Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బౌలర్లది భయమెరుగని సిద్ధాంతం | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 24,2021

బౌలర్లది భయమెరుగని సిద్ధాంతం

- ఆసీస్‌ పై వ్యూహం జూన్‌లోనే మొదలైంది
- భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌
             టెస్టులు నెగ్గాలంటే పరుగులు కాదు, 20 వికెట్లు పడగొట్టగలిగే సత్తా ఉన్న బౌలర్లు కావాలి. ఎటువంటి పిచ్‌లపైనైనా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ఏ జట్టునైనా వారి సొంతగడ్డపైనే ఓడించాలంటే బౌలింగ్‌ బృందం మరింత పటిష్టంగా ఉండాలి. భారత్‌కు అటువంటి బలమైన బౌలింగ్‌ బృందం ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ గాయాల బారిన పడి వరుసగా ప్రధాన బౌలర్లందరూ దూరమయ్యారు. ద్వితీయ శ్రేణి, బెంచ్‌ బౌలర్లు, నెట్‌ బౌలర్లు తుది జట్టులోకి వచ్చారు. బెంచ్‌ బౌలర్లతో నెట్టుకొచ్చే స్థితి నుంచి బ్రిస్బేన్‌ గోడలు బద్దలుకొట్టే వరకు టీమ్‌ ఇండియా అద్వితీయం. ఆస్ట్రేలియాలో 2-1తో టెస్టు సిరీస్‌ విజయం వెనుక బౌలర్ల కృషి అమోఘం. కంగారూ పర్యటనలో బౌలింగ్‌ ప్రణాళికలు, సవాళ్లపై భారత జట్టు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

నవతెలంగాణ-న్యూఢిల్లీ
- మ్యాచ్‌ మ్యాచ్‌కు బౌలర్లను కోల్పోతూనే ఉన్నారు. అనుభవం లేని బౌలర్లే మిగిలారు. కెరీర్‌ తొలి, రెండో టెస్టులోనే రాణించేందుకు వారితో ఏం చెప్పారు?
ప్రత్యేకించి కోవిడ్‌ సమయంలో ఆస్ట్రేలియా పర్యటన అత్యంత సవాళ్లతో కూడుకున్నది. నెట్‌ బౌలర్లు అందరికీ జట్టుతో పాటే ఉంచాలని నిర్ణయం తీసుకుని చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి చాలా మంచి పని చేశాడు. వన్డే సిరీస్‌ అనంతరం, చాలా మంది బౌలర్లు స్వదేశానికి వెళ్లాల్సింది. పర్యటన మధ్యలో ఎవరికైనా ఏమైనా జరిగితే, కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో కొత్త ఆటగాళ్లు జట్టుతో చేరటం ఇబ్బందికరం. నెట్‌ బౌలర్లు అందరూ ఉంటే, చూసుకుంటామని చెప్పాడు. నెట్‌ బౌలర్లు అందరూ చాలా కాలం నుంచి జట్టుతో పాటే ఉండటంతో అవసరాలు సులువుగా అర్థం చేసుకుంటారు. నెట్‌ బౌలర్లు జట్టుతో పాటు ఉండటం ఎంతగానో ఉపయోగపడింది.
- జశ్‌ ప్రీత్‌ బుమ్రా లేకపోయినా గబ్బాలో 20 వికెట్లు తీయగలమనే నమ్మకాన్ని మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైని వంటి పేసర్లకు ఏ విధంగా కలిగించారు?
మేము ఎప్పుడూ చర్చించుకునేది నిలకడగా ప్రదర్శన చేయటం. అందరికీ మంచిగా బౌలింగ్‌ చేయగల నైపుణ్యం ఉంది. అందరికీ వికెట్లు తీయటంలో అనుభవం ఉంది. టెస్టు క్రికెట్‌ మిగతా ఫార్మాట్లకు భిన్నమేమీ కాదు. టెస్టు క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌ పొరపాటు చేసేందుకు గల అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, అదే ప్రధాన వ్యత్యాసం. బౌలర్లు ఈ సన్నని వ్యత్యాసాన్ని తీసేయాలి. నెట్స్‌లో బౌలింగ్‌ చేసిన ప్రతిసారి, వారు ఏ లైన్‌లో వేస్తున్నారనే విషయాన్ని నాతో చర్చించేవారు.
ఆ రోజు నెట్స్‌లో ఏ విధంగా బౌలింగ్‌ చేశారనే అంశంపై సరైన ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వటం నా బాధ్యత. మ్యాచ్‌లో ప్రయోగించాలనుకునే బంతులను ప్రతి నెట్‌ సెషన్‌లో ప్రాక్టీస్‌ చేస్తుంటారు. టెస్టు క్రికెట్‌లో ఒత్తిడి భిన్నంగా ఉంటుంది, కానీ ఒత్తిడిలోనూ బౌలర్లు గొప్పగా రాణించారు. సవాళ్లను స్వీకరించి అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ లక్షణమే వాళ్లను చాంపియన్లను చేసింది. అందుకే భారత బౌలర్లు ఆస్ట్రేలియాలో అద్భుతంగా రాణించారు.
- ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమిలు వీడ్కోలు పలికిన తర్వాత పేస్‌ విభాగంలో వారి స్థానాలను మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైని, శార్దుల్‌ ఠాకూర్‌లు భర్తీ చేయగలరనేందుకు బ్రిస్బేన్‌ టెస్టు మ్యాచ్‌ను ఓ సంకేతంగా భావించవచ్చా?
అది ఇంకా జరుగలేదు. ఆ ప్రక్రియ కోసం మేము గత మూడేండ్లుగా శ్రమిస్తున్నాం. అమోఘమైన నైపుణ్యమున్న బెంచ్‌ బౌలర్లు అవసరం, అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ నిలదొక్కుకోగలదు. సిరీస్‌లు, మ్యాచ్‌లకు రొటేషన్‌ పద్దతిలో ఆడేందుకు భారత్‌కు ఓ బౌలింగ్‌ బృందం అవసరం. అప్పుడే బౌలర్లు ప్రతి సిరీస్‌కు తాజాగా సిద్ధం కాగలరు. ప్రస్తుతం భారత్‌కు మంచి బెంచ్‌ బౌలర్లు ఉన్నారు. అవకాశం చిక్కినప్పుడు, దేశం తరఫున అద్భుతంగా ఆడుతున్నారు. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సమయంలోనైనా భారత్‌కు ఆడేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం ఈ పర్యటనతో బౌలర్లకు దక్కింది.
భారత్‌కు ఆడేందుకు సిద్ధంగా మన దగ్గర ఏడుగురు ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు, ఇప్పుడు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులు.. ఈ అన్నింటిలోనూ మెరుగైన ప్రదర్శన చేయాలంటే, రిజర్వ్‌ బౌలర్లు అవసరం. నెట్‌ బౌలర్లకు సైతం మంచి క్రికెట్‌ ఆడిన అనుభవం ఉంది. ఈ అందరి బౌలర్లు రొటేషన్‌ పద్దతిలో అవకాశాలు అందుకుంటారు. సిరీస్‌ల వారీగా భారత్‌ ప్రతిసారీ అత్యుత్తమ తుది జట్టునే బరిలోకి దింపుతుంది. రొటేషన్‌ విధానం గురించి ఇప్పటికే అవసరమైన చర్చ నడిచింది.
- ఏ దేని బౌలర్‌ టెస్టు క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని ఎలా తెలుస్తుంది?
జాతీయ జట్టుకు ఎంపికైన ఏ బౌలర్‌ అయినా, ఆడేందుకు సిద్ధంగా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో ఉండే ప్రధాన సవాల్‌ నిలకడ. గత రెండు, మూడేండ్లుగా సైని, సిరాజ్‌, శార్దుల్‌లు భారత జట్టులోకి వచ్చీ వెళ్లినవారే. జాతీయ జట్టులో విజయం సాధించేందుకు ఏం కావాలో వారి స్పష్టంగా తెలుసు. భారత జట్టు విజయాన్ని విశ్లేషణ చేస్తే.. ఇషాంత్‌ వర్మ, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌ ప్రదర్శనలో కామన్‌గా ఉండేది నిలకడ. నెట్‌ బౌలర్లు కొంతకాలంగా జట్టుతో ఉన్నారు. వారు నిశితంగా గమనిస్తున్నారు, తెలివిగా నేర్చుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడు రెండు చేతులా సద్వినియోగం చేసుకుంటున్నారు.
- ప్రధాన బౌలర్లు గాయపడినా, ఐదుగురు బౌలర్లతో కొనసాగారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియాపై ఈ ఆత్మవిశ్వాసం ఎలా పని చేసింది?
మూడేండ్ల కిందటే ఈ ఐదుగురు బౌలర్ల సిద్దాంతాన్ని రూపొందించాం. విదేశీ పర్యటనల్లో ఈ ఐదుగురు బౌలర్ల ఫార్ములాకు కట్టుబడి ఉన్నాం. విదేశీ పరిస్థితుల్లో ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్‌ చేసేందుకు నలుగురు బౌలర్లు ఎంతో ఎంతో శ్రమించాలి. నలుగురు బౌలర్లకు అది కఠినమైన పని. నా అభిప్రాయం ప్రకారం, విరాట్‌ కోహ్లి, రవిశాస్త్రిలు విదేశాల్లో ఐదుగురు బౌలర్లతో ఆడేందుకు ఎంతో పట్టుదలగా ఉన్నారు. కొన్నిసార్లు పరాజయాలు చవిచూడవచ్చు. కానీ ఈ బౌలింగ్‌ బృందాన్ని ముందుకు నడిపిస్తున్న సిద్ధాంతం భయమెరుగని తత్వమే. అత్యుత్తమ స్థాయిని అందుకునే దారిలో పరాజయాలను లెక్కచేయం. కొన్ని మ్యాచులు ఓడిపోతాం, మరికొన్ని మ్యాచులు పాఠాలు నేర్పుతాయి. స్పోర్ట్స్‌ అంటేనే పరాజయాలు. ఓటములు ఎదురైనప్పుడు, ఏ విధంగా పుంజుకుంటామనేది ముఖ్యం. అదే సూత్రం భారత జట్టు విశ్వసించింది.
బ్రిస్బేన్‌ ఆఖరు టెస్టులోనూ అదనపు బ్యాట్స్‌మన్‌ను ఆడించటంపై చర్చ నడిచింది. కానీ అది ప్రతికూల ఆలోచన అవుతుందని భావించాం. కెప్టెన్‌ అజింక్య రహానె, చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి సహా అందరం ఐదుగురు బౌలర్ల ఫార్ములా మనకు పని చేసింది, ఇక్కడా అదే ఫార్ములాను కొనసాగిద్దామని అనుకున్నాం. నెట్స్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ బ్యాటింగ్‌ చేసిన తీరు అతడు బ్యాట్‌తో రాణిస్తాడనే నమ్మకం కలిగించింది. అతడు ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ అయినా, పాజిటివ్‌గా ఉండి ఐదుగురు బౌలర్లతోనే ఆడాలని అనుకున్నాం.
- బ్రిస్బేన్‌లో భారత్‌ విజయం అనంతరం టీమ్‌ ఇండియా భయమెరుగని క్రికెట్‌పై చర్చ నడుస్తోంది. ఈ వాతావరణం ఏ విధంగా సృష్టించారు?
నువ్వు ఎప్పుడైతే భయపడుతున్నావో, నీకు నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నట్టే, ఇక అంతిమ ఫలితం గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ప్రక్రియను పట్టించుకోవటం లేనట్టు. ఓటమి వద్దనుకుని, సురక్షితంగా ఆడే స్టయిల్‌లోనే భయం ఉంటుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రిలు ఓటమి చెందేందుకు భయపడక్కర్లేదని పదేపదే చెబుతారు. చివరి టెస్టులో భారత కుర్రాళ్ల క్యారెక్టర్‌ బయటపడింది. ఫలితం గురించి ఆలోచన చేయకుండా, స్వేచ్ఛగా ఆడమని చెప్పాం. రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఆడిన తీరు తర్వాత.. చతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌ వీరోచితం గురించి మరిచిపోకూడదు. ఏమాత్రం భయపడకుండా పంత్‌, సుందర్‌లు ఆడారు. వారు ఓటమి గురించి భయపడలేదు. మ్యాచ్‌లో విజయం కోసం పోరాడారు. అందుకు ఎంతో ధైర్యం కావాలి. నేను భయమెరుగని క్రికెట్‌ అనేది పిలిచేది దానినే. కొన్నిసార్లు మనం మ్యాచ్‌లో పరాజయం పొందవచ్చు, కానీ ఆ ఓటమి కెరీర్‌లో ఎంతో విలువైన పాఠం నేర్పుతుంది. భవిష్యత్‌లో ఆ పాఠం మెరుగైన క్రికెటర్‌గా రూపుదిద్దుకునేందుకు దోహదం చేస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిచ్చి పిచ్చిగా పిచ్‌
యూసుఫ్‌ పఠాన్‌ వీడ్కోలు
జపాన్‌ కు ఒలింపిక్స్‌ కళ
అక్షర్‌ 2.0
బాధను ప్రేరణగా చేసుకుంటాం
వింటర్‌ స్పోర్ట్స్‌ వేదిక గుల్‌మార్గ్‌
రెండు రోజుల్లోనే..
స్థాయికి తగ్గ ప్రదర్శన చేశామ‌ని అనుకోవటం లేదు
సద్వినియోగం చేసుకోలేదు
400 వికెట్లు క్లబ్‌ లో అశ్విన్‌
అక్షర్‌ సిక్సర్‌
పటేల్‌ కాదు మోడీ స్టేడియం
గెలుపే లక్ష్యంగా..
మోతెరాకు రాష్ట్రపతి
నేడు ఆడుతున్నాను
రెండు టెస్టులూ గెలుస్తాం!
సచిన్ క్రికెట్ పాఠాలు.. ఫ్రీ..
గులాబీ టర్నర్‌?
ప్రకటనలకు పరిమితులు!
హెచ్‌సీఏ అక్రమాలపై విచారణ జరపాలి
తెవాటియా చితక్కొట్టాడు !
ఐఎస్‌ఎల్‌ తరహాలో ఐపీఎల్‌ !
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జకోవిచ్‌
ఆ విషయంలో భారత్‌ను తప్పుబట్టలేం..!
ఒసాకాదే టైటిల్‌
ఫిట్టా..అన్‌ ఫిట్టా..!
దుమ్ము రేపాడు..
అందుకే వేలం వెర్రి!
ఫైనల్లో మెద్వదేవ్‌
సెరెనా కథ ముగిసే..

తాజా వార్తలు

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

01:53 PM

సైకిల్​ను ఢీకొట్టిన బొలెరో వాహనం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

01:44 PM

ఎన్నిక‌ల నేప‌థ్యంలో దాడుల‌కు పాల్ప‌డుతున్నారు: చ‌ంద్ర‌బాబు

01:37 PM

నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఆడి కారు బీభత్సం..

01:25 PM

తెలంగాణలో కాంగ్రెస్ మాజీ ఎంపీకి షాక్..

01:17 PM

మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చుతాం: య‌న‌మ‌ల

01:10 PM

సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే

12:59 PM

విద్యావ్యవస్థలో మార్పులు రావాలి : రాహుల్ గాంధీ

12:48 PM

జగిత్యాల జిల్లాలో కారు ఢీకొని బాలుడు మృతి

12:40 PM

ముగిసిన రామమందిరం విరాళాల సేకరణ..రూ.2వేల కోట్లు వసూలు

12:29 PM

అప్పు తీర్చలేదని స్నేహితుడిపై కత్తితో దాడి

12:20 PM

గెలిచే టీడీపీ అభ్యర్థులను.. జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్

12:08 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దారుణ హత్య..

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

10:50 AM

షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.