Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ
న్యూఢిల్లీ: టీమిండియా కిట్ కొత్త స్పాన్సర్‌గా ఎంపిఎల్ నిలిచింది. వాణిజ్య భాగస్వామిగా 'ఎంపిఎల్ స్పోర్ట్స్'తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ ఆటగాళ్ల కిట్ స్పాన్సర్‌గా ఉన్న నైక్ స్థానంలో ఎంపిఎల్ వచ్చి చేరనుంది. నైక్ కుదుర్చుకున్న గడువు 2020తో ముగియడంతో ఇప్పటినుంచి 2023వరకు ఎంపిఎల్ కిట్ స్పాన్సర్‌గా ఉండనుంది. గతంలో 2016 నుంచి 2020వరకు ఐదేళ్ళ కాలానికి నైక్ రూ.370 కోట్లకు కిట్ స్పాన్సర్ హక్కులను దక్కించుకుంది. ఒప్పందంలో భాగంగా సీనియర్ పురుషుల, మహిళల, అండర్-19 జట్టు ఆటగాళ్ళు ఇకపై ఎంపీఎల్ దుస్తులను ధరించనున్నారు. ఎంపిఎల్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ బ్రాండ్లు, మొబైల్ ప్రిమియర్ లీగ్, ఇ-స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రపంచవ్యాప్తంగా కలిగి ఉంది. దీంతో ఇక ఆటగాళ్లు ధరించే క్రీడా పరికరాలు, ఇతర వస్తువులు, మాస్క్‌లు, మోచేతి బ్యాండ్స్, బూట్లు, హెల్మెట్లపై ఎంపిఎల్ బ్రాండ్ ఉండనుంది. నవంబర్ 2న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ఎంపిఎల్ ఆ హక్కులను దక్కించు కున్నా.. అధికారికంగా బీసీసీఐ నేడు ప్రకటించింది. టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటననుంచి కొత్త స్పాన్సర్ దుస్తులను ధరించనున్నారు. బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ.. టీమిండియా కిట్‌లో ఎంపీఎల్ స్పోర్ట్స్ కొత్త అధ్యాయాన్ని సృష్టించాలని, లక్షలాది అభిమానులకు బిసిసిఐ అనుమతిచ్చిన వస్తువులను సులువగా అందజేయ డానికి ప్రయత్నిస్తాం' అని పేర్కొన్నారు. ఐపిఎల్‌లో కోల్‌కతా, బెంగళూరు జట్ల ఫ్రాంచైజీలతో ఎంపిఎల్ స్పోర్ట్స్ అనుబంధంం కలిగి ఉంది. కొత్త కిట్ స్పాన్సర్ హక్కులు దక్కించుకున్న ఎంపిఎల్‌కు బిసిసిఐ సెక్రటరీ జే షా, ధన్యవాదాలు తెలిపారు.