Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధన నిలిపివేసిన న్యూజిలాండ్
క్రైస్ట్ చర్చ్ : పాకిస్థాన్ క్రికెట్ శిబిరంలో కరోనా వైరస్ కలకలం. న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్ కోసం క్రైస్ట్‌చర్చ్‌కు చేరుకున్న పాకిస్థాన్ ఆటగాళ్లు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలారు. బయో సెక్యూర్ బబుల్ ప్రోటోకాల్ అతిక్రమించటంతోనే ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ కేసులతో పాకిస్థాన్ క్రికెట్ ట్రైనింగ్‌ను నిలిపివేశారు. ' పాకిస్థాన్ క్రికెట్‌లో వెలుగుచూసిన ఆరు పాజిటివ్ కేసుల్లో నలుగురు గతంలో కోవిడ్19 బారిన పడ్డారు. ఇద్దరికి కొత్తగా వైరస్ సోకింది. కరోనా కేసులతో ఐసోలేషన్‌లో అనుమతించిన ట్రైనింగ్‌ను నిలిపివేశారు. న్యూజిలాండ్‌కు చేరుకున్న తొలి రోజే ఐసోలేషన్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు నిబంధనలు అతిక్రమించినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ జట్టు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతున్నాం, వారికి అవసరమైన సౌకర్యాలపై అర్థం చేసుకుంటున్నాం' అని న్యూజిలాండ్ క్రికెట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు సైతం పాకిస్థాన్ క్రికెట్‌లో పది కోవిడ్19 పాజిటివ్ కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.