Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీఫైనల్లో కండ్లుచెదిరే గెలుపు
-ఏటీపీ టూర్ ఫైనల్స్
లండన్ (ఇంగ్లాండ్) : ప్రపంచ నం.1, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌కు దిమ్మదిరిగే షాక్. ఏడాది ఆఖరులో అగ్ర క్రీడాకారులు పోటీపడే ఏటీపీ ఫైనల్స్‌లో సెర్బియా యోధుడికి చుక్కెదురు తప్పలేదు. యుఎస్ ఓపెన్ చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ఏటీపీ టూర్ ఫైనల్స్ సెమీఫైనల్లో జకోవిచ్‌పై కండ్లుచెదిరే విజయం సాధించాడు. మూడు సెట్ల పాటు ఉత్కంఠ సాగిన సమరంలో థీమ్ విజయాన్ని అందుకున్నాడు. 7-5, 6-7(10-12), 7-6(7-5)తో జకోవిచ్‌ను వరుసగా రెండు సూపర్ టైబ్రేకర్లలో ఓడించి ఏటీపీ ఫైనల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి సెట్‌ను 7-5తో సొంతం చేసుకున్న డొమినిక్ థీమ్.. రెండో సెట్‌ను సైతం వశం చేసుకునేలా కనిపించాడు. కానీ జకోవిచ్ పోరాట పటిమ చూపించాడు. 6-6తో స్కోరు సమం అయిన వేళ సూపర్ టైబ్రేకర్‌లో 12-10తో థీమ్‌ను వెనక్కి నెట్టాడు. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లాడు. ఇక మూడో సెట్‌లోనూ ఇద్దరూ పోటీపడి ఆడారు. నిర్ణయాత్మక సెట్ సైతం టైబ్రేకర్‌కు దారితీసింది. కానీ ఈ సారి థీమ్ మెరిశాడు. 7-5తో జకోవిచ్‌ను ఫటాఫట్ ఓడించాడు. ఏటీపీ టూర్ ఫైనల్స్ టైటిల్‌పోరుకు సై అన్నాడు. మరో సెమీఫైనల్లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వదెవ్‌తో రఫెల్ నాదల్ (స్పెయిన్) పోటీపడనున్నాడు.