Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం
- నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను 3వ సీడ్, జపాన్ భామ నవోమి ఒసాకా చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ఒసాకా 6-4, 6-3 తేడాతో అమెరికాకు చెందిన 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీని వరుససెట్లలో చిత్తుచేసింది. తొలిసెట్‌ను 41 నిమిషాల్లో సొంతం చేసుకున్న ఒసాకా రెండోసెట్‌ను 36 నిమిషాల్లోనే ముగించింది. ఇక తొలిసెట్‌లో ఓ బ్రేక్ పాయింట్‌ను సాధించిన ఒసాకా.. ఆ సెట్‌ను 6-4తో కైవసం చేసుకుంది. ఇక రెండోసెట్‌లో ఒసాకా ఆధిపత్యం పూర్తిగా చెలాయించి ఓ దశలో 4-0 ఆధిక్యతలో నిల్చి ఆ గేమ్‌ను 6-2తో ముగించడం విశేషం. దీంతో ఒసాకా కెరీర్‌లో నాల్గో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2019తర్వాత వరుసగా రెండో ఏడాది ఈ టైటిల్‌ను మహిళా క్రీడాకారిణిగా ఒసాకా నిలిచింది. కరోనా కారణంగా 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రద్దు అయిన సంగతి తెలిసిందే. ఓపెన్ ఎరా టెన్నిస్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను రెండవసారి గెలిచిన 12వ క్రీడాకారిణిగా ఒసాకా నిలిచింది. వరుసగా 21 మ్యాచ్‌లు గెలిచిన ఒసాకా.. హార్డ్ కోర్టు క్వీన్‌గా నిలిచింది. నవోమి ఒసాకా పవర్ షాట్ ముందు బ్రాడీ నిలువలేకపోయింది. జెన్నిఫర్ బ్రాడీ బ్యాక్‌హ్యాండ్ షాట్లతో అలరించినా.. ఒసాకా దూకుడు, పవర్ ప్లేముందు నిలువలేకపోయింది. భారీ సర్వ్‌లతోనూ బ్రాడీ కేక పుట్టించింది. బ్రాడీ గత ఏడాది యుఎస్ ఓపెన్ సెమీస్‌కు చేరగా.. ఈసారి ఏకంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకొచ్చింది.
జకోకు మెద్వదెవ్ కళ్లెం వేసేనా?
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్ ఫైనల్ పోటీ ఆదివారం జరగనుంది. సెర్బియాకు చెందిన టాప్ సీడ్ జకోవిచ్, 4వ సీడ్ రష్యాకు చెందిన మెద్వదేవ్‌ల మధ్య టైటిల్ సమరం జరగనుంది. వీరిద్దరూ ఫైనల్‌కు చేరే క్రమంలో మూడోరౌండ్ పోటీల్లో ఐదుసెట్ల హోరాహోరీ పోరులో గెలిచి టైటిల్ పోరుకు చేరారు. సెమీస్‌కు 5వ సీడ్ సిట్సిపాస్‌ను మెద్వదెవ్ ఓడించగా.. క్వార్టర్‌ఫైనల్లో 6వ సీడ్ జ్వెరేవ్‌ను జకోవిచ్ ఓడించాడు.
మెద్వదెవ్(రష్యా)
పోస్పిసిల్(కెనడా) 6-2, 6-2, 6-4
కార్బిలిస్(స్పెయిన్) 6-2, 7-5, 6-1
క్రాజినోవిక్(క్రొయేషియా)6-3,6-3,4-6,3-6, 6-0
మెక్ డొనాల్డ్(అమెరికా) 6-4, 6-2, 6-3
రుబ్లేవ్(రష్యా) 7-5, 6-3, 6-2
సిట్సిపాస్(గ్రీక్) 6-4, 6-2, 7-5
జకోవిచ్(సెర్బియా)
ఛార్డే(ఫ్రాన్స్) 6-3, 6-1, 6-2
టాఫీ(అమెరికా) 6-3, 6-7(3-7), 7-6(7-2), 6-3
ఫ్రిట్జ్(అమెరికా) 7-6(7-1), 6-4, 3-6, 4-6, 6-2
రోనిక్(కెనడా) 7-6(7-4), 4-6, 6-1, 6-4
జ్వెరేవ్(జర్మనీ) 6-7(6-8), 6-2, 6-4, 7-6(8-6)
అస్లాం కరక్ట్సేవ్(రష్యా) 6-3, 6-4, 6-2