Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కంగారూ జోరు! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 16,2021

కంగారూ జోరు!

- శతకంతో చెలరేగిన మార్నస్‌ లబుషేన్‌
- అరంగేట్ర నటరాజన్‌కు రెండు వికెట్లు
- రాణించిన సైని, వాషింగ్టన్‌ సుందర్‌
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 274/5
- భారత్‌, ఆస్ట్రేలియా నాల్గో టెస్టు తొలి రోజు

        రెండు టెస్టులు ఆడిన మహ్మద్‌ సిరాజే భారత పేస్‌ దళానికి నాయకుడు. అరంగేట్ర మాయగాడు వాషింగ్టన్‌ సుందరే స్పిన్‌ దాడికి దళపతి. విదేశీ టెస్టులో నటరాజన్‌, షార్దుల్‌ ఠాకూర్‌ రూపంలో ఇద్దరు అరంగేట్ర పేసర్లు. బ్రిస్బేన్‌ టెస్టు హీరోలు విహారి, అశ్విన్‌, జడేజాలు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో సొంతగడ్డపై నిర్ణయాత్మక టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా స్పష్టమైన ఫేవరేట్‌.  భారత అరంగేట్ర హీరోలు గబ్బాలో గర్జించారు. తంగరసు నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, షార్దుల్‌ ఠాకూర్‌లు వికెట్ల వేటలో ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ (105) శతకంతో చెలరేగినా.. ఆతిథ్య జట్టు జోరుకు భారత్‌ పాక్షికంగా కళ్లెం వేసింది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా 274/5తో మెరుగైన స్థితిలో నిలిచినా.. భారత్‌ సైతం ఆకర్షణీయ ప్రదర్శనే చేసింది.
బ్రిస్బేన్‌ (ఆస్ట్రేలియా)
మార్నస్‌ లబుషేన్‌ (108, 204 బంతుల్లో 9 ఫోర్లు) ఎట్టకేలకు భారత్‌పై శతకం సాధించాడు. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో తొలి టెస్టు నుంచీ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్న లబుషేన్‌ మూడెంకల స్కోరు చేసేందుకు భారత బౌలర్లు ససేమిరా అనేశారు. కానీ గబ్బాలో లబుషేన్‌ గర్జించాడు. 108 పరుగుల ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మాథ్యూ వేడ్‌ (45, 87 బంతుల్లో 6 ఫోర్లు), స్టీవ్‌ స్మిత్‌ (36, 77 బంతుల్లో 5 ఫోర్లు) సైతం రాణించారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు 274/5 స్కోరు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కామెరూన్‌ గ్రీన్‌ (28 బ్యాటింగ్‌, 70 బంతుల్లో 3 ఫోర్లు), టిమ్‌ పైనె (38 బ్యాటింగ్‌, 62 బంతుల్లో 5 ఫోర్లు) అజేయంగా ఆడుతున్నారు. అరంగేట్ర బౌలర్లు తంగరసు నటరాజన్‌ (2/63), వాషింగ్టన్‌ సుందర్‌ (1/63), షార్దుల్‌ ఠాకూర్‌ (1/67)లు వికెట్లు తీసుకున్నారు. దీంతో, తొలి రోజు ఆస్ట్రేలియా జోరుకు కాస్తయినా బ్రేక్‌ పడింది. నేడు ఉదయం సెషన్లో భారత బౌలర్లు ఆసీస్‌ తోకను కత్తిరిస్తే... మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చేందుకు అవకాశం ఉంది.
తొలి సెషన్‌ : వార్నర్‌కు సిరాజ్‌ స్ట్రోక్‌
కీలకమైన టాస్‌ గెల్చుకున్న ఆస్ట్రేలియా మరో ఆలోచనకు తావులేకుండా, తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఐదేండ్లలో సొంతగడ్డపై తొలిసారి సింగిల్‌ డిజిట్‌ స్కోరుకు పరిమితమైన డెవిడ్‌ వార్నర్‌ను హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మరోసారి ఆరంభంలోనే వెనక్కి పంపించాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ ఆరో బంతికే డెవిడ్‌ వార్నర్‌ (1)ను సిరాజ్‌ అవుట్‌ చేశాడు. డెవిడ్‌ వార్నర్‌ను అద్భుతమైన బంతితో సిరాజ్‌ బుట్టలో వేసుకున్నాడు. సిరాజ్‌ బంతిని సంశయంతో ఆడేసిన వార్నర్‌ తొలి స్లిప్స్‌లో క్యాచ్‌ ఇవ్వగా.. రెండో స్లిప్స్‌లో ఉన్న రోహిత్‌ శర్మ డైవ్‌ చేస్తూ క్యాచ్‌ను ఒడిసిపట్టుకున్నాడు. మరో ఓపెనర్‌ మార్కస్‌ హారిశ్‌ (5) సైతం ఎంతోసేపు నిలువలేదు. అరంగేట్ర సీమర్‌ షార్దుల్‌ ఠాకూర్‌ టెస్టు క్రికెట్‌లో సంధించిన 11వ బంతికే వికెట్‌ను సాధించాడు. సిరాజ్‌, షార్దుల్‌ దెబ్బకు 17 పరుగులకే ఆస్ట్రేలియా ఓపెనర్లను కోల్పోయింది. ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయిన ఆస్ట్రేలియాను ఇద్దరు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ నిలబెట్టారు. మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌లు ఉదయం సెషన్లో మరో వికెట్‌ పడకుండా నిలువరించారు. తొలి సెషన్‌ను ఆస్ట్రేలియా 65/2తో ముగించింది.
రెండో సెషన్‌ : మార్నస్‌ లబుషేన్‌ మెరుపుల్‌
మార్నస్‌ లబుషేన్‌తో కలిసి స్టీవ్‌ స్మిత్‌ ఆస్ట్రేలియాను పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. స్మిత్‌, లబుషేన్‌ మరింత ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో అరంగేట్ర స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. లెగ్‌ సైడ్‌ వ్యూహంతో స్టీవ్‌ స్మిత్‌కు బంతులు సంధించిన వాషింగ్టన్‌ సుందర్‌.. ఎట్టకేలకు స్మిత్‌ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్యాడ్ల మీదుకు దూసుకొచ్చిన బంతిని స్మిత్‌ ఫ్లిక్‌ చేశాడు. షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో ఉన్న రోహిత్‌ శర్మ క్యాచ్‌ను పూర్తి చేయటంతో స్టీవ్‌ స్మిత్‌ (36, 77 బంతుల్లో 5 ఫోర్లు) పోరాటానికి తెరపడింది. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌ స్మిత్‌ వికెట్‌తో వాషింగ్టన్‌ సుందర్‌ టెస్టు కెరీర్‌ను మొదలెట్టాడు. స్మిత్‌ నిష్క్రమణ అనంతరం లబుషేన్‌తో మాథ్యూ వేడ్‌ (45, 87 బంతుల్లో 6 ఫోర్లు) జతకలిశాడు. లంచ్‌ విరామం అనంతరం ఆస్ట్రేలియా ఒకే ఒక్క వికెట్‌ కోల్పోయింది. తొలి సెషన్‌లో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచిన భారత బౌలర్లు.. రెండో సెషన్లో ఒత్తిడిని కొనసాగించలేకపోయారు. దీంతో రెండో సెషన్‌ నుంచే పరుగుల ప్రవాహం మొదలైంది. మార్నస్‌ లబుషేన్‌ 145 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో సిరీస్‌లో మరో అర్థ సెంచరీ సాధించాడు. లంచ్‌ లోపే ఆస్ట్రేలియా 150 పరుగుల మార్క్‌ దాటేసింది. రెండో సెషన్‌ను ఆస్ట్రేలియా 154/3తో పటిష్ట స్థితిలో ముగించింది. స్టీవ్‌ స్మిత్‌ను అవుట్‌ చేసిన ఆనందం మాత్రమే భారత్‌కు మిగిలింది.
మూడో సెషన్‌ : ఆసీస్‌ పరుగుల వరద
మూడో సెషన్లో ఆస్ట్రేలియా వేగంగా పరుగులు పిండుకుంది. ఈ ఒక్క సెషన్‌లోనే కంగారూలు ఏకంగా 120 పరుగులు సాధించారు. నం.3 బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ సిరీస్‌లో ఎట్టకేలకు శతకం సాధించాడు. ఆడిలైడ్‌ నుంచి ఆకట్టుకునే ప్రదర్శన చేసినా.. మూడంకెల స్కోరును మాత్రం గబ్బాలోనే చేరుకున్నాడు. 9 బౌండరీలు బాదిన లబుషేన్‌ 195 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో మాథ్యూ వేడ్‌ అండ సైతం తోడైంది. అరంగేట్ర పేసర్‌, యార్కర్ల యువరాజు తంగరసు నటరాజన్‌ మూడో సెషన్లో మెరిశాడు. రెండు వికెట్లు పడగొట్టి భారత్‌ను మ్యాచ్‌ రేసులోకి తీసుకొచ్చాడు. నటరాజన్‌ షార్ట్‌ బంతికి శతక హీరో లబుషేన్‌ (108, 204 బంతుల్లో 9 ఫోర్లు) వికెట్ల వెనకాల పంత్‌కు చిక్కాడు. అంతకముందే, మాథ్యూ వేడ్‌ను సైతం షార్ట్‌ బాల్‌తోనే నటరాజన్‌ వెనక్కి పంపించాడు. పరుగుల వరద పారిస్తున్న ఈ జోడిని నటరాజన్‌ అవుట్‌ చేయటంతో భారత్‌ ఉత్సాహపడింది. కానీ కామెరూన్‌ గ్రీన్‌ (28 నాటౌట్‌, 70 బంతుల్లో 3 ఫోర్లు), టిమ్‌ పైనె (38 నాటౌట్‌, 62 బంతుల్లో 5 ఫోర్లు) ఆరో వికెట్‌కు అజేయంగా 61 పరుగులు జోడించారు. తొలి రోజు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఈ జోడీ 20 పైచిలుకు ఓవర్ల పాటు భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలుస్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 274/5తో కొనసాగుతోంది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : డెవిడ్‌ వార్నర్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) మహ్మద్‌ సిరాజ్‌ 1, మార్కస్‌ స్టోయినిస్‌ (సి) వాషింగ్టన్‌ సుందర్‌ (బి) షార్దుల్‌ ఠాకూర్‌ 5, మార్నస్‌ లబుషేన్‌ (సి) రిషబ్‌ పంత్‌ (బి) నటరాజన్‌ 108, స్టీవ్‌ స్మిత్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) వాషింగ్టన్‌ సుందర్‌ 36, మాథ్యూ వేడ్‌ (సి) షార్దుల్‌ ఠాకూర్‌ (బి) నటరాజన్‌ 45, కామెరూన్‌ గ్రీన్‌ బ్యాటింగ్‌ 28, టిమ్‌ పైనె బ్యాటింగ్‌ 38, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (87 ఓవర్లలో 5 వికెట్లకు) 274.
వికెట్ల పతనం : 1-4, 2-17, 3-87, 4-200, 5-213.
బౌలింగ్‌ : మహ్మద్‌ సిరాజ్‌ 19-8-51-1, తంగరసు నటరాజన్‌ 20-2-63-2, షార్దుల్‌ ఠాకూర్‌ 18-5-67-1, నవదీప్‌ సైని 7.5-2-21-0, వాషింగ్టన్‌ సుందర్‌ 22-4-63-1, రోహిత్‌ శర్మ 0.1-0-1-0.

సెషన్ల వారీగా..
తొలి సెషన్‌
పరుగులు : 65
వికెట్లు : 02
ఓవర్లు : 27
రెండో సెషన్‌
పరుగులు : 89
వికెట్లు : 01
ఓవర్లు : 27
మూడో సెషన్‌
పరుగులు : 120
వికెట్లు : 02
ఓవర్లు : 33

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిచ్చి పిచ్చిగా పిచ్‌
యూసుఫ్‌ పఠాన్‌ వీడ్కోలు
జపాన్‌ కు ఒలింపిక్స్‌ కళ
అక్షర్‌ 2.0
బాధను ప్రేరణగా చేసుకుంటాం
వింటర్‌ స్పోర్ట్స్‌ వేదిక గుల్‌మార్గ్‌
రెండు రోజుల్లోనే..
స్థాయికి తగ్గ ప్రదర్శన చేశామ‌ని అనుకోవటం లేదు
సద్వినియోగం చేసుకోలేదు
400 వికెట్లు క్లబ్‌ లో అశ్విన్‌
అక్షర్‌ సిక్సర్‌
పటేల్‌ కాదు మోడీ స్టేడియం
గెలుపే లక్ష్యంగా..
మోతెరాకు రాష్ట్రపతి
నేడు ఆడుతున్నాను
రెండు టెస్టులూ గెలుస్తాం!
సచిన్ క్రికెట్ పాఠాలు.. ఫ్రీ..
గులాబీ టర్నర్‌?
ప్రకటనలకు పరిమితులు!
హెచ్‌సీఏ అక్రమాలపై విచారణ జరపాలి
తెవాటియా చితక్కొట్టాడు !
ఐఎస్‌ఎల్‌ తరహాలో ఐపీఎల్‌ !
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జకోవిచ్‌
ఆ విషయంలో భారత్‌ను తప్పుబట్టలేం..!
ఒసాకాదే టైటిల్‌
ఫిట్టా..అన్‌ ఫిట్టా..!
దుమ్ము రేపాడు..
అందుకే వేలం వెర్రి!
ఫైనల్లో మెద్వదేవ్‌
సెరెనా కథ ముగిసే..

తాజా వార్తలు

05:56 PM

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

01:53 PM

సైకిల్​ను ఢీకొట్టిన బొలెరో వాహనం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

01:44 PM

ఎన్నిక‌ల నేప‌థ్యంలో దాడుల‌కు పాల్ప‌డుతున్నారు: చ‌ంద్ర‌బాబు

01:37 PM

నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఆడి కారు బీభత్సం..

01:25 PM

తెలంగాణలో కాంగ్రెస్ మాజీ ఎంపీకి షాక్..

01:17 PM

మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చుతాం: య‌న‌మ‌ల

01:10 PM

సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే

12:59 PM

విద్యావ్యవస్థలో మార్పులు రావాలి : రాహుల్ గాంధీ

12:48 PM

జగిత్యాల జిల్లాలో కారు ఢీకొని బాలుడు మృతి

12:40 PM

ముగిసిన రామమందిరం విరాళాల సేకరణ..రూ.2వేల కోట్లు వసూలు

12:29 PM

అప్పు తీర్చలేదని స్నేహితుడిపై కత్తితో దాడి

12:20 PM

గెలిచే టీడీపీ అభ్యర్థులను.. జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్

12:08 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దారుణ హత్య..

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.