Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
స్మిత్‌ ను ఎంచుకున్నాను | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 26,2021

స్మిత్‌ ను ఎంచుకున్నాను

- అందరి దృష్టిని నావైపు తిప్పుకున్నాను
- ఆస్ట్రేలియా సిరీస్‌పై రవిచంద్రన్‌ అశ్విన్‌
                ఆస్ట్రేలియాతో సిరీస్‌ అనగానే వేదికతో సంబంధం లేకుండా స్టీవ్‌ స్మిత్‌ను అవుట్‌ చేయటం ఎలా? అని ప్రత్యర్థి జట్లు తలలు పట్టుకుంటాయి. కంగారూ గడ్డపై సిరీస్‌ అంటే అతడిని అవుట్‌ చేసే ప్రణాళికలకు మరింత పదును పెట్టాల్సిందే. స్టీవ్‌ స్మిత్‌ను వెనక్కి పంపే ప్రణాళికల్లో స్పిన్నర్లకు పెద్ద పాత్ర ఉండదు. ప్రత్యర్థి జట్ల ప్రణాళికలు ఫలించినా, అప్పటికి స్మిత్‌ స్కోరు మూడంకెలకు చేరువగా ఉంటుంది. స్టీవ్‌ స్మిత్‌ తలనొప్పి నుంచి ఏ జట్లూ తప్పించుకోలేదు. బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌లోనూ స్టీవ్‌ స్మిత్‌ భారత్‌ బౌలర్లకు సింహస్వప్నంలా కనిపించాడు. ట్రంప్‌కార్డ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన మ్యాజికల్‌ వ్యూహంతో స్మిత్‌ ఆట కట్టించాడు. ఆసీస్‌పై మూడు టెస్టుల్లో 12 వికెట్లు కూల్చిన అశ్విన్‌.. సిడ్నీ సూపర్‌ ఛేదనలో అజేయంగా 39 పరుగులు చేసి ఔరా అనిపించాడు. స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ వైఫల్యం మూలంగానే ఆస్ట్రేలియా తొలి రెండు టెస్టుల్లో 200 పరుగులైనా చేసేందుకు ఆపసోపాలు పడింది. ఆసీస్‌ పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రస్తుతం ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. చెన్నైకి చేరుకున్న అశ్విన్‌ మీడియాతో ఆస్ట్రేలియా పర్యటన అనుభవాలను పంచుకున్నాడు.

నవతెలంగాణ-చెన్నై
1. సిడ్నీ టెస్టులో గాయం అనంతరం ఏ విధంగా సిద్ధమయ్యారు?
నాల్గో టెస్టుకు ముందు మెరుగ్గానే అనిపించింది. బ్రిస్బేన్‌లో నేను ఆడతానని అనిపించింది. గబ్బాలో కొన్ని అనుకోని సంఘటనలు చోటుచేసుకున్నాయి. హౌటల్‌లో కనీసం స్విమ్మింగ్‌పూల్‌ ప్రవేశం సైతం లభించలేదు. గాయం నుంచి కోలుకునే ప్రక్రియలో స్విమ్మింగ్‌పూల్‌ది ముఖ్యమైన పాత్ర. రిహాబిలిటేషన్‌ ప్రక్రియ సవ్యంగా సాగుతుందని ఫిజియో సైతం భావించాడు, గబ్బాలో ఆడే అవకాశం ఉందని ఆయనా అనుకున్నారు. అది ఏమాత్రం ఊహించలేని గాయం. సిరీస్‌ 1-1తో సమవుజ్జీగా నిలిచిన తర్వాత, పరిస్థితులు యూ టర్న్‌ తీసుకున్నాయి. సిడ్నీ, బ్రిస్బేన్‌లో చోటుచేసుకున్న సంఘటనల కారణంగా మేము క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. కొన్నిసార్లు అది ప్రశ్నార్థకం. సౌకర్యాలపై మేము ప్రశ్నించటాన్ని కొందరు ఏమాత్రం అర్థం చేసుకోకుండా, కామెంట్‌ చేయటం కనిపించింది.
2. ఆడిలైడ్‌ టెస్టు అనంతరం జరిగిన మార్పు ఏమిటి? బౌలింగ్‌ బృందంలో మీరు ఎక్కువగా చర్చించారు?
నిజానికి జట్టులో ఎటువంటి చెప్పుకోదగిన మార్పు లేదు. బౌలింగ్‌ విభాగంలో అనుభవం కాస్త లోపించింది. మహ్మద్‌ సిరాజ్‌ అరంగేట్రం చేయాల్సి ఉంది. మేము 36 పరుగులకు ఆలౌట్‌ అయ్యాం, పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు మాకు మేము గొప్ప అవకాశాన్ని కల్పించుకున్నాం. మైదానంలో ఎవరికి వారు సహజసిద్ధమైన శక్తి సామర్థ్యాలను బయటకు తీయగలరు. అందులో నేను పోషించదగిన పాత్ర ఏం లేదు.
3. ఇటీవల కాలంలో మీ బ్యాటింగ్‌ విమర్శలకు తావిస్తోంది. సిడ్నీ టెస్టు ఇన్నింగ్స్‌ ప్రాధాన్యత ఎంత?
వెస్టిండీస్‌ పర్యటన నుంచి నా బ్యాటింగ్‌పై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో విషయం చెప్పాలి, నేను అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నప్పుడు జట్టులో పోషించే పాత్ర మారుతూ ఉంటుంది. కేవలం టెస్టు క్రికెట్‌ మాత్రమే ఆడగలిగే నా పాత్ర భిన్నంగా ఉంటుంది. నేను టెస్టు క్రికెట్‌లో మాత్రమే ఆడుతున్నప్పుడు, తుది జట్టులో స్పిన్నర్‌ స్థానం కోసం ఎల్లప్పుడూ మరోకరితో పోటీపడుతూనే ఉన్నాను. కేవలం నా బ్యాటింగ్‌ ప్రదర్శన ఆధారంగానే నన్ను బేరీజు వేయగలిగితే అప్పుడు ఓ సిరీస్‌ లేదా రెండు సిరీస్‌లు ఆ దిశగాను నన్ను బయట పడేయగలవు. కానీ నా ప్రదర్శనను సరైన రీతిలో బేరీజు వేయలేదని నా భావన.
4. ఈ సిరీస్‌లో ప్రదర్శనే ఆస్ట్రేలియా మీ అత్యుత్తమ ప్రదర్శన అనుకోవచ్చా?
గతాన్ని చూస్తూ మీరు ఆ మాట అనవచ్చు. కానీ నాకు సంబంధించి ఈ సిరీస్‌ను మరో దృకృథంతో చూస్తున్నాను. నేను ఎప్పుడూ చెబుతుంటాను, ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని ఎప్పుడూ చెప్పలేం. మన ముందు ఎటువంటి అవకాశం ఉందో తెలియదు. నిజాయితీగా చెప్పాలంటే సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌ నుంచి ఆడుతానని నేను అనుకోలేదు. రవీంద్ర జడేజాకు తొడ కండరం గాయంతో తొలి టెస్టులో నాకు అవకాశం దక్కింది. అన్ని అనుకున్నట్టు జరిగాయి, గత రెండేండ్లుగా నేనూ కూడా బాగా బౌలింగ్‌ చేస్తున్నట్టు భావిస్తున్నాను. అనుకున్నవన్నీ చేతిలోకి వచ్చినట్టు ఉంది.
5. భారత బెంచ్‌ బలాన్ని ఆస్ట్రేలియా తక్కువ అంచనా వేసిందా?
ఆ విషయంలో నేను ఏం చెప్పలేను. ఆడిలైడ్‌లో 190 పరుగులకే కుప్పకూలింది. ఆడిలైడ్‌లో మరో 100 పరుగులు జోడించినా.. అక్కడా ఫలితం భిన్నంగా ఉండేది. మన బౌలింగ్‌ ఆస్ట్రేలియాకు కఠిన సవాల్‌ విసరబోతుందని ప్రత్యర్థికి ముందే తెలుసని నా అభిప్రాయం. 36 పరుగులకు ఆలౌటైన జట్టే మెల్‌బోర్న్‌లో పుంజుకునే మార్గం అన్వేషించింది. కేవలం బెంచ్‌ బలం మాత్రమే సిరీస్‌ గమనాన్ని నిర్దేశించలేదు. సవాల్‌ ఎదురైన ప్రతి సారీ జట్టులో ఎవరో ఒకరు అంచనాలకు మించి రాణించాడు. బౌలింగ్‌ విభాగంలో నూతన ఆటగాళ్లు రావటం మంచి విషయం. సుదీర్ఘ సిరీస్‌లు ఆడుతున్నప్పుడు కొత్త ఆటగాళ్లతో మేలు జరుగుతుంది.
6. విశాఖలో సఫారీపై 2019 టెస్టు అనంతరం 'అరంగేట్రం చేసినట్టు ఉంది' అన్నారు. ఆడిలైడ్‌ టెస్టులోనూ అదే మాట అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో దశాబ్ద కాలం అనుభవం ఉన్నప్పటికీ ప్రతిసారీ నిరూపించుకోవాల్సి రావటం సమంజసమేనా?
అది సమర్థనీయమా? కాదా? అనేది నాకు తెలియదు. ఈ సిరీస్‌ అసాంతం బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌తో అద్భుతమైన సంభాషణలు జరిగాయి. 2011-12 ఇంగ్లాండ్‌ సిరీస్‌ అనంతరం నన్ను పక్కనపెట్టాలనుకున్నట్టు రాథోర్‌ చెప్పాడు. అది నిజమా? అని అడిగాను. ఎందుకంటే నేనూ దాని గురించి విన్నాను. అందుకు అతడు అవును, నువ్వు బాగా బౌలింగ్‌ చేస్తున్నావని మేం అనుకోలేదని అన్నాడు. కానీ నేను ఆ సిరీస్‌లో 400కు పైగా పరుగులు, 14-15 వికెట్లు పడగొట్టాను. ఓ యువ క్రికెటర్‌తో అలా వ్యవహరించటం సరైనదని నేను అడిగాను. ఈ పోరాటం నాకు తెలియనది కాదు, నేను ఎప్పుడూ చేస్తున్న సమరమే. నాతో పోటీపడేందుకు ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటారని నేను అనుకుంటాను. అదే జీవితం, ఈ వాస్తవాన్ని నేను యుక్త వయసులోనే అంగీకరించాను. నా వరకు పోటీతత్వమే నాలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీసింది. నాకు ఎటువంటి ఫిర్యాదులు లేవు. అందుకు ప్రతి టెస్టును నేను తొలి టెస్టుగానే భావిస్తున్నాను. నా ప్రదర్శన బాగాలేకుంటే, నా తల కిందకు దించుకుని ముందుకు సాగిపోతాను. నేను క్రికెట్‌ ఆడుతున్న తీరు ఇది. భవిష్యత్‌లోనూ ఇది భిన్నంగా ఉండబోదు.
7. స్టీవ్‌ స్మిత్‌తో సమరం.. మీ కెరీర్‌లోనే అత్యుత్తమంగా భావించవచ్చా?
నాథన్‌ లయాన్‌తో ముఖాముఖి పోటీపడుతున్నప్పుడు నా బౌలింగ్‌పై ఎన్నో వ్యాఖ్యలు చేశారు. గత సిరీస్‌లో ఆడిలైడ్‌ టెస్టులో పొత్తికడుపులో నొప్పి ఉన్నప్పటికీ బౌలింగ్‌ చేశాను, ఆరు వికెట్లు తీసుకున్నాను. మ్యాచ్‌ అనంతరం, నాథన్‌ లయాన్‌ బౌలింగ్‌తో నన్ను పోల్చుతూ మాట్లాడారు. మంచి ప్రదర్శన పట్ల సైతం ఇటువంటి వ్యాఖ్యానం ఎంతో నిరాశపరిచింది. 2018 సౌతాంప్టన్‌ టెస్టు తర్వాత, నేను బాగా బాధపడిన సందర్భం అది.
నా ప్రదర్శన తరచుగా మైక్రోస్కోప్‌లో చూస్తున్నారని నా భావన. దీన్ని వ్యక్తిగతంగా నేను సవాల్‌గా తీసుకున్నాను. ప్రత్యర్థి స్పిన్నర్‌ నాథన్‌ లయాన్‌తో కాదు, స్టీవ్‌ స్మిత్‌తో పోటీపడాలని నిర్ణయించుకున్నాను. లయాన్‌ మంచి బౌలర్‌, అతడి పట్ల నాకు గౌరవం ఉంది. కానీ నా ఫోకస్‌ మరోదానిపై ఉంది. ఆస్ట్రేలియాలో స్పిన్నర్లకు స్టీవ్‌ స్మిత్‌ వికెట్లు కోల్పోని రికార్డు ఉంది. ఆ రికార్డును తిరగరాయాలని నేను అనుకున్నాను. ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్‌గా నేను భావించాను. ఆ దిశగానే నా ఆలోచనలు ఉండాలని అనుకున్నాను. సిరీస్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ ఎవరు? అని ఆలోచన చేశాను. విరాట్‌ కోహ్లితో నేను పోటీపడలేను. దీంతో స్టీవ్‌ స్మిత్‌తో పోరాడాలని నిశ్చయించుకున్నాను. స్మిత్‌ను ఎవరు అవుట్‌ చేస్తారని చాలా మంది చర్చించారు. కానీ ఎవరూ నాకు అవకాశం ఇవ్వలేదు. సిరీస్‌ ముగిసిన తర్వాత, స్మిత్‌ నిష్క్రమణల గురించి చర్చలో నా గురించి మాట్లాడాలని అనుకున్నాను.
8. పేస్‌ విభాగంలో చాలా మంది కొత్త పేసర్లు వస్తున్నారు. స్పిన్‌ విభాగంలో మీరు, జడేజా, కుల్దీప్‌ మినహా మరొకరు కనిపించటం లేదు. దీన్ని ఏవిధంగా చూడాలి?
అంతా, మనం చూసే దృక్కోణంలోనే ఉంటుంది. 10 ఏండ్ల కింద మన పేస్‌ విభాగం గురించీ ఇదే అన్నారు. 15 ఏండ్ల కిందట బ్యాటింగ్‌ విభాగం గురించి సైతం ఇదే మాట అన్నారు. దిగ్గజ క్రికెటర్లు వీడ్కోలు పలికితే మన జట్టు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దిగ్గజాల చలవతో ఇప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ మనం గొప్పగా ఉన్నాం. ఇదేమీ అంతా మనమే, మన తర్వాత శూన్యమే కాదు. మనది 140 కోట్ల జనాభా ఉన్న దేశం. ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వస్తూనే ఉంటారు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో స్పిన్నర్లకు తగినంత అనుకూలత లేదు. నేను ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ నుంచి వచ్చాను. నా తొలి కెప్టెన్‌ ఎస్‌ బద్రీనాథ్‌, తొలి కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌. ఇప్పుడు వస్తున్న స్పిన్నర్లు నేర్చుకుంటున్న తీరు.. నా కెరీర్‌ ఆరంభంలో ఉన్నట్టు లేదు. పిచ్‌పై ఉంచుతున్న పచ్చికతో తొలి రెండు రోజుల్లోనే పేసర్లు వికెట్లు పడగొడుతున్నారు. స్పిన్నర్ల పాత్ర అక్కడే తగ్గిపోతుంది. స్పిన్నర్లు వెలుగులోకి వచ్చేది ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోనే. స్పిన్నర్ల నుంచి మనం ఆ అనుకూలతను లాగేసుకుని, కేవలం టీ20 క్రికెట్‌ దృష్టిలోనే చూస్తే వారి కెరీర్‌ అక్కడితోనే ముగుస్తుంది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ప్రతిభావంతులైన స్పిన్నర్లు ఉన్నారు, కానీ వారిని సరైన దిశలో నడపటం లేదు. యువ స్పిన్నర్‌గా నాకు దక్కిన సౌలభ్యాలు ఇప్పుడు స్పిన్నర్లకు ఫస్ట్‌ క్రికెట్‌లో లభించటం లేదు.
9. సీనియర్‌ క్రికెటర్‌గా టెస్టు జట్టుకు వైస్‌ కెప్టెన్‌ కానందుకు నిరాశపడ్డారా?
ఈ ప్రశ్నను ఇంతకుముందు అడిగితే, లోతైన భావనలతో అది బాధపెట్టిందా? లేదా అని మాట్లాడేవాడిని. నిజాయితీగా చెప్పాలంటే నేను నిరాశ చెందలేదు. దానితో అసలు నాకు సంబంధం లేదు. నేను ఆడిన కెప్టెన్లు, వైస్‌ కెప్టెన్లు నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ముందుకు సాగుతూ ప్రేరణ నింపుకుంటూ వెళ్లటమే నాయకత్వం. అదే రీతిలో మనతో పాటు మరో ఆటగాడికి సైతం ముందుకు నడిపితే అదీ నాయకత్వమే. అద్భుతమైన క్రికెటర్లతో కలిసి డ్రెస్సింగ్‌రూమ్‌ పంచుకోవటం నా అదృష్టం. విరాట్‌ కోహ్లి, అజింక్య రహానె, చతేశ్వర్‌ పుజారాలతో కలిసి ఆడటం సైతం గౌరవమే. నేను రిటైర్‌ అయ్యాక ఈ క్రికెటర్ల స్థాయి భిన్నంగా ఉంటుంది. వైస్‌ కెప్టెన్‌ కావటం, కాకపోవటం నాకు అప్రస్తుతం.
10. రానున్న ఇంగ్లాండ్‌ సిరీస్‌లో 400 వికెట్ల రికార్డుపై కన్నేశారా?
నిజాయితీగా చెబుతున్నాను 'లేదు'. ఇదే ప్రశ్న కొంతకాలం ముంగిట అడిగితే నేను అవును అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు కాదు. 200 వికెట్ల మైలురాయి చేరుకున్న తర్వాత, మైలురాళ్ల గురించి ఆలోచించటం మానేశాను. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ బాగా సాగుతుందని అనుకుంటున్నాను. గత పర్యటనలో 4-0తో భారత్‌ గెలిచినా.. ఇంగ్లాండ్‌ బాగా ఆడింది. ఇప్పుడు శ్రీలంక పర్యటన నుంచి ఇక్కడికి వస్తున్నారు. రసవత్తర టెస్టు సిరీస్‌ ఆడనున్నామని చెప్పగలను.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిచ్చి పిచ్చిగా పిచ్‌
యూసుఫ్‌ పఠాన్‌ వీడ్కోలు
జపాన్‌ కు ఒలింపిక్స్‌ కళ
అక్షర్‌ 2.0
బాధను ప్రేరణగా చేసుకుంటాం
వింటర్‌ స్పోర్ట్స్‌ వేదిక గుల్‌మార్గ్‌
రెండు రోజుల్లోనే..
స్థాయికి తగ్గ ప్రదర్శన చేశామ‌ని అనుకోవటం లేదు
సద్వినియోగం చేసుకోలేదు
400 వికెట్లు క్లబ్‌ లో అశ్విన్‌
అక్షర్‌ సిక్సర్‌
పటేల్‌ కాదు మోడీ స్టేడియం
గెలుపే లక్ష్యంగా..
మోతెరాకు రాష్ట్రపతి
నేడు ఆడుతున్నాను
రెండు టెస్టులూ గెలుస్తాం!
సచిన్ క్రికెట్ పాఠాలు.. ఫ్రీ..
గులాబీ టర్నర్‌?
ప్రకటనలకు పరిమితులు!
హెచ్‌సీఏ అక్రమాలపై విచారణ జరపాలి
తెవాటియా చితక్కొట్టాడు !
ఐఎస్‌ఎల్‌ తరహాలో ఐపీఎల్‌ !
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జకోవిచ్‌
ఆ విషయంలో భారత్‌ను తప్పుబట్టలేం..!
ఒసాకాదే టైటిల్‌
ఫిట్టా..అన్‌ ఫిట్టా..!
దుమ్ము రేపాడు..
అందుకే వేలం వెర్రి!
ఫైనల్లో మెద్వదేవ్‌
సెరెనా కథ ముగిసే..

తాజా వార్తలు

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

01:53 PM

సైకిల్​ను ఢీకొట్టిన బొలెరో వాహనం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

01:44 PM

ఎన్నిక‌ల నేప‌థ్యంలో దాడుల‌కు పాల్ప‌డుతున్నారు: చ‌ంద్ర‌బాబు

01:37 PM

నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఆడి కారు బీభత్సం..

01:25 PM

తెలంగాణలో కాంగ్రెస్ మాజీ ఎంపీకి షాక్..

01:17 PM

మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చుతాం: య‌న‌మ‌ల

01:10 PM

సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే

12:59 PM

విద్యావ్యవస్థలో మార్పులు రావాలి : రాహుల్ గాంధీ

12:48 PM

జగిత్యాల జిల్లాలో కారు ఢీకొని బాలుడు మృతి

12:40 PM

ముగిసిన రామమందిరం విరాళాల సేకరణ..రూ.2వేల కోట్లు వసూలు

12:29 PM

అప్పు తీర్చలేదని స్నేహితుడిపై కత్తితో దాడి

12:20 PM

గెలిచే టీడీపీ అభ్యర్థులను.. జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్

12:08 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దారుణ హత్య..

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.