM

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్

08:53 PM

సూర్యాపేట జిల్లాలో 129 కేజీల గంజాయి పట్టివేత

08:47 PM

జగిత్యాల జిల్లాలో వైద్యం వికటించి వ్యక్తి మృతి..

08:39 PM

చిన్న వయసులోనే సివిల్​ జడ్జిగా ఎంపికైన చేతన

08:25 PM

ఎట్టి పరిస్థితుల్లో నేను మాస్క్ ధరించను: రాజ్ థాకరే

08:17 PM

పోలీసుల అదుపులో యూట్యూబ్‌‌ స్టార్‌ షణ్ముఖ్‌‌..

08:10 PM

న్యాయవాదుల హత్యపై కేసీఆర్‌ స్పందించకపోవడం శోచనీయం..

08:02 PM

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : తేజస్వీ యాదవ్‌

07:54 PM

దేశంలో పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

07:40 PM

టీకా ధర నిర్ణయించిన కేంద్రం.. రేటు ఎంతో తెలుసా..?

07:33 PM

పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళ అదృశ్యం

07:26 PM

భార్యను బెదిరించడానికి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు..

07:15 PM

మే 2న నా చివరి ట్వీట్ కోసం వేచి చూడండి: ప్రశాంత్ కిశోర్

07:08 PM

మహారాష్ట్రలో మార్చి 8వరకు లాక్‌డౌన్‌..

07:00 PM

బిట్టు శ్రీనును పోలీస్​ కస్టడీకి అనుమతించిన కోర్టు

06:56 PM

నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత

06:44 PM

ఖమ్మం జిల్లాలో గ్యాస్ సిలిండర్లు పేలి రెండు ఇళ్లు దగ్థం..

06:39 PM

ఏపీలో కొత్తగా మరో 118 పాజిటివ్ కేసులు

06:10 PM

కాంగ్రెస్ బలహీనపడుతోంది.. సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్

06:00 PM

ఆమె కలెక్టర్.. ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.